సంఘటనా స్థలంలో మావోయిస్టు అగ్రనేత గాయపడినట్టుగా సమాచారం
చనిపోయాడని అధికారికంగా నిర్ధారించని పోలీస్ యంత్రాంగం
ఫేక్ లేఖ అంటున్న దామోదర్ అనుచర వర్గాలు
ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.
ఎన్‌కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు.
దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment