
ప్రాణం తీసిన ఫొటో సరదా
వేగంగా వస్తున్న రైలు ముందు నిలబడి ఫొటో దిగాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణం తీసింది.
హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పని చేసే శ్రావణ్‌కుమార్‌తో ఫొటో దిగుతుండగా... మరో స్నేహితుడు ఫొటో తీస్తున్నాడు. వెనుకనుంచి వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు అతి సమీపం లోకి వచ్చినా గమనించకుండా ఏమరుపాటుగా ఉండడంతో రైలు ఢీకొని సంపత్ అక్కడికక్కడే మృతిచెందాడు. శ్రావణ్‌కుమార్ చేయి నుజ్జునుజ్జు అయ్యింది. సంపత్‌కు భార్య, కవల పిల్లలున్నారు.