Cement companies
-
మరో సిమెంట్ కంపెనీపై అదానీ కన్ను!
న్యూఢిల్లీ: హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియాపై అదానీ గ్రూప్ కన్నేసింది. జర్మన్ దిగ్గజం హైడెల్బర్గ్ మెటీరియల్స్ దేశీ అనుబంధ సంస్థ హైడెల్బర్గ్ సిమెంట్ కొనుగోలుకు అదానీ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో హైడెల్బర్గ్ సిమెంట్ ఇండియా షేరు తొలుత ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 18 శాతం దూసుకెళ్లింది. రూ.258 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.227 వద్ద ముగిసింది.చర్చలు సఫలమైతే హైడెల్బర్గ్ ఇండియాను బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ దిగ్గజం అంబుజా సిమెంట్స్ సొంతం చేసుకునే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10,000 కోట్లు) విలువలో డీల్ కుదరవచ్చని అంచనా వేశాయి. అయితే అంబుజా సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 3.3 శాతం క్షీణించి రూ.591 వద్ద ముగిసింది.ఇదీ చదవండి: పేరుకుపోతున్న వాహన నిల్వలు2006లోనే భారత్‌లోకి..హైడెల్బర్గ్ సిమెంట్ ఏజీ 2006లో భారత్‌లోకి ప్రవేశించింది. మైసూర్ సిమెంట్, కొచ్చిన్ సిమెంట్, ఇండోరమా సిమెంట్‌తో ఏర్పాటైన జాయింట్ వెంటర్లను కొనుగోలు చేయడం ద్వారా కార్యకలాపాలు ప్రారంభించింది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ, విస్తరణల తర్వాత 5.5 మిలియన్ టన్నులకు స్థాపిత సిమెంట్ సామర్థ్యాన్ని చేర్చుకుంది. 2016లో ఐటల్ సిమెంట్ కొనుగోలుతో కార్యకలాపాలు రెట్టింపునకు పెంచుకుంది. ప్రస్తుతం నాలుగు సమీకృత సిమెంట్ తయారీ, గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. దాంతో స్థాపిత సామర్థ్యం 14 మిలియన్ టన్నులకు ఎగసింది. మైసెమ్, జువారీ బ్రాండ్లతో 12 రాష్ట్రాల్లో విస్తరించింది. అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్‌ను కొనుగోలు చేసిన తర్వాత చాలా కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే హైడెల్బర్గ్ సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారనేలా వార్తలు వస్తున్నాయి. -
ఓరియంట్ సిమెంట్‌ను కొనబోతున్న అదానీ!
సిమెంటు రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగేందుకు అదానీ గ్రూప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల పలు కంపెనీలను సొంతం చేసుకుంది. అదే జోరులో..ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఓరియంట్ సిమెంట్ ప్రమోటరు సి.కె.బిర్లా కంపెనీలో తన వాటా అమ్మేందుకు అదానీ గ్రూపు ఛైర్మన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో అంబుజా, సంఘీ, ఏసీసీ వంటి ప్రధాన సిమెంటు కంపెనీలను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఓరియంట్ సిమెంట్‌లో వాటా కొనుగోలుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైతే అదానీ గ్రూపునకు ప్రయోజనం జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఏసీసీ కార్యకలాపాలకు ఓరియంట్ సిమెంట్ ప్లాంట్లు ఉపయోగపడతాయని అంటున్నారు. ఈ వార్తల నేపథ్యంలో ఓరియంట్ సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ కొన్ని రోజులుగా పాజిటివ్‌లో ట్రేడవుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు కీలకపాత్ర పోషిస్తాయి. అందుకు చాలా సిమెంట్ అవసరం అవుతుంది. రోడ్లు, రహదారులు, వంతెనలు, విమానాశ్రయాలు, ఇళ్లను వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంలో చైనా తర్వాత సిమెంట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం మనదే. కానీ సిమెంట్ తలసరి వినియోగం చైనాలో 1,600 కిలోగ్రాములు, భారత్ 250 కిలోగ్రాములుగా ఉంది. -
సిమెంట్ షేర్లు.. భలే స్ట్రాంగ్
ముంబై, సాక్షి: కొద్ది రోజులుగా పటిష్టంగా సాగుతున్న సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్(అక్టోబర్- డిసెంబర్) ఫలితాలపై అంచనాలతో ఇన్వెస్టర్లు సిమెంట్ షేర్ల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇందుకు ఈ ఏడాది(2020-21) ద్వితీయార్ధంలో కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్న అంచనాలు సైతం జత కలుస్తున్నట్లు తెలియజేశారు. వెరసి సిమెంట్ రంగంలోని కొన్ని కౌంటర్లు తాజాగా చరిత్రాత్మక గరిష్టాలకు చేరగా.. మరికొన్ని కౌంటర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. వివరాలు చూద్దాం.. లాభాలతో ఎన్ఎస్ఈలో తొలుత శ్రీ సిమెంట్ షేరు రూ. 25,655ను అధిగమించడం ద్వారా సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇదేవిధంగా జేకే సిమెంట్ రూ. 2,080 వద్ద, రామ్‌కో సిమెంట్ రూ. 900 వద్ద చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి. ఈ బాటలో ఏసీసీ రూ. 1,785 వద్ద, దాల్మియా భారత్ రూ. 1,198 వద్ద, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ. 909 వద్ద 52 వారాల గరిష్టాలను తాకడం గమనార్హం. ఇతర కౌంటర్లలో కాకతీయ సిమెంట్స్, డెక్కన్ సిమెంట్స్, ఆంధ్రా సిమెంట్స్, అల్ట్రాటెక్, సాగర్‌సిమెంట్స్ 5-1.5 శాతం మధ్య ఎగశాయి. ప్రస్తుతం గ్రాసిమ్ 3.4 శాతం లాభపడి రూ. 906 వద్ద, దాల్మియా భారత్ 4.5 శాతం జంప్‌చేసి రూ. 1151 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక ఏసీసీ 2 శాతం పెరిగి రూ. 1740 వద్ద, శ్రీ సిమెంట్ 2 శాతం పుంజుకుని రూ. 24,748 వద్ద, జేకే సిమెంట్ 1.3 శాతం వృద్ధితో రూ. 2066 వద్ద కదులుతున్నాయి. అంచనాలు ఇలా ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో(అక్టోబర్- మార్చి) సిమెంట్ కంపెనీల మార్జిన్లు మరింత మెరుగుపడనున్నట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సిమెంటుకు కనిపిస్తున్న పటిష్ట డిమాండ్ కారణంగా విద్యుత్, ఇంధనం, రవాణా తదితర వ్యయాలను మించి ధరలు బలపడనున్నట్లు అంచనా వేస్తున్నాయి. త్రైమాసిక ప్రాతిపదికన అక్టోబర్ -డిసెంబర్ కాలంలో ధరలు 0.8 శాతం పడినట్లు ఈ సందర్భంగా తెలియజేశాయి. వెరసి 2020-21లో సిమెంట్ రంగ నిర్వహణ లాభం వార్షిక ప్రాతిపదికన 18 శాతం పుంజుకోగలదని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. రుతుపవనాల కాలంలో సిమెంట్ ధరలు స్వల్పంగా నీరసించినప్పటికీ తిరిగి 1-2 శాతం స్థాయిలో ప్రస్తుతం బలపడినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. పెట్‌కోక్ వంటి ముడిసరుకుల ధరలు పెరిగినప్పటికీ ఈ రంగంపై ప్రభావం స్వల్పమేనని అంచనా వేస్తోంది. ఈ ఏడాది క్యూ2లో సిమెంట్ అమ్మకాలు త్రైమాసిక ప్రాతిపదికన 35.7 శాతం పెరిగినట్లు తెలియజేసింది. -
సిమెంట్ షేర్ల లాభాల కాంక్రీట్
ముందు రోజు నమోదైన భారీ నష్టాలకు చెక్ పెడుతూ హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఉన్నట్టుండి సిమెంట్ రంగ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు సిమెంట్ కౌంటర్లు భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. కోవిడ్-19కు విధించిన లాక్‌డవున్‌ల నుంచి నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో సిమెంట్ రంగ కంపెనీలు మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో సిమెంట్ కౌంటర్లు వెలుగులో నిలుస్తున్నట్లు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం. జోరుగా.. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ సిమెంట్ 6.25 శాతం జంప్‌చేసి రూ. 1,677 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,683 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. శ్రీ సిమెంట్ షేరు 6.7 శాతం దూసుకెళ్లి రూ. 21,780 వద్ద కదులుతోంది. ఇక అల్ట్రాటెక్ సిమెంట్ 3 శాతం పెరిగి రూ. 4,623 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ. 4,628ను తాకింది. ఈ బాటలో రామ్‌కో సిమెంట్స్ 3.4 శాతం పుంజుకుని రూ. 781కు చేరింది. ఇంట్రాడేలో రూ. 782ను తాకింది. మంగళం సిమెంట్ సైతం 4.25 శాతం ఎగసి రూ. 205 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 207కు చేరింది. ఇతర కౌంటర్లలో డెక్కన్ సిమెంట్స్ 2.6 శాతం లాభంతో రూ. 325 వద్ద కదులుతోంది. ఒక దశలో రూ. 330కు చేరింది. శ్రీ దిగ్విజయ్ 3 శాతంపైగా వృద్ధితో రూ. 66 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ సైతం 1 శాతం బలపడ్డాయి. కారణాలేవిటంటే? ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి సిమెంట్‌కు రిటైల్ డిమాండ్ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల 50 శాతం గ్రామాల నుంచి వృద్ధి కనిపించినట్లు చెబుతున్నారు. ఇది కోవిడ్-19 అన్‌లాక్, పండుగల సీజన్ కారణంగానే నమోదైనప్పటికీ ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి మరింత మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నారు. ఇదేవిధంగా పట్టణ ప్రాంతాల నుంచి సైతం నెమ్మదిగా సిమెంట్ విక్రయాలు పుంజుకుంటున్నట్లు తెలియజేశారు. సిమెంటు రంగానికి ప్రధానంగా గ్రామీణ గృహాలు, మౌలిక సదుపాయాల రంగాలు జోష్‌నిస్తాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో అల్ట్రాటెక్, ఏసీసీ వంటి సిమెంట్ రంగ దిగ్గజాలు ఆకర్షణీయ పనితీరు చూపడంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు నిపుణులు తెలియజేశారు. -
ఏసీసీ పుష్- సిమెంట్ షేర్ల దూకుడు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020) ద్వితీయ త్రైమాసికంలో దిగ్గజ కంపెనీ ఏసీసీ ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో సిమెంట్ రంగ కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వెరసి ఏసీసీసహా అంబుజా, జేకే, రామ్‌కో, శ్రీ సిమెంట్ తదితర కౌంటర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. ఏసీసీ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ఏసీసీ క్యూ2 ఫలితాలతోపాటు.. సిమెంట్ రంగ షేర్ల జోరు వివరాలు చూద్దాం.. ఏసీసీ ఫలితాలు ఈ ఏడాది క్యూ2(ఏప్రిల్-జూన్)లో ఏసీసీ సిమెంట్ నికర లాభం 41 శాతం క్షీణించి రూ. 271 కోట్లకు పరిమితమైంది. ఇందుకు లాక్‌డవున్ ప్రభావం చూపగా.. నికర అమ్మకాలు సైతం 38 శాతం తక్కువగా రూ. 2520 కోట్లకు చేరాయి. అయితే నిర్వహణ లాభ మార్జిన్లు 1.56 శాతం బలపడి 20.8 శాతాన్ని తాకాయి. ఏప్రిల్ నెలలో దాదాపు అమ్మకాలు నిలిచిపోయినప్పటికీ మే, జూన్ నెలల్లో సిమెంట్ విక్రయాలలో పటిష్ట రికవరీ కనిపించినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమయంలో సరఫరా సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు, వ్యయాలను తగ్గించుకోవడంపై యాజమాన్యం దృష్టిసారించడంతో ఇకపై మెరుగైన ఫలితాలు సాధించే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. షేర్ల స్పీడ్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఏసీసీ 5 శాతం జంప్‌చేసి రూ. 1397 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1424కు ఎగసింది. అంబుజా సిమెంట్స్ 5.5 శాతం పెరిగి రూ. 207ను తాకగా.. జేకే సిమెంట్ 5 శాతం లాభపడి రూ. 1500కు చేరింది. తొలుత రూ. 1512 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో తొలుత రూ. 696 వరకూ ఎగసిన రామ్‌కో సిమెంట్ 2.25 శాతం పుంజుకుని రూ. 690 వద్ద ట్రేడవుతోంది. అల్ట్రాటెక్ 1.4 శాతం లాభంతో రూ. 3916 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 3,955 వరకూ ఎగసింది. ఇదే విధంగా శ్రీ సిమెంట్ తొలుత రూ. 22,810 వరకూ ఎగసింది. ప్రస్తుతం 2 శాతం లాభంతో రూ. 22,634 వద్ద కదులుతోంది. ఇతర కౌంటర్లలో ఇండియా సిమెంట్స్ 2.3 శాతం పురోగమించి రూ. 122 వద్ద, బిర్లా కార్పొరేషన్ 2 శాతం బలపడి రూ. 575 వద్ద, హీడెల్‌బర్గ్ 1.5 శాతం పుంజుకుని రూ. 179 వద్ద ట్రేడవుతున్నాయి. -
‘సిమెంట్ ధరలు తగ్గించేందుకు అంగీకారం’
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభం వల్ల అన్ని రంగాల మాదిరిగానే రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో కలిసి రియాల్టీ రంగానికి చేయూతనిచ్చేందుకు సిమెంట్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం సిమెంట్ కంపెనీల ప్రతినిధులను కోరింది. ఈ మేరకు గురువారం సిమెంట్ కంపెనీలతో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న కోవిడ్, లాక్డౌన్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు సిమెంట్ బస్తా ధరని తగ్గించాలని మంత్రులు కోరారు. సిమెంట్ కంపెనీలు అధికంగా ఉన్న హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో యువతకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన శిక్షణ కేంద్రాలను ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. (అతడే సుడా నూతన చైర్మన్) 2016లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ.230 ఒక బస్తా సిమెంట్‌ను ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు, మరో మూడేళ్ల పాటు ప్రభుత్వ పథకాలకు యథాతథ ధరకు ఇచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ప్రభుత్వం చేసిన పలు సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. అంతర్గతంగా మాట్లాడుకుని వచ్చే వారంలో ఎంత ధరను తగ్గిస్తామనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సిమెంట్ కంపెనీలకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వ ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రం నుంచి తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా శిక్షణ కేంద్రానికి అన్నివిధాలుగా అండగా ఉంటామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (డిశ్చార్జీల కంటే.. రెండింతల కేసులు) -
సీఎం జగన్ విజ్ఞప్తి: సిమెంట్ ధరలు తగ్గింపు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి మేరకు సిమెంటు ధరలు తగ్గించాలని కంపెనీల నిర్ణయించాయి. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ సిమెంట్ కంపెనీల యజమానులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్ సిమెంట్ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్ సిమెంట్ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో సిమెంటు ధరలు రూ. 380 వరకూ ఉన్నాయి. గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్ టన్నులు, పంచాయతీరాజ్ శాఖ 25లక్షల మెట్రిక్ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్ టన్నుల అవసరాలు ఉంటాయని వివరించారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు అని, అలాగే పేదలందరికీ ఇళ్లనిర్మాణం రూపేణా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సిమెంటు ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్ల నిర్మాణాలు.. పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, ఈ పట్టాలు తీసుకున్నవారితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని కంపెనీ ప్రతినిధులకు సీఎం జగన్ తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బ్యాగు ప్రత్యేకంగా వేరొక రంగులో ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం స్పష్టం చేశారు. నాణ్యతా నిర్థారణ అయ్యాకే చెల్లింపులు జరుగుతాయని సీఎం తెలిపారు. ప్రభుత్వానికి సహకరిస్తాం.. పేదలకు ఇళ్ల నిర్మాణం సహా, వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. అవసరాలమేరకు పంపిణీ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి కంపెనీల తరఫునుంచి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని సిమెంటు కంపెనీల ప్రతినిధులు తెలిపారు. సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీ చక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్సీఎల్ తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో దిగిరాకపోతే, నిర్మాణాలు ఆపివేస్తామని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలాగైనా ధరలు తగ్గించేలా చూడాలని కోరుతోంది. ధరలను కంపెనీలు తగ్గించని పక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంట్ ను దిగుమతి చేసుకుంటామని క్రెడాయ్ తెలిపింది. ధరల పెంపుతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. సిమెంట్ కంపెనీలు ఈ మేర ధరలు ఒక్కసారిగా పెంచడం ఇదేమీ మొదటిసారి కాదని, అంతకమునుపు కూడా ఇలానే చేశాయని బిల్డర్స్, కాంట్రాక్టర్లు వాపోయారు. ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ సిమెంట్ కంపెనీలకు భారీ జరిమానాలు కూడా విధించినట్టు గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గనుక పరిగణలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుమతామని బిల్డర్స్, కాంట్రాక్టర్లు చెప్పారు. -
'డబుల్' కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఒప్పందం
హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను ఉత్పత్తి చేసే విషయంలో గృహ నిర్మాణ కార్పొరేషన్ సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇళ్లకు అవసరమైన సిమెంట్‌ను బస్తా రూ.230కే విక్రయించేందుకు 32 సిమెంట్ సంస్థలు అంగీకరించాయి. ఇందుకుగాను సుమారు 27.31 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం పడుతుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఎంవోయూపై బుధవారం సంతకాలు చేశారు. -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ
రూ. 6,715 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టాను సారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచనల మేరకు సీసీఐ బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. కంపెనీలు, సీఎంఏ అనుసరించిన వ్యవహార శైలి వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతకరమని సీసీఐ పేర్కొంది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాలకు కీలకమైన సిమెంట్ విషయంలో ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు అని వ్యాఖ్యానించింది. ‘సిమెంటు కంపెనీలు సీఎంఏ ప్లాట్ ఫామ్ ద్వారా ధరల వివరాలు, ఎంత మేర ఉత్పత్తి చేస్తుంది, సరఫరాల గురించి వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఉత్పత్తి, మార్కెట్లో సరఫరాలను నియంత్రించారు. సిమెంటు ధరలను నియంత్రించడం వ్యాపార పోటీ నిబంధనలకు విరుద్ధం’ అని సీసీఐ స్పష్టం చేసింది. ఏ కంపెనీపై ఎంత..?: ఏసీసీపై రూ.1,147.59 కోట్లు, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (రూ.1,323.60 కోట్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (రూ.1,175.49కోట్లు), సెంచురీ (రూ.274.02కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.187.48కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.128.54 కోట్లు), లఫార్జ్ (రూ.490 కోట్లు), రామ్‌కో రూ.258.63 కోట్లు), ఏసీఎల్ (రూ.1,163.91 కోట్లు), బినాని (రూ.167.32 కోట్లు), సీఎంఏపై రూ.0.73 కోట్ల జరిమానా భారం పడింది. అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు రూ.397.51 కోట్ల జరిమానా చెల్లించాలని శ్రీ సిమెంట్‌ను సీసీఐ ఆదేశించింది. -
రోడ్లకు ప్రపంచస్థాయి మెరుగులు
రాష్ట్రమంతటా బీటీ, సీసీ రోడ్లకూ వైట్ టాపింగ్ సిమెంటు కంపెనీలతో మంత్రుల చర్చలు సాక్షి, హైదరాబాద్: మన రోడ్లకు మంచిరోజులు. త్వరలో రాష్ట్రంలోని బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ టెక్నాలజీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. కేవలం రాజధాని నగరం హైదరాబాద్‌లోనే రెండు నెలల వ్యవధిలో 400 నుంచి 500 కి.మీ. మేర అంతర్గత రహదారులను వైట్ టాపింగ్ టెక్నాలజీతో వేయనుంది. నూతన టెక్నాలజీని వినియోగించేందుకు పెద్దఎత్తున సిమెంటు అవసరమవుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. నాణ్యత, మన్నికతో పాటు తక్కువ వ్యయం, తక్కువ వ్యవధిలో రోడ్లు వేసే అవకాశం ఈ సాంకేతికత ద్వారా సాధ్యమవుతుందన్నారు. గతం లో సిమెంటు కొరత, సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడంతో ఈ టెక్నాలజీ వాడలేకపోయామని తెలిపారు. ప్రస్తుత రోడ్లపైనే కాంక్రీట్, ఫైబర్‌ను కలగలిపి కొత్త విధానంలో రోడ్లు వేస్తామన్నారు. త్వరలో నూతన విధానాన్ని జిల్లాలు, గ్రామాలకూ తీసుకెళ్లి బీటీ, సీసీ రోడ్లన్నింటినీ వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చుతామని చెప్పారు. 1,060 కి.మీ. మేర నిర్మించిన యమునా ఎక్స్‌ప్రెస్ వే, ముంబై మెరైన్ డ్రైవ్ తదితరాలను వైట్ టాపింగ్ పద్ధతిలో నిర్మించిన విషయాన్ని ఉదహరించారు. వైట్ టాపింగ్ రోడ్లు కనీసం 25-30 ఏళ్ల పాటు మన్నే అవకాశం ఉన్నందున మరమ్మతుల వ్యయం కూడా పెద్దగా ఉండదన్నారు. రోడ్లు, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి భారీగా సిమెంటు అవసరమని చెప్పగా, ఒక్కో బస్తాను రూ.250 చొప్పున ఇచ్చేందుకు కంపెనీల ప్రతినిధులు చెప్పారు. ధరలపై పునరాలోచించాలని మంత్రులు సూచించగా, మరోమారు కొత్త ప్రతిపాదనతో వస్తామని ప్రతినిధులు చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. -
పేరుకుపోతున్న బొగ్గు నిల్వలు
* విదేశాల నుంచి భారీగా దిగుమతి * వినియోగం తగ్గించిన స్థానిక సంస్థలు * సిమెంటు కంపెనీలకు నిలిచిన బొగ్గు రవాణా గోదావరిఖని/యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : సింగరేణి గనుల నుంచి వెలికితీస్తున్న బొగ్గు రోజురోజుకూ నిల్వ కేంద్రాలకే తరలిపోతున్నది. సంస్థ నుంచి రవాణా అయ్యే బొగ్గు ను సిమెంట్ కంపెనీలు తీసుకోవడానికి విముఖత చూపడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. సిమెంట్ ఉత్పత్తి తగ్గడంతో పాటు విదేశాల నుంచి వచ్చే బొగ్గు తక్కువ ధరకు లభిస్తుండడంతో ఆయా కంపెనీలు విదేశీ బొగ్గువైపే ఆకర్షితులవుతున్నారు. సింగరేణిలో ప్రస్తుతం ఉత్పత్తి అయ్యే మొదటి రకం(5 శాతం బూడి ద వెలువడే) బొగ్గు ప్రతి టన్నుకు 4,800 ధర పలికితే.. విదేశాల నుంచి వచ్చే ఇదే రకమైన బొగ్గు *3,600 లకే లభిస్తున్నది. అయితే విదేశాల నుంచి వచ్చే బొగ్గుకు 60 రోజుల వరకు క్రెడిట్ ఇచ్చే సౌకర్యం ఉండగా.. సింగరేణిలో మాత్రం మూడు నెలల ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కూడా సిమెం ట్ కంపెనీలు సింగరేణి బొగ్గును తీసుకునేందు కు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ జెన్కోకు సింగరేణి నుంచి 130 నుంచి 140 శాతం బొగ్గు రవాణా అవుతోంది. అయితే ఏపీ జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్లకు కాకినాడ పోర్టు నుంచి విదేశీ బొగ్గు ను దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం 20 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్చి నాటికి 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు పేరుకుపోయే పరిస్థితి ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో సింగరేణి మార్కెటింగ్ విభాగం అధికారులు మహారాష్ట్రలోని చంద్రాపూర్ వద్ద గల విద్యుత్ ప్రాజెక్టు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. వారు ఒకవేళ అంగీకారం తెలిపితే నిల్వ బొగ్గును అటు రవాణా చేసేందుకు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లోనూ సింగరే ణి బొగ్గుకు డిమాండ్ తగ్గే అవకాశాలు కనిపిస్తు న్న నేపథ్యంలో బొగ్గును విక్రయించే బదులు సంస్థ ఆధ్వర్యంలోనే విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పి వాటికే విక్రయిస్తే ఎలా ఉంటుందనే విషయమై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్న ట్లు సమాచారం. బూడిదవుతున్న బొగ్గు రోజుల తరబడి బొగ్గు నిల్వ ఉండటంతో స్వతహాగా మండుతూ టన్నుల కొద్ది బొగ్గు కా లిబూడిదై పోతోంది. రైల్వే ద్వారా తరలించే ప్రతి సీహెచ్‌పీలో ఇదే పరిస్థితి ఎదురవుతున్న ట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూగర్భ గనుల నుంచి వెలికి తీసిన బొగ్గును నిర్ణీత సమయంలోగా రవాణా చేయాలి. సకాలంలో పంపించక పోతే బొగ్గులో ఉన్న కార్బన్ బయ ట ఉన్న ఆక్సిజన్‌తో కలవడంతో దానంతట అదే మండే అవకాశం ఉంటుంది. ఇండోనేషియా ఎఫెక్ట్ రుద్రంపూర్(ఖమ్మం) : బొగ్గు ధరను ఇండోనేషియా ప్రభుత్వం భారీగా తగ్గించింది. గతం లో సుమారు 80 డాలర్లు ఉన్న ధరను ఒకేసారి 40 డాలర్లకు తగ్గించడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని విద్యుత్ ప్లాంట్లు ఆ దేశం నుంచి, మహానది కోల్‌ఫీల్డ్స్(ఒరిస్సా) నుంచి భారీగా దిగుమతి చేసుకుం టున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గుగనుల ద్వారా ఉత్పత్తి చేసే బొగ్గుకు డిమాండ్ తగ్గే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాక సింగరేణి బొగ్గు వాడకం తగ్గించే ప్రయత్నంలో కేటీపీఎస్ లాంటి సంస్థలు ఉన్నట్లు సమాచారం. కొత్తగూడెం ఏరియా పరిధిలోని ఆర్‌సీహెచ్‌పీ నుంచి రోజుకు 5 లేదా 6 రేకు లు బొగ్గు(ఒక్క రేకుకు 60 వ్యాగన్లు) చొప్పున కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. అయితే 25 రోజులనుంచి రోజుకు రెండు రేకుల బొగ్గును తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలి సింది. అదేమని సింగరేణి అధికారులు కేటీపీఎస్ అధికారులను అడిగితే యాజమాన్యం ఇష్టమని చెబుతున్నట్లు సమాచారం. రేకులు లేక నిలిచిపోతున్న బొగ్గులారీలు కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ కోల్హాండ్లింగ్ ప్లాంట్ నుంచి రోజుకు 5 లేదా 6రేకుల బొగ్గు కేటీపీఎస్కు రవాణా జరుగుతుంది. గత 20 రోజులుగా రోజుకు 5 రేకులు ఒక్కోక్క రోజు నాలుగు రేకుల బొగ్గు రవాణా అవుతోంది. దీంతో రోజుకు ఒక లోడ్ ర్యాక్ బొగ్గు రవాణా నిలిచిపోవడంతో జేవీ ఆర్ఓసీ, జీకేఓసీ నుంచి వచ్చే బొగ్గులారీలు నిలిచిపోతున్నాయి. ఆర్‌సీహెచ్‌పీ అధికారులు చేసేదిలేక బొగ్గును యాడ్‌లో డంప్ చేస్తున్నారు.