'డబుల్' కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఒప్పందం
హైదరాబాద్: డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్‌ను ఉత్పత్తి చేసే విషయంలో గృహ నిర్మాణ కార్పొరేషన్ సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో నిర్మించే డబుల్ బెడ్ రూం ఇళ్లకు అవసరమైన సిమెంట్‌ను బస్తా రూ.230కే విక్రయించేందుకు 32 సిమెంట్ సంస్థలు అంగీకరించాయి. ఇందుకుగాను సుమారు 27.31 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం పడుతుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో అధికారులు, కంపెనీల ప్రతినిధులు ఎంవోయూపై బుధవారం సంతకాలు చేశారు.