గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలు మంగళవారం గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆడంబరంగా జరిగాయి. సింగరేణి పతాకాన్ని ఆర్జీ-1 సీజీఎం కె.సుగుణాకర్‌రెడ్డి ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ముందుగా గాలిలోకి శాంతికపోతాలను, బెలూన్లను అధికారులు, నాయకులు ఎగురవేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సింగరేణి అన్వేషణ విభాగం, ఫారెస్ట్, ఎంవీటీసీ, రెస్క్యూ, ఏరియా ఆసుపత్రి ఆరోగ్యశాఖ, ఏరియా వర్క్‌షాపు, పవర్‌హౌస్, జీడీకే 11వ గని, మహిళా సేవా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీజీఎం సుగుణాకర్‌రెడ్డి, సేవా అధ్యక్షురాలు సుజనీ, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు ఆరెల్లి పోషం, యాదగిరి సత్తయ్య, గండ్ర దామోదర్‌రావు, అల్లి శంకర్, జంగిలి రాజేశ్వర్‌రావు ప్రారంభించారు. ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తేనే సంస్థకు మనుగడ ఉంటుందని అన్నారు.
సింగరేణి అభివృద్ధికి, బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎస్‌ఓటు సీజీఎం సుధాకర్‌రెడ్డి, పర్సనల్ డీజీఎం బీఆర్.దీక్షితులు, పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్, టీబీజీకేఎస్‌ఉపాధ్యక్షులు ఆరెల్లి పోషం, సేవా అధ్యక్షురాలు సుజనీ సుగుణాకర్‌రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షులు ఆర్‌పీ.చౌదరి, వివిధ గనుల ఏజంట్లు, మేనేజర్లు సాంబయ్య, రమేష్‌రావు, బళ్లారి శ్రీనివాసరావు, బీవీ.రావు, రవీందర్, ఫారెస్ట్ అధికారి కర్ణ, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, అన్వేషణ విభాగం ఏజీఎం జియావుల్లా షరీఫ్, సివిల్ డీజీ ఎం సూర్యనారాయణ, ఏరియా వర్క్‌షాపు ఇన్‌చా ర్జి కేశవరావు, కార్మిక నాయకులు యాదగిరి సత్తయ్య, గండ్ర దామోదర్‌రావు, షబ్బీర్ అహ్మద్, జంగ కనకయ్య పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, దీపాలంకరణ పోటీ లు అలరించాయి. విజేతలకు బహుమతులు అందించారు. పర్సనల్ డీజీఎం బీఆర్ దీక్షితులు సింగరేణిపై రాసి పాడిన కవిత, పాట ఉత్తేజాన్ని కలిగించింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్‌ఎస్ డిపెం డెంట్లు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.
ఆడంబరంగా సింగరేణి డే
Published Wed, Dec 24 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement