Culvert
-
అతివేగంతో అదుపుతప్పి కెనాల్లో పడిన కారు
గజ్వేల్: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ముని గడపలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలితీసుకుంది. అతివేగం వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న కొండ పోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్ను మూశారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య(38).. భార్య స్రవంతి(36), కూతురు భవ్య(13), కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేశ్ (11)లతో పాటు అదే జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన మామ బిట్టు వెంకటేష్ (58), అత్త రాజమణి(56)లను తీసుకొని ఆల్టో కారులో తనే డ్రైవింగ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం వేములవాడ రాజన్న ఆల యానికి వెళ్లాడు. సమ్మయ్య ఏటా ఆలయానికి ఆనవాయి తీగా వెళ్తుంటాడు. మొక్కుతీర్చుకొని వీరంతా మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. తక్కువ దూరం ఉంటుందని భావించి రాజీవ్ రహదారిపై ఉన్న గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి జగదేవ్‌పూర్, భువనగిరి వైపు వచ్చారు. కల్వర్టును ఢీకొట్టిన తర్వాత.. మార్గమధ్యలో మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మునిగడప గ్రామ స్టేజీ సమీపంలో ఎల్లమ్మ ఆలయం వద్ద మలుపు దాటిన తర్వాత కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం నిర్మించిన కల్వర్టును వేగంగా ఢీకొట్టాడు. దాంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. ఇదే క్రమంలో స్టీరింగ్ తిప్పి ఎక్సలేటర్ మరింత పెంచడంతో కారు వేగంగా ఎడమ నుంచి కుడివైపు దూసుకువెళ్లి మట్టిగడ్డను తాకింది. దాని పైనుంచి కాల్వలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను తాకి అందులో పడిపోయింది. అప్పటికే కాల్వలో నీరు ఉండడం వల్ల కారు తలకిందులైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడడంతో పాటు కారులోకి నీరుచేరడంతో నీటమునిగి ఊపిరాడనిస్థితిలో కొట్టుమిట్టా డారు. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు హుటాహుటిన పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం, ఇదే సమయంలో ఎస్ఐ కృష్ణమూర్తి, గజ్వేల్‌రూరల్ సీఐ రాజశేఖరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని నీటమునిగిన వారిని బయటకు తీశారు. అప్పటికే సమ్మయ్య, స్రవంతి, భవ్య, కార్తీక్‌లతో పాటు రాజమణిలు మృతి చెందినట్లు గుర్తించారు. వెంకటేష్ మాత్రం విషమస్థితిలో ఉన్నట్టు గమనించి ఆయన్ను చికిత్స నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను అక్క డి నుంచి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. ఆర్ధికంగా ఇంకా కుదురు కోని సమ్మయ్య కుటుంబ పోషణ నిమిత్తం స్టీల్ సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరో మృతుడు సమ్మయ్య మామ వెంకటేష్‌ది రెక్కాడితేగాని డొక్క నిండని కుటుంబం. కారు కండీషన్లో లేకపోవడం... మృతులు ప్రయాణించిన కారు కండీషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వెంకటే– రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కూలీలు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకుని ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైనా దినసరి కూలీ లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో పూరీ్వకుల నుంచి ఆచారంగా వచి్చన వృత్తిలో భాగంగా భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి మునిగడపలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాల పోస్టుమార్టంతో పాటు ఇతర సహాయక చర్యలను వెనువెంటనే జరిపించేందుకు దగ్గరుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీ శ్వేతలను ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్, సీపీలు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం త్వరగా జరిపించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులతో పాటు పోలీసులకు సూచించారు. -
మోర్బీ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన
లక్నో: ఛట్ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. #WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw — ANI (@ANI) October 31, 2022 ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే.. -
కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు
బద్వేలు అర్బన్/బి.మఠం : బద్వేలు–మైదుకూరు రహదారిలోని వాంపల్లెచెరువు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు కల్వర్టును ఢీకొన్న ఘటనలో 16 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ టీఎస్ రాయుడు (ఇ405030) నిర్లక్ష్యం, అతివేగంగా నడపడమేనని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మైదుకూరు డిపోకు చెందిన ఏపీ 29 జెడ్0682 నంబరు గల ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 2.30 గంటలకు 27 మంది ప్రయాణికులతో బద్వేలుకు బయల్దేరింది. వాంపల్లెచెరువు సమీపంలోకి రాగానే బస్సు రోడ్డుకు ఓ వైపు ఉన్న కల్వర్టును వేగంగా ఢీకొంది. దీంతో వెనుక టైరు వరకు కల్వర్టు గోడపై బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కండక్టర్ పీవీ సుబ్బయ్య (ఇ400577)తో పాటు బస్సులోని 16 మందికి గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను డ్రైవర్ ద్వారం నుంచి కిందికి దించారు. 108 సాయంతో వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన వారి వివరాలు: బద్వేలు–మైదుకూరు రహదారిలోని వాంపల్లెచెరువు వద్ద చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ఎక్కువ మంది బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన వారు గాయపడ్డారు. వీరంతా ఖాజీపేటలో జరిగే ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్నారు. సుందరయ్యకాలనీకి చెందిన రమణయ్య, మైదుకూరులోని సాయినాథపురానికి చెందిన సుబ్బయ్య, పోరుమామిళ్లలోని సిద్దవరానికి చెందిన బాలయ్య, బీ మఠం మండలం టీ రామాపురానికి చెందిన సుజాత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కడప రిమ్స్‌కు తరలించారు. బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన బాలమ్మ, ఖాజాబీ, షమీనా, ఫాతిమా, ఖైరున్‌బీ, రసూల్‌బీ, ముస్తఫాతో పాటు పట్టణంలోని బసవ వీధికి చెందిన వేణుగోపాల్, నాగ రాఘవాచారి, మంగళ కాలనీకి చెందిన రఫితో పాటు రామాపురానికి చెందిన మధు, సిద్దవరానికి చెందిన సాలమ్మకు గాయాలయ్యాయి. బీ మఠం ఎస్ఐ రాజగోపాల్‌తో పాటు అర్బన్ ఎస్ఐ లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల వివరాలను, ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. బీ మఠం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిబంధనలకు పాతర.. అవినీతి జాతర
సాక్షి, రేపల్లె (గుంటూరు) : నీకింత.. నాకంత.. అంటూ అభివృద్ధి పనుల మాటున ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పంచుకున్నారు. అడిగేది, అడ్డుకునేది ఎవరు అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అధికారులు, కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు పూర్తిచేసి నిధులు మిగుల్చుకున్నారు. ఆ తరువాత వాటాలేసుకుని ఆ నిధులను స్వాహా చేశారు. నిర్మించిన నెలల వ్యవధిలోనే రోడ్లు, డ్రెయిన్లు ధ్వంసం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అవినీతి గుట్టును రట్టుచేశారు. పట్టణంలో గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సుమారు రూ.22 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. నెలలు గడవకముందే రోడ్లు గుంతల మయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడంతో పట్టణ ప్రజలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణలో అవినీతి గుట్టు రట్టుయింది. పనుల నాణ్యతను తనిఖీచేసి నిర్ధారించాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమార్కులకు అండగా నిలిచారని నిగ్గుతేల్చారు.పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థను ఉన్నతాధికారులు బ్లాక్ లిస్ట్‌లో, పెట్టి సంబంధిత మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫారసు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మెల్యే అనగాని ఆధ్వర్యంలోనే.. రేపల్లె పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే అనగాని ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అండతో పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పనులను నాసిరకంగా పూర్తిచేసింది. నిర్మించి నెలలు కూడా గడవకముందే రోడ్లు గోతులమయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడం ఈ పనుల్లో అవి నీతిని పట్టిచూపుతున్నాయి. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, అధికారులు నిధులను పంచుకుని పనులు నాసిరకంగా చేయడం వల్లే రోడ్లు ధ్వంసం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అనగాని పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యమని పట్టణ ప్రజలు విర్శి స్తున్నారు. కల్వర్టుల్లో నిధుల స్వాహా నిజాంపట్నం మండలం అడవులదీవి – కొత్తపాలెం రహదారి 5 కిలో మీటర్లు, మంత్రిపాలెం – అడవులదీవి రహదారి 3 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఈ పనులను రూ.10 కోట్లతో నిర్వహించారు. అడవులదీవి – కొత్తపాలెం రోడ్డు నిర్మాణంలో తూములలో 8 కల్వర్టులు, ఒక చోట శ్లాబ్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. అయితే శ్లాబ్ కల్వర్టు స్థానంలో తూములతో సరిపెట్టారు. మిగిలిన కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేశారు. రోడ్డు మధ్యలో కొత్త తూములు వేసి కల్వర్టులు నిర్మించాలన్నది నిబంధన. అయితే పాత తూములనే వినియోగించి కల్వర్టుల నిర్మాణం పూర్తిచేసి, నిధులు మిగుల్చుకుని పంచుకున్నారు. ఈ రోడ్ల విస్తరణ పనుల్లో స్థానిక ప్రజల వినతులను సైతం పట్టించుకోలేదు. అధికార వర్గాల్లో గుబులు 2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కాంట్రాక్టర్ల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు దండుకుని అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతికి తావిచ్చారు. అదేమని కాంట్రాక్టర్లను ప్రశ్నించే పరిస్థితి అధికారులకు లేకుండా వారిపై ఒత్తిడితెచ్చారు. ఐదేళ్లు పూర్తికావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తూ తమపై చర్యలకు సిఫారసులు చేస్తుంటే తనకు సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యే అనగాని వ్యవహరిస్తున్నాడని పలువురు అధికారులు వాపోతున్నారు. నిర్మాణంలోనే కూలిన శ్లాబ్ గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ సమయంలో కుప్పకూలిన శ్లాబ్ చెరుకుపల్లి–నగరం, నగరం–రేపల్లె అభివృద్ధి పనుల్లోనూ అవినీతి పొంగిపొర్లింది. ఈ రోడ్లు కూడా నిర్మించిన నెలల వ్యవధిలోనే గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు బినామీగా వ్యవహరిస్తున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి ఈ రోడ్ల నిర్మాణ పనులు దక్కించుకుని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను దక్కించుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్లాబ్ వేసిన గంటల వ్యవధిలో కూలిపోంది. దీనిని బట్టే నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో పాటించారో అర్థంచేసుకోవచ్చు. -
కల్వర్టును ఢీకొని జియో మొబైల్ టవర్ సూపర్వైజర్ దుర్మరణం
సాక్షి, పర్లాకిమిడి: స్థానిక పట్టణంలోని సెంచూరియన్ గ్రామ తరంగ్ వద్ద ఉన్న ఓ కల్వర్టును మోటార్‌బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఫారెస్ట్ గేట్ నుంచి కోర్టు జంక్షన్ వరకు కొత్తగా రోడ్డు నిర్మాణం జరుగుతోంది. అదే దారిలో ఇద్దరు వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి మోటారుబైక్‌తో వస్తూ అదే దారిలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాద ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని దగ్గరలోని బరంపురం ఆసుపత్రికి తరలించగా, అతడు కూడా మృతి చెందాడు. సంఘటనా స్థలంలో మృతి చెందిన వ్యక్తిని స్థానిక తెల్లిగుడ వీధికి చెందిన జియో మొబైల్ టవర్ సూపర్వైజర్ తిరుపతి ప్రధాన్‌గా స్థానికులు గుర్తించారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గతంలో ఇదే కల్వర్టును ఓ ప్రైవేట్‌బస్సు ఢీకొన్న ఘటనలో పూజారి అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రమాద విషయంపై మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి, స్థానిక ఫారెస్ట్గేట్ వద్ద మంగళవారం ఉదయం 11 గంటలకు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారి మధ్యలో టైర్లు కాల్చి, అటువైపుగా వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలాస, బరంపురం, హిరమండలం,ఆర్.ఉదయగిరిలనుంచి చ్చిపోయే బస్సులు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోయాయి.ప్రమాదానికి కారణమైన రోడ్డు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చెల్లించాలని కోరారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారి ఠాకుర్ ప్రసాద్, తహసీల్దారు సింహాచలం ప్రధాన్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ లక్ష్మీకాంత పాఢి, సబ్ కలెక్టర్ స్వయంగా వచ్చి, ఆందోళనకారులతో మాట్లాడి, పరిస్థితిని సద్దుమణిగించారు. -
బడికి ఒంటరిగా పంపితే..!
దిస్పూర్ (అస్సాం) : చిరునవ్వులు చిందిస్తూ బడికి వెళ్లాల్సిన బాల్యం.. బిక్కుబిక్కుమంటూ అడుగులేస్తోంది. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన రోడ్డుని దాటుతూ ప్రమాదపుటంచులలో పయనం సాగిస్తోంది. దరంగ్ జిల్లాలో గల దాల్‌గావ్‌లో కల్వర్టు నిర్మాణం నిర్లక్ష్యానికి గురవడంతో.. కొద్దిపాటి వర్షానికే రెండు గ్రామాల మధ్యనున్న లింకు రోడ్డు నీట మునిగిపోయింది. దీంతో తల్లిదండ్రుల సాయంతో అయిదడుగుల లోతు నీటి కాలువను దాటుకుని ప్రైమరీ స్కూల్ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు. తాటి బొదల సాయంతో 5 అడుగుల నీటిలో ప్రయాణం చేస్తున్న చిన్నారుల ‘సాహస యాత్ర’అక్కడి అధికార యంత్రాగాన్ని వేలెత్తి చూపుతోంది. ఈ-పాఠాలు చెప్పించండి రెక్కాడితేగానీ డొక్కాడని ఆ కుటుంబాలు పిల్లలను పాఠశాలలో దింపడానికి, తిరిగి తీసుకురావడానికి రోజంతా పని వదులుకోవాల్సి వస్తోందని వాపోతున్నాయి. పనికోసం చూసుకొని పిల్లలని ఒంటరిగా బడికి పంపితే ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, దేశాన్ని డిజిటల్ మయం చేస్తానని చెప్తున్న ప్రధాని మోదీ ఈ పిల్లలకు ఈ-పాఠాలు చెప్పిస్తే సరిపోతుంది కదా అని ట్విటర్లో కొందరు కాంమెంట్లు చేస్తున్నారు. -
నీటిలో ఈదితేనే బడి..!
-
విదారక ఘటన
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది. నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
కల్వర్టును పేల్చేసిన మావోయిస్టులు
-
చిన్నారుల ఆర్తనాదాలు
వర్గల్(గజ్వేల్) : ఉర్సు వేడుకల నుంచి తిరుగు ప్రయాణమైన బంధుగణం రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన శుక్రవారం ఉదయం వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు ఆరుగురు మైనర్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరూ సమీప బంధువులు, సికిందరాబాద్‌లోని అల్వాల్–వెంకటాపూర్నివాసులు. క్షతగాత్రుల సంబంధీకులు, పోలీసుల కథనం ప్రకారం... అల్వాల్–వెంకటాపూర్ ప్రాంతానికి చెందిన పి.నర్సింగరావు, కెమ్‌సారం పద్మారావు కుటుంబీకులు, బంధువులు మూడు రోజుల క్రితం రెండు కార్లలో సిద్దిపేట ఉర్సు వేడుకలకు వచ్చారు. శుక్రవారం ఉదయం పిల్లలంతా ఒక కారులో, పెద్ద వాళ్లు మరో కారులో అల్వాల్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో పాతూరు కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయలు కొనుగోలు చేసుకున్నారు. మొదట పిల్లలతో వీర ప్రసాద్(38) కారులో బయల్దేరాడు. కొద్ది నిమిషాల వ్యవధిలో రెండో కారులో మిగతావారు వస్తున్నారు. పిల్లలతో వెళ్తున్న కారు వర్గల్ మండలం గౌరారం జనతా హోటల్ దాటిన కొద్ది సేపటికే అదుపు తప్పింది. అమాంతం రాజీవ్ రహదారిపై నుంచి దాదాపు 20 మీటర్ల దూరం లోతైన కల్వర్టు గొయ్యిలోకి దూకింది. కారులోని నర్సింగరావు కూతుళ్లు పి.సుకన్యలక్ష్మి(15), ప్రతిభాలక్ష్మి(13), అనంతలక్ష్మి(6), పద్మారావు కూతురు కెమ్‌సారం ప్రియాంక(17), సమీప బంధువుల పిల్లలు శ్రీశాంక్(10), గురుతేజస్(2), కారు నడుపుతున్న వీరప్రసాద్(35) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా కారులో ఉన్నవారందరూ గాయపడ్డారు. వీరికి ప్రాణాపాయం లేదని తెలిసింది. హాహా కారాలు.. రోడ్డుపై వెళ్తున్న కారు ఊహించని రీతిలో అదుపు తప్పి గాలిలో తేలుతూ రోడ్డు పక్కన కల్వర్టు గుంతలోకి దూకడంతో అందులోని వారందరూ భీతిల్లిపోయారు. గాయాలతో హాహాకారాలు, ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న గౌరారం ఎస్సై ప్రసాద్ సిబ్బందితో.. గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను కారు నుంచి వెలికి తీశారు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. వెనుకాలే రెండో కారులో వస్తున్న పిల్లల తల్లిదండ్రులు, బంధువులు బోరుమంటూ సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. ఓ వైపు రక్తం ఓడుతున్న గాయాలతో పిల్లలు, వారిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అక్కున చేర్చుకుంటూ, అనునయిస్తూ విలపించారు. అంబులెన్స్ వచ్చేలోగా నలుగురు క్షతగాత్రులను పోలీసులు తమ వాహనంలో గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని ములుగు 108 అంబులెన్స్ సిబ్బంది కొండల్‌రెడ్డి, శోభన్ ప్రాథమిక చికిత్స చేసి గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స అనంతరం క్షతగాత్రుల సంబంధీకుల కోరిక మేరకు హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు బోల్తా కొట్టకపోవడంతో ప్రాణహాని తప్పిందని భావిస్తున్నారు. కారు పూర్తిగా ధ్వంసమైంది. గౌరారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని పోతారం శివారులో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బోల్తా పడటంతో డ్రైవర్‌తో సహా 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికుల కథనం ప్రకారం... కరీంనగర్–2 డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు మండలంలోని పోతారం శివారులో గల రాజీవ్ రహదారిపై బస్సు బోల్తా కొట్టింది. దీంతో ప్రయాణికుల్లో కరీంనగర్‌కు చెందిన మణికందన్, వరంగల్‌కు చెందిన శ్రీకాంత్, మౌనిక, రామడుగుకు చెందిన సురేందర్, జగిత్యాల్‌కు చెందిన జగన్, ధదర్మారానికి చెందిన రూపాని పద్మ, బొమ్మ బాగ్య, సత్తయ్య, వెంకన్నతో పాటు మరో ముగ్గరికి స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ రవి చేయి విరిగింది. తృటిలో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు భయాందోళన చెందారు. సంఘటనా స్థలాన్ని ఆర్టీసీ కరీంనగర్–2 డిపో మేనేజర్ ధర్మ, కంట్రోలర్ సత్యనారాయణ, బెజ్జంకి పోలీసులు పరిశీలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ సంఘటన చోటు చేసుకుందని ప్రయాణికులు చెప్పారు. -
తిరుమలలో మందుబాబు హల్చల్
సాక్షి, తిరుమల: నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుమల ఆలయ మాడ వీధుల్లో మంగళవారం అపవిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరమాడ వీధిలోని ఆదివరాహస్వామి ఆలయం సమీపంలో తమిళనాడుకు చెందిన మణి (35) అనే వ్యక్తి మద్యం సేవించి వీరంగం సృష్టించాడు. విజిలెన్స్ సిబ్బంది అక్కడే ఉన్నా వారించ కుండా చోద్యం చూడటం గమనార్హం. ఈ మేరకు అందిన సమాచారంతో విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలికి వెళ్లగా, వారు చూస్తుండగానే ఆయన దర్జాగా మద్యం సీసా పక్కనే పెట్టుకుని భోజనం చేశాడు. అయినా అతన్ని సిబ్బంది వారించలేదు. ఇంతలో భక్తులందరూ చూస్తుండగానే మణి సీసాæమూత తీసి క్షణాల్లోనే మద్యం సేవించాడు. ఆ తర్వాత నిందితుడిని విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. అయితే మద్యం మత్తు ఎక్కువ అవడంతో మణి స్పృహకోల్పోయాడు. నిందితుడిని రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేశామని తిరుమల ఎక్సైజ్ సీఐ మురళీమోహన్ తెలిపారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే టీటీడీ విజిలెన్స్‌తో పాటు స్థానిక పోలీసుల వైఫల్యం బహిర్గతమైంది. -
కుంగిన కల్వర్టు: నిలిచిన రాకపోకలు
గుంటూరు: మంగళగిరి మండలం కురగల్లు వద్ద రోడ్డుపై కల్వర్టు కూలిపోయింది. దీంతో కురగల్లు-నిడమర్రు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ లోడుతో ఇసుక, మట్టి లారీలు ఈ రోడ్డుగుండా వెళ్లడం వల్లనే కల్వర్టు కుంగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం: గుంటూరు డీఐజీ
ఏలూరు అర్బన్: ఏలూరు మండలం మాదేపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని గుంటూరు రేంజ్ డీఐజీ ఎన్.సంజయ్ శుక్రవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నరసాపురంలో జరిగిన క్రిస్టియన్ సమావేశాల్లో మృతుడు జుజ్జవరపు ఉదయరాజు వీడియో చిత్రీకరణ చేశారని, రోజుపాటు తనతో సన్నిహితంగా మెలిగాడన్నారు. అలాంటి వ్యక్తి మృత్యువాత పడటం బాధ కలిగించిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించి గుంటూరు తిరిగి వెళ్తూ మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి వచ్చానని చెప్పారు. ప్రమాదానికి రోడ్డు మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కనిపిస్తోందన్నారు. మరమ్మతులు చేసే చోట ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవని, వెలుగు లేకపోవడం కూడా కారణమన్నారు. అనంతరం సత్రంపాడులో ఉన్న మృతుని కుటుంబసభ్యులను పరామర్శించారు. ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పి.భాస్కరరావు, సీఐలు అడపా నాగమురళి, జి.మధుబాబు ఆయన వెంట ఉన్నారు. -
ప్రాణాలతో చెలగాటం
ఏలూరు రూరల్ : అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కనీసం హెచ్చరిక బోర్డులు లేకుండా, బారికేడ్లు ఏర్పాటుచేయకుండా చేపట్టిన కల్వర్టు నిర్మాణం వాహనచోదకులకు ప్రాణసంకటంగా మారింది. ఏ లూరు మండలం మాదేపల్లిలో నీటిపారుదల శాఖ అధికారులు పోణంగి కాలువ పనులు చేపట్టారు. జాలిపూడి గ్రామానికి వెళ్లే ప్రధాన కూడలి వద్ద కైకలూరు రోడ్డు మధ్య నుంచి కాలువ తవ్వుతున్నారు. దీనిలో భాగంగా ప్రధాన రోడ్డుపై సుమారు 20 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల లోతులో గొయ్యి తవ్వారు. గొయ్యి లోపల కాలువ నిర్మాణం కోసం ఇనుప ఊచలతో కూడిన సిమెంట్ రివిట్మెంట్ పనులు చేస్తున్నారు. కొద్దిరోజులుగా ఈ పనులు సాగుతున్నాయి. అయితే ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. యువకుడు బలి ఏలూరు మండలం సత్రంపాడు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ జుజ్జువరపు ఉదయరాజు (25), మరో యువకుడు గురువారం రాత్రి సమయంలో కైకలూరు నుంచి బైక్‌పై ఏలూరు వస్తుండగా చీకట్లో కాలువను గుర్తించలేకపోయారు. నేరుగా కాలువలో పడి ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో పాటు సిమెంట్ దిమ్మె తలకు బలంగా తగలడంతో ఉదయరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కాంట్రాక్టర్ రాత్రికి రాత్రే రెండు తారుడబ్బాలను రోడ్డుకు అడ్డం పెట్టి చేతులు దులుపుకున్నాడు. కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హెచ్చరిక బోర్డులు ఏవి ప్రధాన రోడ్డుపై పనులు చేస్తున్నా కాం ట్రాక్టర్ లేదా అధికారులు ప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. కనీసం దారి మళ్లింపు తెలిపే సూచిక బోర్డునైనా ఏర్పాటుచేయలేదు. రోడ్డుపై తవ్విన గొయ్యికి ఇరుపక్కల బారికేడ్లు అడ్డుపెట్ట లేదు. రాత్రి వేళల్లో వాహనచోదకులు గొయ్యి గుర్తించే విధంగా చిన్నపాటి విద్యుత్ బల్బు లేదా రేడియం స్టిక్కర్లు ఏర్పాటుచేయలేదు. కనీసం కాలువ కోసం తవ్విన మట్టిని సైతం అడ్డుగా పోయలేదు. ఈ విషయాల్లో కాంట్రాక్టర్, అధికారులు నిండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాహనచోదకులు, ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ఘోరమైన నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యం ఎక్కడా లేదు. ప్రధాన రోడ్డుపై పనులు చేపట్టినా సూచిక బోర్డు ఏర్పాటు చేయలేదు. రాత్రిళ్లు గుర్తించేలా ఫ్లడ్ లైట్ లేదా రేడియం స్టిక్కర్లతో కూడిన బారికేడ్లు ఏర్పాటుచేయలేదు. – నాగేంద్ర, వెంకటాపురం కేసు నమోదు చేయాలి కాలువ పనుల వల్ల నిండు ప్రాణం పో యింది. దీనికి ఎవరు సమాధానం చెబుతారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై పోలీసు కేసు పెట్టాలి. అప్పుడే మరో అధికారి, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించరు. – కె.శ్రీనివాస్, ఏలూరు -
కల్వర్ట్ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ వద్ద కల్వర్ట్ను శనివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
నెహ్రూ అనుచరుల జులం!
– అంతర్గత విభేదాలతో కల్వర్టు తొలగించే యత్నం – అడ్డుకున్న అపార్టుమెంట్ వాసులకు బెదిరింపులు – బాధితులకు అండగా నిలబడిన ఎమ్మెల్యే వంశీ మోహన్ రామవరప్పాడు : ఒక అపార్టుమెంట్‌కు చెందిన కల్వర్టును మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అనుచరులు శుక్రవారం అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. ఎనికేపాడు బీవీరావు కల్యాణ మండపం సమీపంలోని పవన్ క్లాసిక్ అపార్టుమెంట్ వాసులు రాకపోకలు సాగిచేందుకు కాలువపై నిర్మించుకున్న కల్వర్టును నెహ్రూ అనుచరులు పది మంది పొక్లెయిన్‌తో ధ్వంసం చేయడానికి యత్నించారు. అక్కడికి వచ్చిన అపార్టుమెంట్వాసులను అడ్డుకుంటే అంతు చూస్తామంటూ బెదిరించారు. పొక్లెన్తో కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను ధ్వంసం చేశారు. కల్వర్టరు తొలగిస్తే అపార్టుమెంట్లో ఉంటున్న 57 కుటుంబాలు రాకపోకలు సాగించడం కష్టమని అపార్టుమెంట్ వాసులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు నెహ్రూ అనుచరులు వెనుక్కు తగ్గారు. అంతర్గత విభేదాలే కారణమా? నెహ్రూ టీడీపీలో చేరకముందు ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించారు. నెహ్రూ టీడీపీలో చేరాక ఆ ఇంటర్వ్యూ వీడియో ఫేస్బుక్, వాట్సప్‌లో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోను వపన్ క్లాసిక్ అపార్టుమెంట్ బిల్డరు ఫేస్బుక్లో షేర్ చేసి కామెంట్ పెట్టడంతో కల్వర్టు ధ్వంసానికి నెహ్రూ అనుచరులు ప్రయత్నించారన్న ప్రచారం జరుగుతోంది. తమ నేత టీడీపీలో చేరిన తరువాత అపార్టుమెంట్ ఎదురుగా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నెహ్రూ అనుచరులు బిల్డర్‌కు హుకుం జారీచేసినా అతను నిర్లక్ష చేశారన్న ప్రచారం జరుగుతోంది. అపార్టుమెంట్ నిర్మించేటప్పుడు బిల్డర్‌ను నెహ్రూ డబ్బు డిమాండ్ చేశారని, అయితే డబ్బు ఇవ్వనందున ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మరి కొందరు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఫిర్యాదుచేస్తా : ఎమ్మెల్యే వంశీ తన నియోజకవర్గంలో నెహ్రూ వర్గం చేసిన అరాచకాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ శనివారం ఎనికేపాడు వచ్చి అపార్టుమెంట్వాసులతో మాట్లాడారు. అంతర్గత విభేదాల కారణంగానే నెహ్రూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అరాచకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. లారీ డ్రైవర్లే కూల్చారు : అన్నే చిట్టిబాబు ఈ ప్రాంతంలో నెహ్రూకు సొంత గోదాములు ఉన్నాయని నెహ్రూ అనుచరుడు, కానూరు మాజీ సర్పంచి అన్నే వేణుగోపాల కృష్ణమూర్తి (చిట్టిబాబు) పేర్కొన్నారు. వాటి వద్దకు లారీలు వెళ్లకుండా అపార్టుమెంట్ వాసులు, బిల్డరు తమ కార్లు అడ్డంగా నిలిపి దారి ఇవ్వడం లేదన్నారు. ఈ రోడ్డును నెహ్రూ రూ.1.50 కోట్లతో అభివృద్ధిచేశారని పేర్కొన్నారు. దారికి కార్లు అడ్డుపెట్టవద్దని ఎన్నిసార్లు చెప్పినా విననందునే నివిసిగిపోయిన లారీ డ్రైవర్లు కల్వర్టును ధ్వంసం చేశారని చెప్పారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణంపై సీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. -
కల్వర్టు కోసం నిరసన
సంగం: ముంబాయి జాతీయ రహదారి నిర్మాణం పనుల్లో భాగంగా సంగం మండలంలోని దువ్వూరు గ్రామం వద్ద కల్వర్టును నిర్మించాలని దళితులు ఆదివారం జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. దువ్వూరు సమీపంలోని 719, 500 నెంబరు కలిగిన కల్వర్టును పెద్దది చేసి రోడ్డును నిర్మించుకోవాలని దళితులు నిరసన తెలిపారు. దళితుల నిరసనకు ఆ గ్రామ వైఎస్సార్ సీపీ నేత సూరి మదన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలిపారు. అదే సమయంలో దువ్వూరుకు వస్తున్న ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డికి సూరి మదన్‌మోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ దేవసహాయం పరిస్థితిని వివరించారు. దీంతో గౌతమ్‌రెడ్డి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి బాబునాయుడుతో మాట్లాడారు. కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకుని వెళ్లి కల్వర్టు పెంపు మంజూరు తెస్తామని, అప్పటి వరకు కల్వర్టు వద్ద సిమెంటు రోడ్డు పనులను ఆపాలని గౌతమ్‌రెడ్డి సూచించారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కల్వర్టు కోసం పంచాయతీ కార్యాలయం నుంచి ప్రతిపాదనలు పంపాలని గౌతమ్‌రెడ్డి కోరారు. నిరసన కార్యక్రమంతో నెల్లూరు ముంబాయి రోడ్డుపై వాహన రాకపోకలు స్తంభించడంతో బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై ఎల్ సుధాకర్‌రెడ్డి వచ్చి దళితులను సూరి మదన్‌మోహన్‌రెడ్డితో కంపెనీవారితో చర్చించారు. గౌతమ్‌రెడ్డి వచ్చి సమస్యను పరిష్కరించడంతో రాకపోకలను ఎస్సై సుధాకర్‌రెడ్డి పునరుద్ధరించారు. 14ఎటికె105: కాంట్రాక్టు ప్రతినిధులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి కల్వర్టు, జాతీయ రహదారిపై నిరసన, ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి -
భారీ వర్షంతో కొట్టుకుపోయిన కల్వర్టు
డుంబ్రిగుడ: మన్యంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని అరమ పంచాయతీ కేంద్రానికి వెళ్లే మార్గంలో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కల్వర్టు నిర్మాణం చేపట్టి ఏడాది గడవక ముందే కొట్టుకుపోయిందని, నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని స్థానికులు చెబుతున్నారు. కల్వర్టు కొట్టుకుపోవడంతో రాకపోకలు సాగించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు నిర్మించాలని వారు కోరుతున్నారు.ఇదిలా ఉండగా నెల రోజుల క్రితం నిర్మించిన అరమ రోడ్డు కురుస్తున్న వర్షాలకు రాళ్లు తేలిపోయాయి. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆ ప్రాంతం ప్రజలు కోరుతున్నారు. -
ప్యాకేజీ మాయాజాలం
► కల్వర్టులు నిర్మించకుండానే రోడ్డు నిర్మాణం ► నాణ్యత ప్రమాణాలకు మంగళం ► పత్తాలేని అధికార యంత్రాంగం ► కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు కళ్లకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు పంచాయతీరాజ్‌శాఖ అధికారులు. పదికాలాలపాటు ఉండాల్సిన రోడ్ల నిర్మాణంలో అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. దీంతో నిర్మాణ దశలోనే ఆ రోడ్లు దారుణంగా తయారవుతున్నాయి. క్యూరింగ్ సరిగా లేకపోవడంతో పాటు రోలింగ్ కూడా నామమాత్రంగా చేస్తుండటంతో మరు సటి రోజే రోడ్డుైపై రాళ్ల లేస్తున్నాయి. సైదాపురం: కల్వర్టులు నిర్మించాలని ఎస్టిమేషన్లలో చూపారూ..ప్రభుత్వం కూడా నిధులను మంజూరుచేసింది. అయితే ఆ కల్వర్టులను నిర్మించకుండానే కాంట్రాక్టర్లు రోడ్డు పనులను సాగిస్తున్నారు. కంకర కూడా నాసిరకంగా ఉండటంతో రోడ్డు ఎంతకాలం ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.‘సారూ మా రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదు. పదికాలాల పాటు ఉండాల్సిన నిర్మాణంలో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది.మీరు పట్టించుకోరా’ అం టూ గ్రామస్తులు పర్యవేక్షణ ఇంజనీర్‌కు విన్నవించుకున్నా ప్రయోజనం శూన్యం. గ్రామం సమీపంలో దెబ్బతిన్న రెండు కల్వర్టులను పూర్తిచేయకుండానే రోడ్డును ఎందుకు వేస్తున్నారంటూ ప్రజలు అధికారిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలతో దాట వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నిరోజులు ఉంటాయో.. పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో సీఆర్ఆర్ (ఎస్సీ,ఎస్పీ) ప్యాకేజీ కింద అప్రోచ్ రోడ్డు నుంచి దేవరవేమూరు ఎస్సీకాలనీ వరకు రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. సుమారు 2.68 కిలోమీటర్ల వరకు బీటీరోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1.05 కోట్ల నిధులను మంజూరుచేసింది. రోడ్డు నిర్మించే సమయంలోనే కల్వర్టులను నిర్మించాల్సి ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా పనులు చేసుకుపోతున్నారు. దెబ్బతిన్నవాటిని కూల్చి కొత్త కల్వర్టులను నిర్మించిన తర్వాతనే రోడ్డు వేయాలని గ్రామస్తులు పట్టుబట్టినా ఫలితం లేకుండాపోయింది. దేవరవేమూరు బీటీ రోడ్డు నిర్మాణ పనుల్లో పలు అక్రమాలు జరుగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతకు స్వస్తి పలికారు. క్యూరింగ్ సరిగా లేకపోతుండటంతో వేసిన రోజు నుంచే కంకర లేస్తుంది.సైడ్బరమ్ కూడా తూతూమంత్రంగా చేస్తుండటంతో ప్రమాదాలు జరిగే పరిస్థితులున్నాయి. కంకర విషయంలోనూ నాణ్యత లోపించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్భయంగా సమాధానాలు మండలంలో రూ.కోట్ల వ్యయంతో జరుగుతున్న ప్యాకేజీ పనుల్లో అన్నిచోట్ల అధికారులు తమ లీలలను ప్రదర్శిస్తున్నారు. పొక్కందలలో ఎస్సీ కాలనీ వరకు పీఆర్ఆర్ గ్రాంట్ కింద సుమారు రూ.60లక్షల వ్యయంతో 1.40 కిలోమీటర్ల రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఈ రోడ్డు నిర్మాణంలో మొదటి నుంచి అక్రమాలపర్వం నడుస్తోంది. రోడ్డు విస్తరణలో భాగంగా దగ్గర్లోనే ఉన్న మైకా దిబ్బల మట్టిని ఉపయోగిస్తుండటంతో మైకా అంతా రోడ్డుపైనే మెరుస్తోంది. ఈ మట్టి వల్ల రాబోయే రోజుల్లో మార్జిన్ దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే తమకు అర కిలోమీటర్ వరకే పర్మిషన్ ఉందని, ఈప్రాంతంలో ఆ మట్టి తప్ప వేరేది అందుబాటులో లేదని పర్యవేక్షణ ఇంజనీరు బాహాటంగా చెప్పడం గమనార్హం. అటవీ అధికారులు నిఘా...: ప్యాకేజీ పనుల్లో భాగంగా షామైన్ రోడ్డు నుంచి మొలకలపూండ్ల వరకు బీటీరోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ఆ కాంట్రాక్టర్ అటవీ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే అటవీ ప్రాంతంలో ఉన్న మట్టిని తరలించారు. అటవీ అధికారులు తెలుసుకునే సరికి ఆయన చల్లగా జారుకున్నారు. మళ్లీ పనులను ప్రారంభిస్తే యంత్రాలను సీజ్ చేసేందుకు అటవీ అధికారులు ఉన్నారని తెలుసుకున్న కాంట్రాక్టర్ పత్తా లేకుండాపోయారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నిర్మాణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. కల్వర్టులు నిర్మాస్తాం: దేవరవేమూరు రోడ్డులో కొత్తగా రెండు వంతెనలను నిర్మించాల్సి ఉంది.త్వరలోనే నిర్మిస్తాం. రోడ్డు పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకుంటాం. -డీఈ రాజు -
కల్వర్టును ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి