పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు | The accumulation of coal Reserves | Sakshi
Sakshi News home page

పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు

Published Sat, Jan 10 2015 4:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు - Sakshi

పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు

* విదేశాల నుంచి భారీగా దిగుమతి
* వినియోగం తగ్గించిన స్థానిక సంస్థలు
* సిమెంటు కంపెనీలకు నిలిచిన బొగ్గు రవాణా

గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గు రోజురోజుకూ నిల్వ కేంద్రాలకే తరలిపోతున్నది. సంస్థ నుంచి రవాణా అయ్యే బొగ్గు ను సిమెంట్ కంపెనీలు తీసుకోవడానికి విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. సిమెంట్ ఉత్పత్తి తగ్గడంతో పాటు విదేశాల నుంచి వచ్చే బొగ్గు తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆయా కంపెనీలు విదేశీ బొగ్గువైపే ఆకర్షితులవుతున్నారు.

సింగరేణిలో ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే మొదటి రకం(5 శాతం బూడి ద వెలువడే) బొగ్గు ప్రతి టన్నుకు 4,800 ధర పలికితే.. విదేశాల నుంచి వచ్చే ఇదే రకమైన బొగ్గు *3,600 లకే లభిస్తున్నది. అయితే విదేశాల నుంచి వచ్చే బొగ్గుకు 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చే సౌకర్యం ఉండగా.. సింగరేణిలో మాత్రం మూడు నెలల ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా సిమెం ట్ కంపెనీలు సింగరేణి బొగ్గును తీసుకునేందు కు వెనుకాడుతున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా తెలంగాణ జెన్‌కోకు సింగరేణి నుంచి 130 నుంచి 140 శాతం బొగ్గు రవాణా అవుతోంది. అయితే ఏపీ జెన్‌కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు కాకినాడ పోర్టు నుంచి విదేశీ బొగ్గు ను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్చి నాటికి 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయే పరిస్థితి ఏర్పడనున్నది.

ఈ నేపథ్యంలో సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వద్ద గల విద్యుత్ ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వారు ఒకవేళ అంగీకారం తెలిపితే నిల్వ బొగ్గును అటు రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లోనూ సింగరే ణి బొగ్గుకు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తు న్న నేపథ్యంలో బొగ్గును విక్రయించే బదులు సంస్థ ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి వాటికే విక్రయిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్న ట్లు సమాచారం.
 
బూడిదవుతున్న బొగ్గు
రోజుల తరబడి బొగ్గు నిల్వ ఉండటంతో స్వతహాగా మండుతూ టన్నుల కొద్ది బొగ్గు కా లిబూడిదై పోతోంది. రైల్వే ద్వారా తరలించే ప్రతి సీహెచ్‌పీలో ఇదే పరిస్థితి ఎదురవుతున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును నిర్ణీత సమయంలోగా రవాణా చేయాలి. సకాలంలో పంపించక పోతే బొగ్గులో ఉన్న కార్బన్ బయ ట ఉన్న ఆక్సిజన్‌తో కలవడంతో దానంతట అదే మండే అవకాశం ఉంటుంది.
 
ఇండోనేషియా ఎఫెక్ట్
రుద్రంపూర్(ఖమ్మం) : బొగ్గు ధరను ఇండోనేషియా ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతం లో సుమారు 80 డాలర్లు ఉన్న ధరను ఒకేసారి 40 డాలర్లకు తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విద్యుత్ ప్లాంట్లు ఆ దేశం నుంచి, మహానది కోల్‌ఫీల్డ్స్(ఒరిస్సా) నుంచి భారీగా దిగుమతి చేసుకుం టున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గుకు డిమాండ్ తగ్గే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

అంతేకాక సింగరేణి బొగ్గు వాడకం తగ్గించే ప్రయత్నంలో కేటీపీఎస్ లాంటి సంస్థలు ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్‌సీహెచ్‌పీ నుంచి రోజుకు 5 లేదా 6 రేకు లు బొగ్గు(ఒక్క రేకుకు 60 వ్యాగన్లు) చొప్పున కేటీపీఎస్‌కు రవాణా జరుగుతుంది. అయితే 25 రోజులనుంచి రోజుకు రెండు రేకుల బొగ్గును తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలి సింది. అదేమని సింగరేణి అధికారులు కేటీపీఎస్ అధికారులను అడిగితే యాజమాన్యం ఇష్టమని చెబుతున్నట్లు సమాచారం.  
 
రేకులు లేక నిలిచిపోతున్న బొగ్గులారీలు
కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్‌హాండ్లింగ్ ప్లాంట్ నుంచి రోజుకు 5 లేదా 6రేకుల బొగ్గు కేటీపీఎస్‌కు రవాణా జరుగుతుంది. గత 20 రోజులుగా రోజుకు 5 రేకులు ఒక్కోక్క రోజు నాలుగు రేకుల  బొగ్గు రవాణా అవుతోంది. దీంతో రోజుకు ఒక లోడ్ ర్యాక్ బొగ్గు రవాణా నిలిచిపోవడంతో జేవీ ఆర్‌ఓసీ, జీకేఓసీ నుంచి వచ్చే బొగ్గులారీలు నిలిచిపోతున్నాయి. ఆర్‌సీహెచ్‌పీ అధికారులు చేసేదిలేక బొగ్గును యాడ్‌లో డంప్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement