
యాక్షన్ టీంలపై నిఘా
‘యాక్షన్ టీంలపై నిఘా పెట్టాం.. జిల్లా లో వారి ఉనికి లేకుండా చేస్తాం.. ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నాం..’ అని ఓఎస్డీ సుబ్బారాయుడు అన్నారు.
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ :
‘యాక్షన్ టీంలపై నిఘా పెట్టాం.. జిల్లా లో వారి ఉనికి లేకుండా చేస్తాం.. ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నాం..’ అని ఓఎస్డీ సుబ్బారాయుడు అన్నారు. గోదావరిఖని వన్‌టౌన్ పోలీ స్‌స్టేషన్‌ను ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ యాక్షన్ టీంలు సంచరిస్తున్నాయని సమాచారంతో ఇప్పటికే నిఘాను తీవ్రం చేసినట్లు తెలిపారు. ఇందులోభాగంగా కూంబింగ్‌ను విస్తృతం చేశామని, పా రామిలటరీ, గ్రేహౌండ్స్ బృందాలను రప్పిస్తున్నామని వివరించారు.
మావోయిస్టుల చర్యల ను ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధంచేసినట్లు వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు, సానుభూతి పరులపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేకు న్నా.. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలు పోలీ సులతో తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో సికాస (సింగరేణికార్మిక సమాఖ్య) ఉనికి లేదన్నారు.
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఓఎస్డీ సుబ్బారాయుడు సూచించారు. పోలీసుల సిబ్బందితో ప్రత్యేకం గా సమావేశమయ్యారు. సానుభూతిపరులు, లొంగిపోయిన మావోయిస్టులు, మిలిటెంట్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో నేరాల అదుపు కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరిఖని సబ్‌డివిజన్ డీఎస్పీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్, ఎస్సైలు పాల్గొన్నారు.