టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో సింగరేణి
న్యూస్‌లైన్, గోదావరిఖని,సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో సింగరేణికి సంబంధించిన పలు అంశాలను చేర్చింది. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంత ప్రజల కోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అందులో పేర్కొంది.
తెలంగాణ ఏర్పడిన సందర్భంగా కార్మికులకు ఇంక్రిమెంట్లు, డిపెం డెంట్ ఉద్యోగాల విధానం అమలు.
సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపూర్, భూపాలపల్లి పట్టణాల్లో మెరుగైన వైద్యాన్ని అందించేందుకు వైద్యశాలలను అభివృద్ధి చేయడం.10 వేల మెగావాట్ల విద్యుత్‌స్థాపనకు కొత్త థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన బొగ్గు వెలికితీయడానికి భూగర్భ గనులు ప్రారంభించడం.ఓపెన్‌కాస్టు గనులను నియంత్రించడం, బొగ్గుగనులను జాతి సంపదగా భావించి భావితరాల కోసం కాపాడుకోవడం.
కోల్‌బెల్ట్ ప్రాంతంలో అడవుల నరికివేతను అరికట్టడం, చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోవడం.కాగజ్‌నగర్ నుంచి మణుగూర్ వరకు కోల్‌బెల్ట్ ఏరియాను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా మార్చడానికి చర్యలుకొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.సింగరేణి ప్రాంతంలో గనులున్న చోటనే విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుచేసి వాటి ద్వారా రానున్న ఐదేళ్లలో కరెంటు కోతల నుంచి రైతాంగాన్ని విముక్తి చేయడమే లక్ష్యం.
రాబోయే మూడేళ్లలో పరిస్థితుల ఆధారంగా అదనపు విద్యుత్ కోసం భూపాలపల్లిలో స్టేజ్-2 కింద 600 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి ప్లాంట్‌లో 1200 మెగావాట్లు, రామగుండం వద్ద 2ఁ660 మెగావాట్లు, సత్తుపల్లి థర్మల్ స్టేషన్ ద్వారా 500 మెగావాట్లు కలిపి మొత్తం 5,400 మెగావాట్ల స్థాపిక విద్యుత్‌శక్తిని అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించడం.