children killed
-
తండ్రి మీద కోపంతో పిల్లలను కారుతో గుద్దించి..
లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ జరగలేదు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై పిల్లల్ను ఆసుపత్రికి తరలించగా ప్రమాదమేమీ లేదని చిన్న చిన్న గాయాలు మాత్రం తగిలాయని తెలిపారు వైద్యులు. మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్. జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా సేకరించారు పోలీసులు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్ -
న్యూయార్క్ అపార్ట్మెంట్లో అగ్నికీలలు
న్యూయార్క్: న్యూయార్క్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బ్రోన్స్ ప్రాంతంలోని 19 అంతస్తుల భవంతిలో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు మంటలు వ్యాపించడం మొదలైంది. భారీ స్థాయిలో మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ వేగంగా విస్తరించడంతో వాటిల్లో చిక్కుకుని 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు. ఆఫ్రికాలోని గాంబియా నుంచి వలస వచ్చిన ముస్లిం కుటుంబాలు ఆ డూప్లెక్స్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్వీట్ చేశారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆయన చెప్పారు. ఒక బెడ్రూమ్లోని ‘గదిని వేడిగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్’ నుంచి మంటలు మొదలై గది మొత్తం విస్తరించి, తర్వాత అపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయని న్యూయార్క్ అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియల్ నీగ్రో వివరించారు. బిల్డింగ్‌లోని ప్రతీ ఫ్లోర్‌లోని మెట్ల వద్ద అపార్ట్మెంట్ వాసులు విగతజీవులై కనిపించారని ఆయన తెలిపారు. విపరీతంగా కమ్మేసిన పొగకు ఊపిరాడక, గుండె ఆగిపోవడంతో కొందరు మరణించారని కమిషనర్ వెల్లడించారు. 32 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ ఆస్పత్రిలో చేర్పించారు. -
విషాదం: ఇద్దరు పిల్లల్ని హతమార్చి.. ఆత్మహత్య
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లల పర్యవేక్షణ భారమై ఓ తండ్రి చెన్నైలో శనివారం కిరాతకానికి పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల్ని హతమార్చి తాను కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై కొరుక్కుపేట జీవానగరం ఆరవ వీధికి చెందిన వినోద్(32) ఎలక్ట్రీషియన్. ఇతడికి భార్య కవిత(27), కుమారులు నవీన్(3), ప్రవీణ్(ఏడాదిన్నర) పిల్లలు. మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి కవిత పొన్నేరిలోని పుట్టింటికి వెళ్లింది. దంపతుల మధ్య గొడవ పెరగడంతో గత నెల అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో వినోద్‌కు ఇద్దరు పిల్లల పర్యవేక్షణ భారమైంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఇంటి నుంచి వినోద్, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఇద్దరు మంచంపై మృతి చెంది ఉండడం, ఫ్యాన్‌కు వినోద్ వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కేనగర్ పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి, వినోద్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తేలింది. చదవండి: ఆన్లైన్ గేమ్: విద్యార్థి ఫ్యాన్‌కు.. -
పెషావర్‌లో పేలుడు: ఏడుగురు దుర్మరణం
పెషావర్ : పాకిస్తాన్‌లోని పెషావర్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ దారుణ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు పోల్పోయారు. ఒక శిక్షణా స్కూల్లో మంగళవారం శక్తివంతమైన పేలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. పెషావర్ శివార్లలోని ఇస్లామిక్ సెమినరీ ద్వారా శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించిందని అధికారుల తెలిపారు. జామియా జుబైరియా మదర్సా ప్రధాన హాలులో ఇస్లాం బోధనా ఉపన్యాసం ఇస్తుండగా ఈ బాంబు దాడి జరిగిందని పోలీసు అధికారి వకార్ అజీమ్ వెల్లడించారు. మదర్సా వద్ద ఎవరో ఒక బ్యాగ్ వదిలిపెట్టిన కొద్ది నిమిషాల తరువాత బాంబు పేలిందన్నారు. ఆత్మాహుతి దాడి కాదనిపోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. కాగా క్వెట్టాలో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించిన రెండు రోజుల తరువాత జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. -
రైలు బండే మృత్యువై..
అగనంపూడి (గాజువాక): ముక్కు పచ్చలారని ముద్దులొలికే చిన్నారులు.. ముద్దు మాటలతో అమ్మా నాన్నలను మురిపించే పసికూనలు... అప్పటి వరకు బుడి బుడి అడుగులు వేసుకుంటూ ఆటలాడుతున్నారు. అంతలోనే.. వారిని రైలుబండి మృత్యువై కబళించింది. రైలు శబ్దం విని సంబరపడిì పట్టాలెక్కిన ఆ చిన్నారులకు నిండు నూరేళ్లూ నిండిపోయాయి. పరవాడ పోలీస్టేషన్ పరిధి, తాడి రైల్వేస్టేషన్‌కు సమీపంలోని గొల్లపేటలో జరిగిన హృదయ విదారక సంఘటనకు సంబంధించి గ్రామస్తులు, చిన్నారుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న బంధం రామకృష్ణకు భార్య భవానీ, కుమార్తె హారిక (3) ఉన్నారు. భవానీ ప్రస్తుతం నిండు గర్భిణి. ప్రైవేటు కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్న అదే గ్రామానికి చెందిన బర్ల అప్పారావు, శివలక్ష్మి దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో జాహ్నవి (3)ని పెంచుకుంటున్నారు. రామకృష్ణ, అప్పారావులకు ఒక్కొక్కరే కుమార్తెలు కావడంతో పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ ఆనందాన్ని హరిస్తూ రైలు బండి రూపంలో మృత్యువు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. వేగానికి ఎగిరి పడిన చిన్నారులు గొల్లపేట గ్రామం రైల్వే ట్రాక్‌ను ఆనుకొని ఉంది. శుక్రవారం సాయంత్రం చిన్నారులిద్దరూ ఆడుకుంటూ పట్టాలపైకి వెళ్లిపోయారు. ఆ సమయంలో పిల్లల తల్లిదండ్రులు గానీ.. స్థానికులెవ్వరూ లేకపోవడం.. రైలు బండి శబ్ధం చేస్తూ రావడం జరిగిపోయాయి. పిల్లలకు ఏం జరుగుతుందో తెలిసే లోపే రైలుబండి రూపంలో మృత్యువు కబళించింది. రైలుబండి వేగానికి చిన్నారులిద్దరూ ఎగిరి 15 మీటర్ల దూరం ఎగిరి పడిపోవడంతో దుర్మరణం చెందారు. అప్పటి వరకు ఆడుకుంటూ కనపడిన పిల్లలు ఒక్కసారిగా మృత్యువాత పడడంతో గొల్లపేట దిగ్భ్రాంతికి గురైంది. చిన్నారుల తల్లిదండ్రులు భోరున విలపిస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. మృతదేహాలను గ్రామస్తులు సంఘటనా స్థలం నుంచి గ్రామంలోకి తీసుకువెళ్లిపోయారు. సంబంధిత అధికారులకు సమాచారం లేకుండా గ్రామస్తులు మృతదేహాలను అక్కడి నుంచి తీసుకువెళ్లి ఖననం చేశారు. -
కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!
ఫిలడెల్ఫియా(యూఎస్) : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వారి పాలిట కర్కశంగా వ్యవహరించింది. తన ఇద్దరు పిల్లల్ని తుపాకితో కాల్చిచంపింది. వివరాల్లోకి వెళితే.. టాకోనీలోని హెగెర్మాన్ స్ట్రీట్ 6300 బ్లాక్‌లో సోమవారం రాత్రి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. ఆ ఇంట్లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాంతో పాటు, 4 ఏళ్ల బాలిక, 10 నెలల శిశువు తీవ్రంగా గాయపడి ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. అలాగే ఘటన స్థలంలో తనకు తానే గాయపర్చుకున్న మహిళను(28) పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆ ఇంట్లో ఎందుకు కాల్పులు జరిగాయనేది తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వాళ్లను విచారించడంతోపాటు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్న పిల్లలు చనిపోవడం బాధకరమని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు. -
మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన తండ్రి
-
కుమారున్ని ఇటుకతో కొట్టి చంపిన తల్లి
సాక్షి, పెద్దపల్లి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్త మీద కోపంతో ఓ భార్య.. ఇద్దరు కొడుకులను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. వివరాలు. గోదావరిఖనిలోని సప్తగిరి కాలనీలో నివాసం ఉంటున్న రమాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు అజయ్, ఆర్యన్. భర్త ఎన్టీపీసీలో పని చేస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం రమాదేవి భర్త విధులకు వెళ్లాడు. భర్త మీద కోపంతో రమాదేవి.. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. దాంతో ఇటుకతో పిల్లలిద్దరిని విచక్షణారహితంగా కొట్టింది. ఈ సంఘటనలో పెద్ద కుమారుడు అజయ్(11) అక్కడిక్కడే మృతి చెందగా.. ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది రమాదేవి. ఈ లోపే స్థానికులు అక్కడికి చేరుకుని ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
స్వర్ణముఖినదిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
నాయుడుపేటటౌన్: స్వర్ణముఖినదిలో నీటి ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి.. ఇసుక కోసం తవ్విన భారీ గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నాయుడుపేట పట్టణంలోని మంగపతినాయుడునగర్, బేరిపేట, కుమ్మరివీధికి చెందిన మూడో తరగతి విద్యార్థిని తుమ్మూరు మల్లీశ్వరి(8), రెండో తరగతి చదువుతున్న కలపాటి విలియమ్ అగస్టస్ అలియాస్ జాకా (7)తోపాటు అదే ప్రాంతానికి చెందిన వారి స్నేహితులు మన్విత, దాదాఖలందర్ మరో బాలుడితో కలిసి స్వర్ణముఖినది వద్దకు వెళ్లారు. నదిలో కొద్దిమేరకు నీరు ప్రవహిస్తుండటంతో ఐదుగురు కలిసి నదిలో నడిచి కొద్దిదూరం వెళ్లారు. రెవెన్యూ కార్యాలయం సమీపంలో స్వర్ణముఖి నదిలో భారీగా ఇసుక తవ్వకాలు చేపట్టిన తర్వాత పెద్ద గుంత ఏర్పడి ఉండటంతో అందులో పడిపోయారు. వీరిలో ఇద్దరు పిల్లలు బయటపడి అక్కడి నుంచి పరుగులు పెట్టి వెళ్లిపోయారు. ముగ్గురు నీటి గుంతలో మునిగిపోతూ పెద్దఎత్తున కేకలు పెట్టారు. దీంతో సమీపంలో ఓ చోట కూర్చొని ఉన్న యువకులు గమనించి మన్విత అనే బాలికను కాపాడారు. మరో ఇద్దరు చిన్నారులు మల్లీశ్వరి (8), విలియమ్ అగస్టస్ (7)గుంతలో మునిగి మృతిచెందారు.అనుకోని విషాదాన్ని నింపిన ఈ సంఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈసమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలుడు: చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేట్‌లోని కుమ్మరివాడీ బస్తీలో మంగళవారం ఉదయం గ్యాస్ సిలిండర్ పేలి బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్తీకి చెందిన ముంతాజ్ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ముంతాజ్‌తోపాటు పర్వేజ్, అఫ్రోజ్ అనే బాలురు గాయపడ్డారు. కుటుంబీకులు వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పర్వేజ్ చనిపోగా మిగతా ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
వంగూరు : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కోనేటిపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను డిండి నుంచి కల్వకుర్తి వైపు వస్తోన్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోట చేసుకుంది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'
ఐక్యరాజ్యసమితి : యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో మొత్తం 900 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 1300 మందికిపైగా చిన్నారులు మరణించారు. ఈ మేరకు యూనిసెఫ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ మొత్తం 2015 మార్చి నాటి నుంచి ఇప్పటి వరకు మరణించిన చిన్నారుల సంఖ్య అని స్పష్టం చేసింది. యెమెన్‌లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై 1,560 ఘటనలు చోటు చేసుకున్నాయని తమ సంస్థ పరిశీలనలో వెల్లడి అయిందని తెలిపింది. 2015, మార్చి నాటి నుంచి ప్రతి రోజు కనీసం ఆరుగురు చిన్నారులు మృతి చెందారని నివేదికలో పేర్కొంది. దేశంలోని తైజ్ సనా, సాద, అడెన్, హజ్హ్ గవర్నరేట్ల పరిధిలో అధిక మరణాలు చోటు చేసుకున్నట్లు వివరించింది. యెమెన్‌లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు వర్గానికి, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే. అయితే 2015 మార్చి నాటి నుంచి యెమెన్‌లో భద్రత క్షీణించిందని తెలిపింది. ఈ ఘర్షణల వల్ల 21.2 మిలియన్ల మంది ప్రజలు బాధితులుగా మారారని యూనిసెఫ్ చెప్పింది. సాధ్యమైనంత త్వరగా దేశంలో మానవతా సహాయం అవసరమని యూనిసెఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. -
చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
సూర్యాపేట మండలం పాచ్యానాయక్ తండా సమీపంలోని చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మృతులు బుగులోత్ సిద్ధూ(7), బానోత్ ఆనంద్(7)లు ఆవాసం భోజ్యాతండాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగిందనే తెలియరాలేదు. పిల్లల్ని కుంట నుంచి తీసేందుకు గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు. -
యెమెన్‌లో 279 మంది చిన్నారుల మృతి
యూనైటెడ్ నేషన్స్ : యెమెన్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో 279 మంది చిన్నారులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ (యూనిసెఫ్) బుధవారం వెల్లడించింది. మరో 402 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. గడిచిన 10 వారాల కాలవ్యవధిలో వీరంతా మృతి చెందారని పేర్కొంది. అయితే గతేడాది దేశంలో జరిగిన ఘర్షణల్లో 74 మంది చిన్నారులు మరణించగా... మరో 244 మంది గాయపడ్డారని వివరించింది. యెమెన్‌లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు అబెడ్రాబోహాదీ, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే. -
బంధం తెగుతోంది!
కనిపించని దైవానికి నిజరూపం కనీపెంచిన తల్లి అని నమ్ముతున్నాం. నమ్మకానికి ప్రతిరూపంనాన్నేనని కథలు కథలుగా చెప్పుకుంటున్నాం. అయితే.. క్షణికావేశం పేగు‘బంధం’తెంచేస్తోంది. నమ్మకాన్ని వమ్ము చేస్తోంది. ఫలితంగా మాతృత్వం మరుగునపడుతోంది.పితృత్వం లోకాన్ని విస్మయపరుస్తోంది. మానవత్వాన్ని మంటగలుపుతోంది. - క్షణికావేశం...చిన్నారుల పాలిట శాపం - విచక్షణారహితంగా వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు - గాల్లో కలుస్తున్న పసిప్రాణాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: అప్పులు ఎక్కువయ్యాయి. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. అతనికి పిరికితనం ఆవహించింది. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమార్తెలకు శీతల పానీయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి, తాను తాగాడు. ఈ సంఘటన ఆదివారం పుత్తూరులో చోటు చేసుకున్న విషయం విధితమే. ఇందులో తండ్రి రమేష్‌తోపాటు, కుమార్తెలు శ్రుతి(8), షణ్ముఖ ప్రియ(6)చనిపోయారు. తన పిల్లపై ఉన్న మమకారమో ఏమోగానీ, తాను చనిపోతే తన పిల్లలకు ఎవరు దిక్కని ఆలోచించడం వరకు సబబే. అయితే ఆ చిన్నారులను పొట్టబెట్టుకునే హక్కు ఎవరిచ్చారనేది అందరినీ వేధించే ప్రశ్న. కన్నతల్లికి ఆ బిడ్డలను దూరం చేసి, క్షోభ మిగల్చడం తగునా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆత్మహత్య చేసుకునే ముందు ఆ తండ్రి ఒక్క క్షణం ఇవన్నీ ఆలోచించి ఉంటే ఇంత దారుణానికి ఒడికట్టే వాడు కాదని అక్కడ గ్రామస్తులు చర్చించుకున్నారు. ఇలాంటి దారుణాలకు ఒడికట్టకుండా ఉండాలని మేధావులు సైతం ధైర్యం నూరి పోస్తున్నారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం విద్యానగర్‌లో ఎనిమిది నెలల బిడ్డ ఏడుపు ఆపలేదని ఓ తల్లి ఒక్క క్షణం విచక్షణ కోల్పోయింది. చిన్నారని చెంప చెళ్లుమనిపించింది. దీంతో చెవి, నోటిలో నుంచి రక్తం కారి ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆ తల్లి బాధతో కన్నీరు మున్నీరైంది. ఫలితం దిద్దుకోలేని తప్పు జరిగిపోయింది. -
గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారుల మృత్యువాత
నాచారం, న్యూస్‌లైన్: భారీ భవన నిర్మాణం కోసం తవ్విన పెద్ద గుంత.. అందులో పిల్లర్ల కోసం మరింత లోతైన గుంతలు.. వర్షాలకు నిండుగా చేరిన నీళ్లు.. అందులో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారారని తెలిసితల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. శుక్రవారం నాచారంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన వివరాలు ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. నాచారం విలేజ్‌కు చెందిన కందికంటి పాపయ్య కుమారుడు రాముడు (13) నాచారం ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. నాచారం వీఎస్టీ కాలనీకి చెందిన మచ్చ ఐలయ్య కుమారుడు శ్రావణ్ అలియాస్ బన్ని (9) తార్నాకలోని సెయింట్ డామిక్స్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. అదే కాలనీకి చెందిన మన్నె శంకర్ కుమారుడు రాజు (10) నాచారం ఇందిరా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సాయి (10), నాచారం ఎర్రకుంటకు చెందిన హనుమంతు కుమారుడు బాలరాజు (11) లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వీరంతా స్నేహితులు. శుక్రవారం మధ్యాహ్నం తమ తమ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలు రాసిన అనంతరం ఒకచోట కలుసుకున్నారు. నాచారం రాఘవేంద్రనగర్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన భారీ గుంత వద్దకు ఈత కొట్టేందుకని వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్లు చేరి గుంత నిండుగా ఉంది. సాయి తప్ప మి గతా వారంతా ఒక్కొక్కరుగా నీళ్లలోకి దిగారు. పోటీపడుతూ మధ్యలోకంటూ వెళ్లారు. అక్కడ పిల్లర్ల కోసం మరింత లోతుగా తవ్విన గుంత లో రాముడు, శ్రావణ్, రాజు, బాలరాజు చిక్కుకుని మునిగిపోయారు. సాయం కోసం కేకలు వేశారు. దాంతో ఒడ్డునున్న సాయి భయంతో పారిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడు విజయ్ పిల్లల కేకలు విని వెంటనే గుంతలోకి దిగాడు. అప్పటికే బాలరాజు నీట మునిగి మృతి చెందాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ముగ్గురితో పాటు బాలరాజు మృతదేహాన్ని విజయ్ బయటకు తెచ్చాడు. పరిస్థితి విషమంగా ఉన్న శ్రావణ్, రాముడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజు ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ రాధాకిషన్‌రావు, కార్పొరేటర్ నెమలి సురేష్ సంఘటన స్థలానికి వచ్చారు. బిల్డర్ల నిర్లక్ష్యం.. కేసు నమోదు నాచారం రాఘవేంద్రానగర్లోని పరుశరాం యాదవ్‌కు చెందిన సర్వేనంబర్ 153, 154లోని ఎకరన్నరం స్థలంలో బిల్ట ర్లు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి బహుళ అంతస్తుల కోసం పెద్ద గుంతను తీసి వదిలేశారు. దీనికి జీహెచ్ఎంసీ అనుమతుల్లేవని సమాచారం. గుంత చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడమే ప్రమాదానికి కారణమైందనే కోణంలో కేసు నమోదు చేస్తున్నట్లు నాచారం సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.