‘ఖని’లో బీజేపీ బైక్ ర్యాలీ | godavarikhani in BJP bike rally | Sakshi

‘ఖని’లో బీజేపీ బైక్ ర్యాలీ

Apr 22 2014 2:18 AM | Updated on Mar 29 2019 6:00 PM

‘ఖని’లో బీజేపీ బైక్ ర్యాలీ - Sakshi

‘ఖని’లో బీజేపీ బైక్ ర్యాలీ

బీజేపీ రామగుండం అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డిని గెలి పించాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం గోదావరిఖనిలో మోటార్ వాహనాల ర్యాలీ నిర్వహించారు.

గోదావరిఖని, న్యూస్‌లైన్ : బీజేపీ రామగుండం అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డిని గెలి పించాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు సోమవారం గోదావరిఖనిలో మోటార్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పార్టీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ తప్పకుండా ప్రధాని అవుతారని, రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 గుజ్జుల రామకృష్ణారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పోచమ్మ మైదా నం వద్ద ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీనగర్ మీదుగా తిలక్‌నగర్, ఫైవింక్లయిన్‌ఏరియా, హనుమాన్‌నగర్, జీఎం కాలనీ, గంగానగర్, బస్టాండ్ కాలనీ, మార్కండేయకాలనీ, అడ్డగుంటపల్లి వరకు కొనసాగింది.

ర్యాలీలో బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు పెద్దపల్లి రవీందర్, సుల్వ లక్ష్మీనర్సయ్య, గాండ్ల ధర్మపురి, మామిడి రాజేశ్, దారవేని రాజేశ్, కూరగాయల తిరుపతి, కోమళ్ళ మహేష్, సంజీవ్‌కుమార్, మల్హర్‌రావు, మహా వాది రామన్న, కోమళ్ల పురుషోత్తం, చిలుక శంకర్, మాదాసు సుధాకర్, భాస్కర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement