
సాక్షి, రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కరోనాతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వయంగా పీపీఈ కిట్‌లో ప్యాక్ చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన తీరుకు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. ‘
సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఒక డాక్టర్‌గా ఉండి మీరే స్వయంగా రెండు కోవిడ్ మృతదేహాలను ప్యాక్ చేయడం చాలా గొప్ప విషయం. మీరు చేసిన ఈ పని అభినందనీయం. సేవా భావంతోపాటు ధైర్యానికి, నిష్టకు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు.. నా అభినందనలు’ అంటూ ఫోన్‌లో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు.
కోవిడ్ మృతదేహాన్ని ప్యాక్ చేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment