గోదావరిఖని(కరీంనగర్): ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెలకు వెళ్లే దారిలో ఓ 45 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.