'ఖని’లో పోలీస్ కమిషనరేట్?
Published Wed, Oct 5 2016 12:59 PM | Last Updated on Tue, Aug 21 2018 6:22 PM
గోదావరిఖని: గోదావరిఖనిలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో జరగనున్న పోలీస్ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారుల మధ్య జరగనున్న సమావేశం జరగనుంది. ఇందులో గోదావరిఖనిలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఏర్పాటు చేసే విషయమై చర్చించనుండగా... ఈ సమావేశానికి ఎస్పీ జోయల్ డేవిస్ హాజరవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఇటీవల కార్పొరేషన్‌గా ఉన్న నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలను పోలీస్ కమిషనరేట్‌గా ప్రకటించగా... తాజాగా రామగుండం కార్పొరేషన్ ఏరియాను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని పరిధిలోకి రామగుండం, మంచిర్యాల మున్సిపాలిటీని తీసుకువచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.
గతంలో గోదావరిఖని పోలీస్ సబ్ డివిజన్ ప్రాంతాన్ని కమిషనరేట్ చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. ఆనాడు ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తాజాగా గోదావరిఖనిని పోలీస్‌కమిషనరేట్‌గా చేసేందుకు ఎస్పీ డేవిస్ ప్రతిపాదనలతో బుధవారం జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. గోదావరిఖనిలో క మిషనరేట్ ఏర్పాటు చేసేందుకు అనువుగా పోలీస్ హెడ్‌క్వార్టర్ అందుబాటులో ఉంది. డీఐజీ అధికారి పర్యవేక్షణలో ఉండే కమిషనరేట్ కింద పరిపాలన సజావుగా సాగేందుకు రామగుండం, మంచిర్యాల పరిధిలో పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచనున్నారు.
Advertisement
Advertisement