encounter death
-
బడే దామోదర్‌కు ఏమైంది?
ములుగు/ఎస్ఎస్ తాడ్వాయి: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌కు ఏమైందంటూ సర్వత్రా చర్చ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని పూజారి కాంకేర్– మారేడుపాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో దా మోదర్ మృతి చెందాడని శనివారం మావోయిస్టుపార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగా పేరిట విడుదలైన లేఖ ఫేక్ అంటూ దామోదర్ అనుచరులు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో దామోదర్ అక్క డే ఉన్నారని, ఆ సమయంలో గాయాలపాలైన ఆయన్ను అనుచరులు భద్రంగా మరోచోటకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దామోదర్ ఆరో గ్యం నిలకడగా ఉందని, ఆయన ప్రాణానికి ఎలాంటి హాని లేదని సమాచారం. సాధారణంగా ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు కుటుంబాలకు పోలీస్‌శాఖ తరఫున మరణవార్త తెలపడంతోపాటు మృతదేహాన్ని అప్పగిస్తారు. దామోదర్ మృతి చెందినట్టు ప్రచారం జరుగుతున్నా, అధికారికంగా పోలీస్‌శాఖ తరఫున కాల్వపల్లిలోని దామోదర్ తల్లి బతుకమ్మ, కుటుంబ సభ్యులకు, ములుగు జిల్లా పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో దామోదర్‌కు ఎలాంటి హాని జరగలేదని, కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాల్వపల్లివాసులు వాపోతున్నారు. -
జమ్ముకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్ అనంతనాగ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉజ్జైర్ ఖాన్ హతమయ్యాడు. ఈ మేరకు ఏడు రోజులుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌కు ముగింపు పలికినట్లు సైన్యం వెల్లడించింది. ఉజ్జైర్ ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమయినట్లు ఏడీజీపీ పోలీసు వినయ్ కుమార్ తెలిపారు. పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతనాగ్‌లో ఏడు రోజులుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు సాగింది. అటవీ ప్రాంతాల్లో, కొండ చరియల్లో నక్కి ఉన్న టెర్రరిస్టుల కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. రెండు రోజుల క్రితం సైన్యంపై ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ అధికారులతో పాటు జమ్ము కశ్మీర్ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఆర్మీ జవాన్ కిడ్నాప్.. హత్య -
జగదీష్ మృతితో గాజుల రేగలో విషాదఛాయలు
-
మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే
డిగ్రీ వరకు చదివాడు. దేశ సేవలో తరించాలని తలచాడు. సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. మంచి శరీరసౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదళం లీడర్‌గా ఎంపికయ్యాడు. వివాహ వయస్సు రావడంతో వచ్చేనెలలో జీవితభాగస్వామితో ఏడుఅడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్రచేసింది. పెళ్లి ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రూపంలో మృత్యువు కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో విషాదం అలముకుంది. మక్కువ/విజయనగరం: చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన కాల్పుల్లో జిల్లా యువకుడు, సీఆర్పీఎఫ్ జవాన్ రౌతు జగదీష్ (27) వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్ యంత్రాగం తెలిపిన వివరాల ప్రకారం...జగదీష్ స్వగ్రామం మక్కువ మండలం కంచేడువలస. ప్రస్తుతం ఆయన కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ చదువుకున్న జగదీష్ 2010లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. అక్క సరస్వతికి వివాహం అయ్యింది. జగదీష్ కూడా వచ్చేనెల 22న వివాహం చేసుకునేందుకు ముహూర్తం ఖరారైంది. మరో వారం రోజుల్లో సెలవుపై రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో కొడుకు మృతిచెందాడన్న వార్తతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆదుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్ మృతితో గాజులరేగ, కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్ డే పాటిస్తామని యువకులు తెలిపారు. మరో తెలుగు జవాన్ జగదీష్‌తో పాటు మరో తెలుగు జవాన్ మావోయిస్టుల చేతిలో మృతి చెందాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కూడా మరణించారు. విజయకుమారి, రవీంద్రబాబు దంపతుల రెండో సంతానం అయిన మురళీకృష్ణ ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా టూ10 విభాగంలో విధులు నిర్వర్తిస్తూ మావోయిస్టుల తుపాకీ గుళ్లకు బలయ్యాడు. త్వరలో మురళీ వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తుండగా జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ రోజు మధ్యాహ్నం జవాన్ మురళీ భౌతికకాయం గాజులరేగ గ్రామానికి చేరుకోనుంది. చదవండి: పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు -
కన్నపేగును కాదని.. ఉద్యమమే ఊపిరిగా..
సాక్షి, సీలేరు (విశాఖపట్టణం) : కన్నపేగు బంధం విడదీయరానిది. కాలే కట్టె వరకు ఆ బంధం ఎంతో గొప్పది. కడుపున పుట్టిన బిడ్డకు తన రొమ్మునుంచి ప్రతీ పాలచుక్కును ఇచ్చి, పెరిగి పెద్దయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్న గాయం తగిలినా ఆమె ప్రాణం విలవిలాడుతుంది. తన బిడ్డే సర్వస్వం అనుకునే ఎందరో మాతృమూర్తులను చూశాం. కానీ ఆ తల్లి పది నెలల బిడ్డ ఆలన పాలనా తమ బంధువులకు అప్పజెప్పి ఉద్యమమే ఊపిరిగా మావోయిస్టుల్లో చేరింది. తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో..రారో, ప్రాణాలతో వస్తారో రారో కూడా ఆ బిడ్డకు తెలియదు. ఇలాంటి తరుణంలో 30 ఏళ్ల తరువాత పేగుబంధం ఒకటి చేసింది. తన తల్లి ఉందని తెలుసుకొని ఒక కంట దుఖం, ఒక కంట ఆనందంతో తన తల్లిని చూసేందుకు పరుగులు తీసిన బిడ్డ. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కైలాసం, కళావతి దంపతులు. వీరికి ఒక కుమారుడు. అతడికి పది నెలల వయసులోనే తల్లిదండ్రులు మావోయిస్టుల దళంలోకి చేరారు. 2005లో ఏవోబీలో జరిగిన ఎన్కౌంటర్లో తండ్రి కైలాసం మృతి చెందాడు. తల్లి ప్రస్తుతం ఇదే ఏవోబీలో పెదబయలు ఏరియా కార్యదర్శిగా కళావతి అలియాస్ భవానీ ఉంటోంది. ఇటీవల విశాఖ ఏజెన్సీ మాదిగమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో భవాని గాయాలతో తప్పించుకొని చెరుకుమళ్లు గ్రామంలో మృత్యువుతో పోరాడుతూ పోలీసు బలగాలకు పట్టుబడింది. ఆమెను వారు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పత్రికల్లో రావడంతో.. ఆమెది అనంతపురం జిల్లా పేరు కళావతి, భర్తపేరు కైలాసం అని పత్రికల్లో రావడంతో వరుసకు కైలాసానికి అన్నయ్య అయిన నాగేశ్వరరావు, భవాని అన్నయ్య నరేష్ గుర్తించారు. ఈ విషయాన్ని నాగేశ్వరరావు, నరేష్‌లు తమ వద్ద పెరుగుతూ ప్రస్తుతం అనంతపురం స్టేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్న కళావతి కుమారుడికి చెప్పారు. దీంతో తన తల్లి ఉందని ఒక పక్క ఆనందం, మరో వైపు దుఖంతో పరుగు పరుగున రాజమండ్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు 12 మంది కుటుంబ సభ్యులతో వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబును కలిశారు. అతని ఆధ్వర్యంలో తన తల్లిని కలిసేందుకు ఆదివారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినట్లు చిట్టిబాబు సాక్షికి తెలిపారు. తల్లి, బిడ్డ చూసుకోవడం ఇదే మొదటిసారి మావోయిస్టు అగ్రనేత కైలాసం, భార్య కళావతి (భవాని). వీరిద్దరు కుమారుడిని పది నెలల వయసులో వదిలి ఉద్యమంలోకి వచ్చారు. అప్పటి నుంచి విశాఖ ఏజెన్సీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనే మావోయిస్టు పార్టీలో తుపాకీ చేతపట్టి అడవుల్లోనే తిరిగారు. ఒక్కసారి కూడా సొంత గ్రామానికి వెళ్లింది లేదు. తమ బిడ్డను చూసుకునేందుకు వారికి వీలు కుదరలేదు. ఈ తరుణంలో ఎన్కౌంటర్ జరగడం, ఆమె గాయాలతో తప్పించుకోవడంతో ఆ కుమారుడికి కన్నతల్లిని చూసుకొనే అవకాశం దక్కింది. ఒక్కసారిగా తన తల్లిని కలిసి గుండెకు హత్తుకొని బోరున విలపించి ఆనందం చెందాడు. -
బాలల సంఘం నుంచి దళ నేతగా..
చిట్యాల(భూపాలపల్లి) : పీడిత, తాడిత ప్రజల విముక్తి కోసం పేదల రాజ్యం సిద్ధించాలనే లక్ష్యంతో చార్‌మజూందార్ ఏర్పాటు చేసిన పీపుల్స్‌వార్ గ్రూపు లో చేరి 18 ఏళ్లపాటు అలుపెరగని పోరాటం చేసిన రౌతు విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అలి యాస్ శ్రీను(40) ఉద్యమ ప్రస్థానం మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముగిసింది. విజేందర్ మరణవార్త పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి అహల్య సొమ్మసిల్లిపోయింది. తమ్ముడు, కుమార్తె కన్నీటిపర్యంతమయ్యారు. ఉద్యమానికి ఊపిరి ‘చల్లగరిగె..’ చిట్యాల మండలంలో వెలిశాల తర్వాత చల్లగరిగె గ్రామం అప్పటి పీపుల్స్‌వార్‌కు ఊపిరిగా మారింది. ఈ గ్రామాల్లో 1200 మంది మాజీలు ఉన్నారు. 12 మంది అజ్ఞాతంలోకి వెళ్లగా కొందరు లొంగిపోయారు. అందులో దూడపాక మధు, పోశాల తిరుపతి, గోల్కోండ రమేష్, గంగరబోయిన స్వామి, రౌతు విజేందర్ మృతిచెందారు. విజేందర్ కుటుంబ నేపథ్యం మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన రౌతు అహల్య–నర్సింహారాము లు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో రెండవాడైన విజేందర్ స్థానిక హైస్కూల్లో పదవ తరగతివరకు చదువుకున్నాడు. విద్యార్థి దశ నుంచే విప్లవ బావాలు వ్యక్తపరిచేవాడన్నారు. అదే గ్రామానికి చెందిన మరో అజ్ఞాత నక్సలైట్ సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి ఇద్దరు కలిసి గ్రామంలో పీపుల్స్‌వార్ సానుభూతిరులుగా వ్యవహరించి పీపుల్స్‌వార్ కార్యకలాపాలు పకడ్భందీగా నిర్వహించేవారని మాజీలు చర్చించుకుంటున్నారు. బాలల సంఘం ఏర్పాటు విజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో 1990లో బాలల సంఘం ఏర్పాటు చేశారు. సుధాకర్, మరికొంత మందితో కలిసి బాలల హక్కుల పరిరక్షణ కోసం ఆయన ఉద్యమించాడు. భూస్వాములను, గుత్త పంచాయతీలు చేసే వ్యక్తులను నిలదీసేవాడు. 1996లో రాడికల్ యూత్ లీగ్(ఆర్‌వైఎల్)లో ఆయన చురుకైన పాత్ర నిర్వహించినట్లు పోలీసుల రికార్డులో ఉంది. సారా ప్యాకెట్లు ధ్వంసం చేయడం, వాల్‌పోస్టర్లు వేయడం, ఎన్కౌంటర్లకు నిరసనగా బస్సుల దహనం, పలువురిని చితకబాదిన సంఘటనల్లో విజేందర్ ముఖ్యభూమికను పోషించినట్లు సమాచారం. పోలీసులకు, పాలకులకు భూస్వాములకు ఆయన కంటిలో నలుసులా మారాడు. 1997లో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలులో అప్పటి పీపుల్స్‌వార్ ఉద్యమ నేత శాఖమూరి అప్పారావుతో ఏర్పడిన పరిచయం విజేందర్, సుధాకర్‌ను ఆజ్ఞాత ఉద్యమం వైపు నడిపించిందని మాజీలు తెలిపారు. 31 డిసెంబర్ 2000లో విజేందర్ అప్పటి పీపుల్స్‌వార్ గ్రూపులో చేరాడు. అంచలంచెలుగా ఎదిగిన విజేందర్ పీపుల్స్‌వార్ గ్రూపులో చేరిన విజేందర్ అలియాస్ శ్రీకాంత్ అంచలంచెలుగా ఎదిగాడు. ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి కడారి రాములుఅలియాస్ బాలన్నకు అంగరక్షకుడి పనిచేశాడు. ఆదిలాబాద్, సిరొంచ ఏరియా కమిటీ కార్యదర్శిగా పని చేశాడు. ప్రస్తుతం గడ్చిరోలి డివిజన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతూ ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. దళ సభ్యురాలు రజితను వివాహం చేసుకోగా పాప జన్మించడంతో చల్లగిరగెలోని తన తల్లిదండ్రుల వద్దకు పంపించాడు. ప్రస్తుతం రమ్య 8వ తరగతి చదువుతోంది. విజేందర్ కుటుంబానికి పోలీసుల చేయూత.. అజ్ఞాతంలో ఉన్న విజేందర్ కుటుంబానికి పోలీసులు అన్నివిధాలుగా చేయూతనిచ్చారు. అతడు లొంగిపోయేలా చూడాలని సీఐ గండ్రతి మోహన్ తల్లిదండ్రులకు, విజేందర్ కుమార్తె రమ్యకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇచ్చారు. బియ్యం, దుస్తులు అందజేశారు. విజేందర్ తండ్రి 9 నెలల క్రితం అనారోగ్యంతో చనిపోతే పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. రమ్యను కస్తూర్బాగాందీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పించారు. ఇంకా అజ్ఞాతంలో ముగ్గురు.. ఉత్తర తెలంగాణ ఉద్యమానికి చిట్యాల ఏరియా ఒకప్పుడు వెన్నుదన్నుగా నిలిచింది. వెలిశాల గ్రామం ఉద్యమానికి ప్రయోగశాలగా మారింది. ఇంటికో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు విప్లవ బాట పట్టారు. ఒకే కుటుంబం నుంచి గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్, గాజర్ల రవి అలియాస్ గణేష్, అశోక్ అలియాస్ ఐతు ఉద్యమానికి ఇరుసుగా మారి ఉత్తర తెలంగాణ వరకు విస్తరింపచేశారు. కేంద్ర కమిటీ సభ్యులుగా రాణిస్తు ఇతర రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అజ్ఞాతంలో వెలిశాలకు చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్(చర్చల ప్రతినిధి), చల్లగరిగెకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ మురళి, రామచంద్రాపూర్‌కు చెందిన క్యాతం రాజు కొనసాగుతున్నారు. అన్న తిరిగొస్తాడనుకున్న.. అన్న 18 ఏళ్ల క్రితం ఇల్లు ఇడిసి పెట్టి పోయిండు. ఇప్పటి వరకు ఇటు రాలేదు. తిరిగొస్తాడని ఎదురు చూస్తానం. అన్న కోసమే నాన్న బాధపడుతు చనిపోయిండు. అమ్మ అనారోగ్యంతో ఉంది. అన్న కుమార్తె రమ్యను కూలి చేసి పోషిం చుకుంటున్నం. అన్న చావకుండ ఉండాలి. బ్రతికి తిరిగి రావాలి. – కుమారస్వామి, మృతుడి సోదరుడు -
మావోయిస్టుల ప్రతీకారేచ్ఛ..!
‘‘పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం ఉంటుంది. నెత్తుటి బాకీ తీర్చుకుంటాం. అమరులైన వీరులకు నివాళులర్పిస్తాం...’’ ఇది, మార్చి 3న, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ చేసిన హెచ్చరిక (ఆడియో టేప్). అంతకు ముందు రోజు (మార్చి 2న) మన రాష్ట్ర సరిహద్దులోగల ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారికాంకేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పదిమంది మావోయిస్టులు మృతిచెందారు. ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోయిస్టులు అన్నంత పని చేస్తున్నారు. హత్యాకాండ సాగిస్తూనే ఉన్నారు. చర్ల : ఇప్పటికి 12. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇది. ఇందులో పదిమంది జవాన్లు, ఇద్దరు సామాన్యులు. పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌కు కారకులని ఆరోపిస్తూ, చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామస్తుడు ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసురు పోలీస్ స్టేషన్ పరిధిలోగల చినఊట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును మావోయిస్టులు బుధవారం సాయంత్రం చంపేశారు. అక్కడ లేఖలు వదిలారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ హెచ్చరించిన మూడో రోజునే హత్యాకాండ మొదలైంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దోర్నపాల్ సమీపంలో నాలుగు బస్సులను దహనం చేశారు. ఓ బస్సులో ప్రయాణిస్తున్న కానిస్టేబుల్‌ను చంపేశారు. మార్చి 13న మరో దారుణానికి తెగబడ్డారు. ఇదే జిల్లాలోని కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోగల పాలోడు బేస్ క్యాంపునకు జవాన్లు వెళుతున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేశారు. ఈ దాడిలో తొమ్మిదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, బీజాపూర్ జిల్లాలోని చినఊట్లపల్లి గ్రామ సమీపంలోగల తాలిపేరు వాగు వద్ద పూసుగుప్పకు చెందిన ఇర్పా లక్ష్మణ్ అలియాస్ భరత్‌ను, చినూట్లపల్లికి చెందిన సోడి అందాల్ అలియాస్ నందు అలియాస్ రఘును చంపేశారు. దీంతో, ఎన్కౌంటర్ తరువాత మావోయిస్టులు చంపిన వారి సంఖ్య 12కు చేరింది. రాష్ట్ర సరిహద్దుల్లో బలగాలు కూంబింగ్ సాగిస్తున్నాయి. మావోయిస్టులు కూడా ఇలా హత్యలు, ఇతరత్రా దుశ్చర్యలు (బస్సులు, లారీలు, జేసీబీలు, పొక్లెయిన్లు, కాంక్రీట్ మిల్లర్లను దహనం చేయడం) సాగిస్తూనే ఉన్నారు. ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు, హత్యల నేపథ్యంలో ఏ క్షణాన ఏం జరుగుతందోనని ఇటు తెలంగాణ, అటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు తీవ్ర భయాందోళనతో ఉన్నారు. బలగాలు ఒకవైపు విస్తృతంగా కూంబింగ్ సాగిస్తుండగానే, మావోయిస్టులు మరోవైపు హత్యలు–దుశ్చర్యలకు దిగుతుండడంతో తీవ్ర ఆందోళన–అయోమయం నెలకొంది. పూజారి కాంకేర్ ఎన్కౌంటర్ జరిగిన నెల కూడా పూర్తవలేదు. ఇంతలోనే 12మందిని మావోయిస్టులు బలిగొన్నారు. మున్ముందు ఇంకెంతగా రెచ్చిపోతారో.. ఎవరెవరిని బలి గొంటారో.. సరిహద్దుల్లో సర్వత్రా ఇదే చర్చ. -
అంకె మారింది. ఎనిమిది కాదు.. తొమ్మిది!
మేళ్లమడుగు ఎన్కౌంటర్ మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ తొమ్మిదో మృతదేహం.. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చింది.. మరెన్నో ప్రశ్నలను లేవనెత్తింది. తుపాకీ తూటాలు సాగించిన ఈ నరమేధం.. పోలీసులు చెబుతున్నట్టుగా ఎన్‌కౌంటరేనా..? కొందరు ఆరోపిస్తున్నట్టుగా బూటకమా..? పొదల్లో ఈ మృతదేహం ఎందుకుంది..? ఎన్కౌంటర్ నిజమేననడానికి ఇది నిదర్శనమా..? ‘పోలీసులే పొదల్లో పడేశార’న్నది వాస్తవమా..? ఎన్‌కౌంటరా..? హత్యలా..? ఈ ప్రశ్నలకు జవాబులేవి..??!! ఇల్లెందు: ఇల్లెందు సబ్ డివిజన్ టేకులపల్లి మండలం మేళ్లమడుగులో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన ‘సీపీఐ(ఎంఎల్) సీపీ బాట’ అజ్ఞాత దళం సభ్యుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఆ రోజున ఎనిమిదిమంది చనిపోయారని పోలీసులు ప్రకటించారు. కాల్పులు జరిగిన ప్రదేశంగా పోలీసులు చెప్పిన స్థలానికి కొద్ది దూరంలోగల చెట్ల పొదల నుంచి మరో మృతదేహాన్ని పోలీసులే శనివారం స్వాధీనపర్చుకున్నారు. రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్‌గా గుర్తించారు. ఎవరీ కిరణ్ అలియాస్ కార్తీక్..? మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ వీరన్న–కౌసల్య దంపతుల కుమారుడే కిరణ్ అలియాస్ కార్తీక్. ఇతని వయసు 30 ఏళ్ల లోపు ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందాడు. తల్లి, అక్క లావణ్య, చెల్లి సౌజన్య ఉన్నారు. అక్కకు వివా«హమైంది. చెల్లి, డిగ్రీ మధ్యలోనే ఆపేసి ఇంటివద్దనే ఉంటోంది. ఇతడు దాదాపుగా పదేళ్ల నుంచి తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి మాత్రమే తన ఇంటికి వెళ్లాడు. ఉమ్మడి న్యూడెమోక్రసీలో ఏడెనిమిది సంవత్సరాలపాటు పనిచేశాడు. న్యూడెమోక్రసీలో చీలికకు ముందు ఇతడు పాల్వంచ ఏరియా విజయ్, రాము దళాల్లో పనిచేశాడు. పార్టీలో చీలిక తరువాత చంద్రన్న వర్గంలోని రాము దళంలోకి వెళ్లాడు. ఆరు నెలల క్రితం వరకు ఇందులోనే ఉన్నాడు. ఈ దళం సభ్యురాలైన సుమలత అలియాస్ గీతను పెళ్లి చేసుకున్నాడు (అప్పటికి వీరిద్దరూ ఇదే దళంలో సభ్యులుగా ఉన్నారు). గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె తన పుట్టింటికి వెళ్లింది. బాబు జన్మించిన తరువాత నుంచి దళం వైపు తిరిగి రాలేదు. కిరణ్ అలియాస్ కార్తీక్ మాత్రం అప్పుడప్పుడు తన భార్య వద్దకు వెళ్లి రెండు మూడు రోజుల వరకు ఉండేవాడు. అతడు క్రమంగా మద్యానికి బానిసగా మారాడు. ఈ నేపథ్యంలో, అతడిని రాము దళం దూరంగా పెట్టింది. అప్పటి నుంచి ఇతడు పాల్వంచ వద్దనే కుటుంబంతో నివాసముంటూ, పైపుల కంపెనీలో పనిచేస్తున్నాడు. తన స్వగ్రామంలోని స్నేహితుడు రషీద్ అలియాస్ విజయ్ (సీపీ బాట వ్యవస్థాపకుల్లో ఇతడు కూడా ఉన్నాడు) ద్వారా ఆరు నెలల క్రితం సీపీ బాటలో చేరాడు. మేళ్లమడుగులో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తీరుతో అనుమానాలు ♦ మేళ్లమడుగు కాల్పుల ఘటన(ఎన్కౌంటర్) వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటి ఆధారంగానే, మొత్తం ఈ ఎన్‌కౌంటరే బూటకమని వాదిస్తున్నారు. ఆ అనుమానాలు ఇవీ... ♦ గురువారం ఉదయం ఐదారు గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు చెప్పారు. మృతదేహాలను మధ్యాహ్నం తరలించారు. అప్పటి వరకు ఆ ప్రదేశానికి ప్రజలనుగానీ, పార్టీల నాయకులనుగానీ, మీడియానుగానీ పోలీసులు అనుమతించలేదు. అక్కడ జరిగింది నిజంగా ఎన్‌కౌంటరే అయినట్టయితే.. ఇంత దాపరికం ఎందుకు? మీడియాను ఎందుకు అనుమతించలేదు..? ♦ మృతదేహాలను ట్రాక్టర్లోకి చేర్చక ముందే.. దానికి (ట్రాక్టర్ ట్రక్కుకు) రక్తపు మరకలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? (ప్రజాసంఘాలు, ఎన్డీ, పౌర–మానవ హక్కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అనుమానమిది). ♦ సాధారణంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు, అక్కడి నుంచి సుమారు కిలోమీటర్ దూరం వరకు పరిసర ప్రాంతాలకు స్థానికులను పోలీసులు పంపించి సోదా చేయిస్తారు. మేళ్లమడుగు ఘటన జరిగిన రోజున ఇలా చేయలేదు. కనీసంగా మీడియాను కూడా మధ్యాహ్నం వరకు అనుమతించలేదు. ఎందుకు..? ♦ ‘అక్కడ జరిగింది ఎన్‌కౌంటరేనని నమ్మించేందుకే గుబురు పొదల్లో మృతదేహాన్ని పోలీసులే పడేశారా..?’ అని, ఎన్డీ నేతలు గుమ్మడి నర్సయ్య, మధు, సాధినేని వెంకటేశ్వరరావు తదితరులు ప్రశ్నిస్తున్నారు. ‘ఇది ఎన్కౌంటర్ కాదు. పోలీసులు చేసిన హత్యలు’ అని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఇవి దేనికి సంకేతాలు..? మొన్ననేమో ఎన్డీ అజ్ఞాత దళాల అగ్ర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్ననేమో మేళ్లమడుగు కాల్పుల్లో దళ సభ్యులు తొమ్మిదిమంది చనిపోయారు. ఈ పార్టీ – ఆ పార్టీ అనే తేడా లేకుండా మొత్తంగా సాయుధ (అజ్ఞాత) దళాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ‘తుపాకీ సంస్కృతి’ని తుదికంటా తొలగించేందుకు కంకణం కట్టుకుంది. ఇకపై మరింత కఠినంగా ఉంటామని చేతల్లో చూపుతోంది. మరో మృతదేహం దొరికింది టేకులపల్లి: టేకులపల్లి మండలం మేళ్ళమడుగు అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ‘ఎన్కౌంటర్లో చనిపోయింది ఎనిమిదిమంది కాదు.. తొమ్మిదిమంది’ అని పోలీసులు ప్రకటించారు. ఎలా కనిపించిందంటే... గురువారం రోజంతా, కాల్పుల ప్రదేశం నుంచి మృతదేహాల తరలింపుతోనే పోలీసులకు సరిపోయింది. వాటిని గుర్తించడంతో, కుటుంబీకులకు అప్పగించడంతో శుక్రవారం గడిచింది. కాల్పుల స్థలాన్ని పునఃపరిశీలించేందుకు శనివారం అక్కడకు ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో టేకులపల్లి, గుండాల సీఐలు టి.రవి, దోమల రమేష్, టేకులపల్లి, బోడు ఎస్ఐలు అరుకల అనిల్, ఒడ్డేపల్లి మురళి, స్పెషల్ పార్టీ పోలీసులు వెళ్లారు. పరిసరాల్లో ముమ్మరంగా తనిఖీలు సాగిస్తున్నారు. ఎన్కౌంటర్ ప్రాంతంలోగల కోడెవాగు అవతలనున్న చెట్ల పొదల నుంచి దుర్వాసన వస్తుండడాన్ని పోలీసులు పసిగట్టారు. దగ్గరగా వెళ్లి చూసేసరికి మృతదేహం కనిపించింది. దగ్గరగా వెళ్లారు. ఒంటిపై జర్కిన్ ఉంది. లోపల ఖాకీ చొక్కా ధరించాడు. పక్కనే 8 ఎంఎం రైఫిల్‌తోపాటు బుల్లెట్లు కనిపించాయి. అక్కడే చిన్న నోట్ బుక్ కూడా ఉంది. దాని ఆధారంగా, అతడిని మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్((28)గా గుర్తించారు. మృతదేహానికి అక్కడే టేకులపల్లి తహసీల్దార్ సరికొండ అంజంరాజు, డిప్యూటీ తహసీల్దార్ వీరభద్ర నాయక్, వీఆర్వో నాగమణి కలిసి పంచనామా నిర్వహించారు. ఆ తరువాత, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఏం చెప్పారంటే... ఈ తొమ్మిదో మృతదేహానికి సంబంధించి ఇల్లెందు డీఎస్పీ జి.ప్రకాశ్‌రావు ఇలా ప్రకటించారు. ‘‘మేళ్ళమడుగు అటవీ ప్రాంతంలో గురువారం ఎన్కౌంటర్ జరిగిన తరువాత రెండు రోజుల నుంచి ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతోంది. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని పరిశీలిచేందుకు ఆ అటవీ ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాం. కోడెవాగు అవతల చెట్ల పొదల నుంచి దుర్వాసన వచ్చింది. వెళ్లి చూస్తే.. మృతదేహం కనిపించింది. పక్కన 8 ఎంఎం బుల్లెట్లు 50 రౌండ్లు, ఒక 8 ఎంఎం తుపాకీ, చిన్న నోట్‌బుక్ ఉన్నాయి. ఆ నోట్ బుక్ ఆధారంగా మృతదేహాన్ని సీపీఐ (ఎంఎల్) సీపీ బాట దళానికి చెందిన రాచకొండ కిరణ్ అలియాస్ కార్తీక్(28)గా గుర్తించాం’’. ఈ అరెస్టులు.. కాల్పులు.. నక్సల్స్ దళాలకు ప్రభుత్వం ఇచ్చిన సంకేతాలు..! -
ఎన్కౌంటర్ మృతులకు రూ. 3లక్షల పరిహారం
తమిళనాడు/చిత్తూరు: శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ. 3లక్షల చొప్పున నష్టపరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. చిత్తూరు జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మద్రాస్ హైకోర్టు లాయర్లు బుధవారం నిరసకు దిగారు. ఎన్కౌంటర్ పేరుతో కూలీలను కాల్చిచంపినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిరసనగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు.