మూసి ఉన్న మీ సేవా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.
గోదావరిఖని (కరీంనగర్) : మూసి ఉన్న మీ సేవా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అందులో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నీచర్ కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని మార్కండేయ కాలనీలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కాలనీకి చెందిన బాలసాని శ్రీనివాస్ సైబర్‌నెట్ పేరుతో మీసేవాకేంద్రంతో పాటు, కంప్యూటర్ సెంటర్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే ఈరోజు సాయంత్రం సెంటర్ మూసేసి బయటికి వెళ్లిన సమయంలో లోపలి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు తాళాలు పగులగొట్టడానికి ప్రయత్నించగా.. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు వ్యాపించకుండా ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు. రూ. 2 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు.