కరీంనగర్ జిల్లాలోని గోదావరి ఖని గంగానగర్ ఫ్లైఓవర్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
కరీంనగర్(గోదావరి ఖని): గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని వద్ద రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో పది మందికి గాయాలు అయ్యాయి. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని న్యూపోరట్‌పల్లికి చెం దిన బండారి మల్లయ్య శుక్రవారం ఉదయం మరణించగా, ఆయన అంత్యక్రియలకు వరంగల్ జిల్లా మొగుల్లపల్లి మండలం కురికిశాలకి చెందిన బంధువులు టాటా ఏస్ వాహనంలో వచ్చారు.
అంత్యక్రియల అనంతరం అదే వాహనంలో తిరుగు ముఖం పట్టారు. దారి తప్పి గోదావరిఖని సింగరేణి పవర్‌హౌస్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ టాటా ఏస్‌ను ఢీకొట్టింది. టాటా ఏస్‌లోని బండారి అనిల్(15), బండారి కుమార్(25), ఆశడపల్లి చిన్నన్న(60), మ్యాదరబోయిన అయిలయ్య(55), బండారి లక్ష్మీ(40), అప్పం సమ్మయ్య(45) ప్రాణాలొదిలారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.