coal transportation
-
కృష్ణపట్నానికి ‘మహానది’ బొగ్గు
సాక్షి, అమరావతి: థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజెన్కో) చేస్తున్న ప్రయత్నాల్లో మరో ముందడుగు పడింది. విద్యుత్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు వీలుగా థర్మల్ కేంద్రాలకు యుద్ధప్రాతిపదికన బొగ్గు సరఫరాను పెంచడానికి వివిధ సంస్థలతో ఇంధన సరఫరా ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా.. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్డీఎస్టీపీఎస్), స్టేజ్–2లోని యూనిట్–3కి ఏటా 35.48 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) అంగీకరించింది. ఈ బొగ్గు సరఫరా సోమవారం నుంచి రైలుమార్గంలో మొదలైంది. ఫలించిన నిరంతర ప్రయత్నం.. ఏపీజెన్కో, ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు 5,811 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీనికోసం ఎంసీఎల్ నుంచి సంవత్సరానికి 17.165 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ), సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) నుంచి 6.88 ఎంటీపీఏ బొగ్గు సరఫరా కోసం ఇంధన సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఎంసీఎల్, ఎస్‌సీసీఎల్‌లు రాష్ట్రంలోని డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డా.ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ (ఆర్టీపీపీ)లకు రైలు, సముద్ర మార్గంలో బొగ్గును సరఫరా చేస్తున్నాయి. అయితే, కొంతకాలంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడటంతో సరఫరా కూడా మందగించింది. కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గు కోటాను నిర్ణయించడం మొదలుపెట్టింది. మరోవైపు.. థర్మల్‌కు బొగ్గు నిల్వలను సమకూర్చుకోవాలని కూడా నిర్దేశించింది. ఈ నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నిరంతర పర్యవేక్షణలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు కోల్ ఇండియా లిమిటెడ్, మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌తో సంప్రదింపులు జరిపారు. దీంతో ఈ ఏడాది మార్చి 10 నుంచి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల యూనిట్‌కు మే 1 నుంచి బొగ్గును కేటాయించడానికి ఎంసీఎల్ అంగీకరించింది. మరింత మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ యూనిట్‌తో రాష్ట్రంలోని రోజువారీ విద్యుత్ అవసరాలకు దాదాపు 16 మిలియన్ యూనిట్లు సమకూరుతున్నాయి. మహానది నుంచి దీనికి బొగ్గును సరఫరా చేయడంవల్ల విద్యుదుత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా అన్ని రంగాలకు ఎలాంటి లోడ్ రిలీఫ్ (ఎల్ఆర్)లు లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. పెరుగుతున్న స్టేట్ గ్రిడ్ డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. – కేవీఎన్ చక్రధర్‌బాబు, ఎండీ, ఏపీజెన్కో -
Super Vasuki: ఈ గూడ్స్‌కు 295 వ్యాగన్లు!
న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్ ఈస్ట్ సెంట్రల్) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్ సమీపంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం సూపర్ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు. కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్‌ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది. -
సింగరేణికి రూ.1,200 కోట్ల లాభాలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ గతేడాది కనకవర్షం కురిపించింది. టర్నోవర్, లాభాలు, బొగ్గు రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు అంశాల్లో గణనీయ వృద్ధి సాధించి పాత రికార్డులను అధిగమించింది. సంస్థ 2017–18లో రికార్డు స్థాయిలో రూ.1,200 కోట్ల లాభాలు ఆర్జించింది. 2016–17లో సాధించిన రూ.395 కోట్ల లాభాలతో పోల్చితే గతేడాది సాధించిన లాభాలు 203 శాతం అధికం కావడం గమనార్హం. 2016–17లో రూ.17,743 కోట్ల టర్నోవర్ సాధించగా, గతేడాది రూ.22,667 కోట్ల టర్నోవర్ సాధించి 27.8 శాతం వృద్ధి నమోదు చేసింది. 2016–17లో 608 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపగా, 2017–18లో 646 లక్షల టన్నులకు పెంచి 6.2 శాతం వృద్ధిని సాధించింది. 26.9 శాతం వృద్ధి రేటుతో 396 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ను తొలగించింది. గత 4 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని స్ఫూర్తిగా తీసుకుంటూ రానున్న 5 ఏళ్లలో సుమారు రూ.12 వేల కోట్ల భారీ వ్యయంతో అభివృద్ధి ప్రణాళికను అమలు చేయనున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ రికార్డు స్థాయిలో ప్రగతి సాధించడానికి కారణమైన కార్మికులకు అభినందనలు తెలిపారు. రానున్న ఐదేళ్లకాలంలో 13 కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తామనీ, దీంతో బొగ్గు ఉత్పత్తి 850 లక్షల టన్నులకు పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న రూ.22,667 కోట్ల టర్నోవర్ మరో 5 ఏళ్లలో రూ.34,000 కోట్లకు చేరుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. కారుణ్య నియామకాల అమలు, మ్యాచింగ్ గ్రాంటును పది రెట్లు పెంచి పంపిణీ చేయడం, సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యం, కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షల రుణంపై వడ్డీ చెల్లింపు పథకం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ఐఐటీ, ఐఐఎంలో చదివే కార్మికుల పిల్లలకు కంపెనీ ద్వారా ఫీజుల చెల్లింపు, లాభాల బోనస్‌ను 25 శాతానికి పెంచి కార్మికులకు అందజేయడం, పండుగ అడ్వాన్సును భారీగాపెంచి పంపిణీ చేయడం, తెలంగాణకోసం పాటుపడిన కార్మికులందరికీ 2014 నుండి తెలంగాణ ఇంక్రిమెంటు అమలు జరపడం, మెడికల్ అన్‌ఫిట్ కేసులో ఉద్యోగం వద్దనుకొనే వారికి ఏకమొత్తంగా రూ.25 లక్షల చెల్లింపు లేదా నెలకు రూ.25 వేల చెల్లింపు పథకం, అన్ని గనుల్లో క్యాంటీన్ల ఆధునీకరణ, అంబేడ్కర్ జయంతి, రంజాన్, క్రిస్టమస్ పండుగలను సెలవు దినాలుగా గుర్తింపు వంటివి అమలు జరుపుతున్నామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశంపై సింగరేణి సంస్థలో ఖాళీలను గుర్తించి 7,200 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించామని, అలాగే 2,718 మంది బదిలీ వర్కర్లను ఒకేసారిగా జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశామన్నారు. -
బొగ్గు బండి
వరంగల్ నుంచి తాండ్ర కృష్ణగోవింద్: బొగ్గుతో నడిచే ఆరివి ఇంజన్‌తో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ నేడు బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం వందలాది టన్నుల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి బొగ్గును రైళ్లద్వారా తరలిస్తున్నారు. గోదావరి – ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం 1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి జరుపుతోంది. సింగరేణి బొగ్గు.. థర్మల్ విద్యుత్ కేంద్రాలు, సిమెంటు పరిశ్రమలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గును పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. బొగ్గు రవాణా వల్లే రైలు మార్గాలు.. బ్రిటిష్ కాలంలో కేవలం బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకునే ఇల్లందు, కొత్తగూడెం – మణుగూరు వంటి ప్రాంతాలకు రైలుమార్గం నిర్మించారు. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్ మార్గంలో రామగుండం, బెల్లంపల్లి, మందమ ర్రి వంటి ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఒక్క భూపాలపల్లి ఏరియాను మినహాయిస్తే మిగి లిన సింగరేణి ఏరియాలు రైలు మార్గంతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో రైలుమార్గం ద్వారా భారీగా బొగ్గు రవాణా జరుగుతోంది. రైలు వ్యాగన్ల ద్వారా రవాణా అవుతున్న బొగ్గులో 90% ఎన్టీపీసీ (రామగుండం, సింహా ద్రి), కేటీపీఎస్ (కొత్తగూడెం), జైపూర్, వీటీపీ ఎస్ (విజయవాడ), ఎస్‌డీఎస్‌టీ (నెల్లూరు), ఆర్టీపీసీ (కడప)లలో ఉన్న విద్యుత్ కేంద్రాలకు సరఫరా అవుతోంది. పెరిగిన ఉత్పత్తి 80వ దశకం వరకు భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఆ తర్వాత ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా ఉత్పత్తి ప్రారం భమైంది. ఉపరితల గనుల్లో యంత్రాలు వినియోగించడం వల్ల వ్యయం తక్కువ. దీంతో ఏకంగా అడ్రియాల ఓపెన్ కాస్టు పేరుతో ఒక ఏరియా ఏర్పాటు చేశారు. ఓపెన్‌కాస్టులు, యాంత్రీకరణ ఫలితంగా క్రమంగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. 1990లో 1.20 లక్షల మంది కార్మికులు సాలీనా 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 56 వేల మంది కార్మికులు 61 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో అధిక భాగం రైలు మార్గం ద్వారానే రవాణా చేస్తున్నారు. 74,54,622 సింగరేణి నుంచి 2016–17లో ఇప్పటి వరకు వ్యాగన్ల ద్వారా రవాణా అయిన బొగ్గు (టన్నుల్లో) మొత్తం 2016–17లో సింగరేణి నుంచి ఏరియాల వారీగా రైలు వ్యాగన్ల ద్వారా రవాణా అయిన బొగ్గు -
ఓబీ వెలికితీతలో ఆర్జీ–2 రికార్డ్
సింగరేణిలోనే నంబర్ వన్ యైటింక్లైన్ కాలనీ: సింగరేణి సంస్థలోనే అత్యధిక ఓబీ వెలికితీసి ఆర్జీ–2 డివిజన్ నంబర్‌వన్ గా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఐదు ఓసీపీల కన్నా అత్యధిక ఉత్పత్తి తీయడమే కాకుండా ఓబీ వెలికితీతలో రికార్డు నెలకొల్పింది. ఓసీపీ–3 చరిత్రలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ నెలలో 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత లక్ష్యానికి గాను 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని వెలికితీసి ప్రాజెక్టు రికార్డులను తిరగరాయడంతో పాటు సింగరేణి సంస్థలోనే నంబర్‌వన్ స్థానం పొందింది. బొగ్గు రవాణాలో కూడా మొదటి స్థానం డిసెంబర్ నెలలో 130 రేకుల బొగ్గు రవాణా చేసి ఓసీపీ–3 సీహెచ్‌పీ మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క శనివారం 7 రేకుల బొగ్గు రవాణా చేసేందుకు నిర్ణయించి రవాణా రోజుగా తీసుకున్నామన్నారు. సింగరేణిలోనే ఒక నెలలో అత్యధికంగా బొగ్గు రవాణా చేసిన డివిజన్ గా రికార్డు సాధించినట్లు ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి వెల్లడించారు. రికార్డులకు కారణమైన డివిజన్ ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
బదిలీల పేరుతో బాదుడు
రూ.50 లక్షలకు పైగా వసూళ్లు ఒక్కొక్కరి నుంచి రూ.50వేల పైమాటే అధికారుల సహకారంతో ఓ కార్మిక నాయకుడి నిర్వాకం సింగరేణిలో ఇప్పటి వరకు బొగ్గు రవాణా, క్వాలిటీ, మెడికల్ బోర్డు తదితర అక్రమాలు చూశాం. తాజాగా కార్మికుల బదిలీల్లో సైతం వసూళ్లకు తెరలేచింది. ఇందులో ఓ యూనియన్ నాయకుడు సాధారణ బదిలీలను సైతం తమ ఘనకార్యంగా చెప్పుకుంటూ అధికారుల సహకారంతో పెద్ద మొత్తంలో దండుకున్నట్లు బాధిత కార్మికుల ద్వారా తెలిసింది. - కొత్తగూడెం(ఖమ్మం) మణుగూరు ఏరియాలోని ప్రకాశం ఖని-1 ఇంక్లైన్ మూతపడటంతో సుమారు 150 మంది కార్మికులను రెండేళ్ల నుంచి పలు దఫాలుగా బదిలీలు చేశారు. సీనియారిటీ ప్రకారం 51 మంది కార్మికులను చివరి దఫాగా 8 నెలల క్రితం కొత్తగూడెంలోని పీవీకే-5 ఇంక్లైన్, వీకే-7 ఇంక్లైన్ భూగర్భగనులకు బదిలీ చేశారు. వీరు చాలాకాలం నుంచి మణుగూరు ఏరియాలోనే పనిచేయడం, అక్కడే స్థిరపడటంతో తిరిగి అదే ఏరియాకు వెళ్లేందుకు ఆసక్తి కనపర్చారు. ఈ నేపథ్యంలో మణుగూరులోని ఓపెన్‌కాస్టులో పోస్టింగ్ కోసం అదే ఏరియాకు చెందిన ఒక యూనియన్ నాయకుడిని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల మణుగూరు కొండాపూర్ ఓసీలో పంచ్ ఎంట్రీ ఓపెన్ చేస్తుండటంతో కొత్తగూడెం ఏరియాకు బదిలీ అయిన కార్మికులను తిరిగి మణుగూరుకు బదిలీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమాచారం ముందుగానే తెలుసుకున్న సదరు నాయకుడు కార్మికులతో బేరం కుదుర్చుకుని ఒక్కొక్కరి వద్ద రూ.50 వేలకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. అరుుతే ఈ విషయమ బయటకు రానీయకుండా ఉండేందుకు అతను సింగరేణిలోని పర్సన ల్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులతో కుమ్మక్కైన ట్లు సమాచారం. మొత్తం రూ.50 లక్షల వరకు వసూలుచేసి కొంత అధికారులకు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 18న బదిలీలకు సంబంధించిన సర్క్యులర్ విడుద ల కావడంతో కార్మికులు తాము ఆశ్రయించిన నాయకుడే బదిలీలు చేయించాడని నమ్మారు. అయితే సీనియారిటీ ప్రకారం బదిలీలు జరిగాయని తెలుసుకున్న కార్మికులు లబోదిబోమంటున్నారు. నిద్రపోతున్న విజిలెన్స్ విభాగం సింగరేణిలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన విజిలెన్స్ విభాగం నిద్రపోతోందనడానికి తాజా ఘటనతోపాటు అనేక ఉదాహరణలున్నారుు. రెండేళ్ల క్రితం జరి గిన మెడికల్ అన్‌ఫిట్ కుంభకోణం నుంచి మొదలు నిన్న మొన్నటి వరకు జరిగిన బదిలీలలో చోటు చేసుకున్న అక్రమాలను వెలికితీయడంలో ఈ విభాగం పూర్తిగా విఫల మైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఇప్పటికైనా అవినీతి అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దృష్టికి రాలేదు.. విచారణ చేపడతాం బదిలీల వసూళ్ల వ్యవహారంపై సింగరేణి విజిలెన్స్ జీఎం మధుసూదన్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా ఇప్పటి వరకు ఈ విషయం తమ దృష్టికి రాలేదని, విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
నత్తనడక
► పవర్ ప్రాజెక్టు పనుల తీరుపై సింగరేణి సీఎండీ అసంతృప్తి ► మే వరకు 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం కావాలని ఆదేశం ► ఆకస్మికంగా సందర్శించిన సీఎండీ సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. ముఖ్యంగా కొన్ని విభాగాల పనులు ఏళ్లు గడుస్తున్నా ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు. ఈ పనుల తీరుపై సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ) ఎన్.శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ప్లాంటు పనులను పరిశీలించారు. సుమారు మూడు గంటలపాటు అన్ని పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. యాష్‌హ్యాండ్లింగ్ ప్లాంటు, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. ఇక్కడ కొనసాగుతున్న పైప్‌లైన్ పనుల తీరుపై సీఎండీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పనులు సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. యాష్‌పాండ్, బొగ్గు రవాణా, కన్వేయర్ బెల్ట్ తదితర పనుల పట్ల కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లైయాష్ ప్లాంటు, కోల్హాప్పర్ ప్లాంట్లకు సంబంధించి కూలింగ్ టవర్ల నిర్మాణం పనులను కూడా ఆయన పరిశీలించారు. వీటి నిర్మాణం కోసం నిర్దేశిత కాల పరిమితిలో పనులు పూర్తి చేయని పక్షంలో సంబంధిత నిర్మాణ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగరేణి స్థానిక అధికారుల తీరుపై కూడా సీఎండీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనులు సకాలంలో పూర్తి చేయని ఏజెన్సీల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అధికారులతో సమీక్ష.. అనంతరం నిర్మాణ ఏజెన్సీలతో పనులపై సమీక్ష నిర్వహించిన సీఎండీ మే నెలాఖరు వరకు రెండు ప్లాంట్ల పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా ఈ ప్లాంటు నుంచి 1,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. మూడు షిఫ్టుల్లో పనులు కొనసాగించాలన్నారు. అవసరమైతే ఎక్కువ మంది సూపర్వైజర్లను, సిబ్బందిని, కార్మికులను నియమించుకోవాలని ఆదేశించారు. మొదటి యూనిట్ సింక్రనైజేషన్ విజయవంతంగా పూర్తి చేశామని, రెండో యూనిట్ కూడా సింక్రనైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి మే నెలాఖరు కల్లా రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలా చూడాలన్నారు. సీఎండీ వెంట సింగరేణి డెరైక్టర్లు బి.రమేష్ కుమార్, ఎ.మనోహర్‌రావు, జె.పవిత్రన్ కుమార్, పి.రమేష్‌బాబు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సంజయసూర్, కోఆర్డినేషన్ జీఎం జె.నాగయ్య, సివిల్ జీఎం మురళీకృష్ణ, ఈఅండ్ఎం జీఎం సుధాకర్‌రెడ్డి, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు
* విదేశాల నుంచి భారీగా దిగుమతి * వినియోగం తగ్గించిన స్థానిక సంస్థలు * సిమెంటు కంపెనీలకు నిలిచిన బొగ్గు రవాణా గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గు రోజురోజుకూ నిల్వ కేంద్రాలకే తరలిపోతున్నది. సంస్థ నుంచి రవాణా అయ్యే బొగ్గు ను సిమెంట్ కంపెనీలు తీసుకోవడానికి విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. సిమెంట్ ఉత్పత్తి తగ్గడంతో పాటు విదేశాల నుంచి వచ్చే బొగ్గు తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆయా కంపెనీలు విదేశీ బొగ్గువైపే ఆకర్షితులవుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే మొదటి రకం(5 శాతం బూడి ద వెలువడే) బొగ్గు ప్రతి టన్నుకు 4,800 ధర పలికితే.. విదేశాల నుంచి వచ్చే ఇదే రకమైన బొగ్గు *3,600 లకే లభిస్తున్నది. అయితే విదేశాల నుంచి వచ్చే బొగ్గుకు 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చే సౌకర్యం ఉండగా.. సింగరేణిలో మాత్రం మూడు నెలల ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా సిమెం ట్ కంపెనీలు సింగరేణి బొగ్గును తీసుకునేందు కు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ జెన్కోకు సింగరేణి నుంచి 130 నుంచి 140 శాతం బొగ్గు రవాణా అవుతోంది. అయితే ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు కాకినాడ పోర్టు నుంచి విదేశీ బొగ్గు ను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్చి నాటికి 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయే పరిస్థితి ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వద్ద గల విద్యుత్ ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వారు ఒకవేళ అంగీకారం తెలిపితే నిల్వ బొగ్గును అటు రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లోనూ సింగరే ణి బొగ్గుకు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తు న్న నేపథ్యంలో బొగ్గును విక్రయించే బదులు సంస్థ ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి వాటికే విక్రయిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్న ట్లు సమాచారం. బూడిదవుతున్న బొగ్గు రోజుల తరబడి బొగ్గు నిల్వ ఉండటంతో స్వతహాగా మండుతూ టన్నుల కొద్ది బొగ్గు కా లిబూడిదై పోతోంది. రైల్వే ద్వారా తరలించే ప్రతి సీహెచ్‌పీలో ఇదే పరిస్థితి ఎదురవుతున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును నిర్ణీత సమయంలోగా రవాణా చేయాలి. సకాలంలో పంపించక పోతే బొగ్గులో ఉన్న కార్బన్ బయ ట ఉన్న ఆక్సిజన్‌తో కలవడంతో దానంతట అదే మండే అవకాశం ఉంటుంది. ఇండోనేషియా ఎఫెక్ట్ రుద్రంపూర్(ఖమ్మం) : బొగ్గు ధరను ఇండోనేషియా ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతం లో సుమారు 80 డాలర్లు ఉన్న ధరను ఒకేసారి 40 డాలర్లకు తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విద్యుత్ ప్లాంట్లు ఆ దేశం నుంచి, మహానది కోల్‌ఫీల్డ్స్(ఒరిస్సా) నుంచి భారీగా దిగుమతి చేసుకుం టున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గుకు డిమాండ్ తగ్గే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక సింగరేణి బొగ్గు వాడకం తగ్గించే ప్రయత్నంలో కేటీపీఎస్ లాంటి సంస్థలు ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్‌సీహెచ్‌పీ నుంచి రోజుకు 5 లేదా 6 రేకు లు బొగ్గు(ఒక్క రేకుకు 60 వ్యాగన్లు) చొప్పున కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. అయితే 25 రోజులనుంచి రోజుకు రెండు రేకుల బొగ్గును తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలి సింది. అదేమని సింగరేణి అధికారులు కేటీపీఎస్ అధికారులను అడిగితే యాజమాన్యం ఇష్టమని చెబుతున్నట్లు సమాచారం. రేకులు లేక నిలిచిపోతున్న బొగ్గులారీలు కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్హాండ్లింగ్ ప్లాంట్ నుంచి రోజుకు 5 లేదా 6రేకుల బొగ్గు కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. గత 20 రోజులుగా రోజుకు 5 రేకులు ఒక్కోక్క రోజు నాలుగు రేకుల బొగ్గు రవాణా అవుతోంది. దీంతో రోజుకు ఒక లోడ్ ర్యాక్ బొగ్గు రవాణా నిలిచిపోవడంతో జేవీ ఆర్ఓసీ, జీకేఓసీ నుంచి వచ్చే బొగ్గులారీలు నిలిచిపోతున్నాయి. ఆర్‌సీహెచ్‌పీ అధికారులు చేసేదిలేక బొగ్గును యాడ్‌లో డంప్ చేస్తున్నారు. -
రైల్వే ద్వారానే బొగ్గు రవాణా సాధ్యం
సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య రెబ్బెనలో వార్ఫ్ లోడింగ్ పాయింట్ ప్రారంభం రెబ్బెన(ఆదిలాబాద్) : సింగరేణి గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గును విద్యుత్ ఉత్పాదక సంస్థలకు సరిప డా అధించాలంటే అది రైల్వే ద్వారానే రావాణా చేయడం సాధ్యపడుతుందని సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచార్య అన్నారు. మండల కేంద్రానికి సమీపంలో సింగరేణి సంస్థ లీజుకు తీసుకున్న వార్ఫ్ లోడింగ్ పాయింట్‌ను బుధవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఇమోషన్ వేబ్రిడ్జితోపాటు రైలు వ్యాగన్ ద్వారా బొగ్గు రవాణాను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎండీ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు సంస్థ నుంచి రవాణా చేసిన బొగ్గు లక్ష్యానికి మూడు మిలయన్ టన్నులు అధికమని, ఇది కేవలం రైల్వే ద్వారానే సాధ్యపడిందని పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ డిస్ప్యాచ్ పద్ధతిలో రైల్వే ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నామని, ఇందులో 18 శాతం సింగరేణి సంస్థ నుంచే జరిగిందన్నారు. ఏరియాలో నిర్మిస్తున్న సీహెచ్‌పీ ద్వారా బొగ్గును రవాణా చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం లేదా అంతకు ముందే చర్యలు చేపడుతామని చెప్పారు. సింగరేణి పరీవాహక ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కంపెనీ కట్టుబడి ఉందని, ఇందుకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లు అందజేస్తామని తెలిపారు. రామగుండం ఏరియా అడ్రియాల ప్రాజెక్టులో 2.81 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన భూగర్భ గనిలో పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని, ఇది సింగరేణి సాధించిన రికార్డు అని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గును అందించేందుకు సంస్థలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వార్ఫ్ లోడింగ్ పాయింట్లోనూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని వెంటనే పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. కార్యక్రమాల్లో సింగరేణి డెరైక్టర్లు విజయ్‌కుమార్, రమేష్‌కుమార్, మనోహర్‌రావు, ఏరియా జనరల్ మేనేజర్ రాంనారాయణ, ఎస్‌ఓటూ జీఎం వెంకటేశ్వరరావు, ఏజీఎం నిర్మల్‌కుమార్, రీజియన్ సేఫ్టీ అధికారి జనార్ధన్‌రావు, ప్రాజెక్టు అధికారులు సంజీవరెడ్డి, కొండయ్య, డీజీఎం పర్సనల్ చిత్తరంజన్కుమార్, డీజీఎం సివిల్ రామకృష్ణ, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఈఈ సివిల్ రాజేంద్రప్రసాద్‌తో పాటు ఇతర డిపార్టుమెంట్ల అధికారులు పాల్గొన్నారు.