ఓబీ వెలికితీతలో ఆర్జీ–2 రికార్డ్
సింగరేణిలోనే నంబర్ వన్
యైటింక్లైన్ కాలనీ: సింగరేణి సంస్థలోనే అత్యధిక ఓబీ వెలికితీసి ఆర్జీ–2 డివిజన్ నంబర్‌వన్ గా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఐదు ఓసీపీల కన్నా అత్యధిక ఉత్పత్తి తీయడమే కాకుండా ఓబీ వెలికితీతలో రికార్డు నెలకొల్పింది. ఓసీపీ–3 చరిత్రలో ఎన్నడూలేని విధంగా డిసెంబర్ నెలలో 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత లక్ష్యానికి గాను 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని వెలికితీసి ప్రాజెక్టు రికార్డులను తిరగరాయడంతో పాటు సింగరేణి సంస్థలోనే నంబర్‌వన్ స్థానం పొందింది.
బొగ్గు రవాణాలో కూడా మొదటి స్థానం
డిసెంబర్ నెలలో 130 రేకుల బొగ్గు రవాణా చేసి ఓసీపీ–3 సీహెచ్‌పీ మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క శనివారం 7 రేకుల బొగ్గు రవాణా చేసేందుకు నిర్ణయించి రవాణా రోజుగా తీసుకున్నామన్నారు. సింగరేణిలోనే ఒక నెలలో అత్యధికంగా బొగ్గు రవాణా చేసిన డివిజన్ గా రికార్డు సాధించినట్లు ఆర్జీ–2 జీఎం విజయపాల్‌రెడ్డి వెల్లడించారు. రికార్డులకు కారణమైన డివిజన్ ఉద్యోగులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.