గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని 500 మెగావాట్ల నాలుగో యూనిట్‌లో సోమవారం సాంకేతిక లోపం కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగింది. ఇప్పటికే ప్లాంట్‌లోని 500 మెగావాట్ల 5వ యూనిట్‌లో వార్షిక మరమ్మతులు కొనసాగుతున్నాయి.
ఈ కారణంగా ఎన్టీపీసీలో 2600 మెగావాట్లకు గాను ప్రస్తుతం 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మంగళవారం వరకు నాలుగో యూనిట్ మరమ్మతులు పూర్తయి ఉత్పత్తి దశలోకి రానున్నట్టు తెలిసింది.
ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌లో అంతరాయం
Published Mon, May 19 2014 8:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement