
అరవింద్
గోదావరిఖని: ‘ఈ లోకంలో బతకాలని లేదు.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసు కున్నాడు. గోదావరిఖనిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. స్థానిక ఎల్‌బీ నగర్‌కు చెందిన శ్రీరాముల అరవింద్(27) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. కొద్ది కాలం కిందటే అతని తండ్రి చనిపోయారు.
అర వింద్ ఇంట్లో తల్లితోనే ఉంటూ.. వర్క్ ఫ్రం హోంచేస్తున్నాడు. సోమ వారం ఉరేసుకుని మృతి చెందాడు. ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం లో చేరిన అతడు, పని ఒత్తిడి తట్టు కోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ‘ఈ లోకంలో బత కడం ఇష్టం లేకనే చనిపోతున్నా.. అమ్మా జాగ్రత్త’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడని పోలీసులు వెల్లడించారు.
చదవండి: పెళ్లయిన మూడో రోజే గొంతు కోసుకొని నవ వరుడి ఆత్మహత్య