jawahar lal nehru stadium
-
గ్రౌండ్లో గుక్కెడు నీళ్లు దొరక్క...
సాక్షి, న్యూఢిల్లీ : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మళ్లీ తప్పులు చేయకూడదనే ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ, మన క్రీడా శాఖ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధం. విమర్శలు, వివాదాలు వాటికి కొత్తేం కాదు. దేశంలో తొలిసారి ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (అండర్ 17) నిర్వహిస్తున్నప్పటికీ.. కనీస సదుపాయాలను కల్పించడంలో ఘోరంగా విఫలమవుతూ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. శుక్రవారం నుంచి మొదలైన ఈ క్రీడా సంబురంలో భారత్ అమెరికా చేతిలో పరాజయం పాలైంది. అయితే భారత్ తొలి మ్యాచ్ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ‘జవహార్ లాల్ నెహ్రూ మైదానాని’కు రావటంతో ప్రేక్షకులను నింపే ఉద్దేశ్యంతో ఫ్రీ టికెట్లు జారీ చేసి సుమారు 27 వేల మంది విద్యార్థులను రప్పించింది క్రీడా శాఖ. మ్యాచ్ నిరాశపరిచినప్పటికీ... వారి కోలాహలంతో మైదానం మారు మోగిపోయింది. ఇంత దాకా బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. అసలే ఎండ.. పైగా ఉక్కపోత... దీనికి తోడు అరిచి ఉండటంతో దాహర్తితో ప్రేక్షకులు అల్లలాడిపోయారు. మైదానంలోకి బాటిళ్లను అనుమతించకపోగా.. స్టేడియం నిర్వాహకులు కూడా లోపల నీటి సదుపాయాన్ని కల్పించలేకపోయారు. దీంతో అభిమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అందుబాటులో ఉంచిన కొన్ని నీళ్ల సీసాలు సరిపోకపోవడంతో వా(నీ)టి కోసం పోటీ పడ్డారు. దక్కనివారు దాహానికి తాళలేక టాయిలెట్‌లోని నళ్లా నీటి ద్వారా దాహం తీర్చుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు వాటర్ బాటిల్ కోసం ఎంతైనా వెచ్చిస్తాం.. అందించండి అంటూ భద్రతా సిబ్బందిని వేడుకోవటం కనిపించింది. అదే సమయంలో విద్యార్థుల కోసం తీసుకొచ్చిన ఆహార పదార్థాలు భద్రతా కారణాల దృష్ట్యా ఆలస్యం లోపలికి అనుమతించారు. దీంతో మ్యాచ్ రెండో సగం తర్వాతే వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఓవైపు నీళ్లు.. మరోవైపు తిండి లేక అభిమానులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇక స్టేడియంలో డస్ట్బిన్లు సరిపడా ఉంచకపోవడంతో స్టేడియం మొత్తం చెత్తాచెదారంతో నిండిపోయింది. గ్రౌండ్ నిర్వాహకులు.. ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఘోరంగా వైఫల్యం చెందినట్లు స్థానిక నిర్వాహక కమిటీ ఆరోపిస్తోంది. గతంలో కామన్వెల్త్ క్రీడలు-2010 సందర్భంగా కూడా సరైన ఏర్పాట్లు కల్పించలేకపోయిందని క్రీడా శాఖపై తీవ్ర విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన క్రీడా వేడుకలపై నిర్లక్ష్యం ప్రదర్శించటం గమనార్హం. -
ఆడంబరంగా సింగరేణి డే
గోదావరిఖని: సింగరేణి సంస్థ ఆవిర్భావ వేడుకలు మంగళవారం గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆడంబరంగా జరిగాయి. సింగరేణి పతాకాన్ని ఆర్జీ-1 సీజీఎం కె.సుగుణాకర్‌రెడ్డి ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ముందుగా గాలిలోకి శాంతికపోతాలను, బెలూన్లను అధికారులు, నాయకులు ఎగురవేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన సింగరేణి అన్వేషణ విభాగం, ఫారెస్ట్, ఎంవీటీసీ, రెస్క్యూ, ఏరియా ఆసుపత్రి ఆరోగ్యశాఖ, ఏరియా వర్క్‌షాపు, పవర్‌హౌస్, జీడీకే 11వ గని, మహిళా సేవా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీజీఎం సుగుణాకర్‌రెడ్డి, సేవా అధ్యక్షురాలు సుజనీ, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు ఆరెల్లి పోషం, యాదగిరి సత్తయ్య, గండ్ర దామోదర్‌రావు, అల్లి శంకర్, జంగిలి రాజేశ్వర్‌రావు ప్రారంభించారు. ఆర్జీ-1 సీజీఎం సుగుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ సింగరేణికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తేనే సంస్థకు మనుగడ ఉంటుందని అన్నారు. సింగరేణి అభివృద్ధికి, బంగారు తెలంగాణ సాధనకు బాటలు వేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమాల్లో ఎస్ఓటు సీజీఎం సుధాకర్‌రెడ్డి, పర్సనల్ డీజీఎం బీఆర్.దీక్షితులు, పర్సనల్ మేనేజర్ మంచాల శ్రీనివాస్, టీబీజీకేఎస్ఉపాధ్యక్షులు ఆరెల్లి పోషం, సేవా అధ్యక్షురాలు సుజనీ సుగుణాకర్‌రెడ్డి, సీఎంఓఏఐ అధ్యక్షులు ఆర్పీ.చౌదరి, వివిధ గనుల ఏజంట్లు, మేనేజర్లు సాంబయ్య, రమేష్‌రావు, బళ్లారి శ్రీనివాసరావు, బీవీ.రావు, రవీందర్, ఫారెస్ట్ అధికారి కర్ణ, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, అన్వేషణ విభాగం ఏజీఎం జియావుల్లా షరీఫ్, సివిల్ డీజీ ఎం సూర్యనారాయణ, ఏరియా వర్క్‌షాపు ఇన్చా ర్జి కేశవరావు, కార్మిక నాయకులు యాదగిరి సత్తయ్య, గండ్ర దామోదర్‌రావు, షబ్బీర్ అహ్మద్, జంగ కనకయ్య పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, దీపాలంకరణ పోటీ లు అలరించాయి. విజేతలకు బహుమతులు అందించారు. పర్సనల్ డీజీఎం బీఆర్ దీక్షితులు సింగరేణిపై రాసి పాడిన కవిత, పాట ఉత్తేజాన్ని కలిగించింది. తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఎస్ డిపెం డెంట్లు ప్లకార్డులతో డిమాండ్ చేశారు.