లక్నో: యూపీలోని లక్నోలో ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని అతని ముగ్గురు పిల్లల మీద చూపిస్తూ వారిని కారుతో గుద్ది చంపే ప్రయత్నం చేశాడు ఓ మూర్ఖుడు. అదృష్టవశాత్తు ఆ పిల్లలకు ఎటువంటి హానీ జరగలేదు. వెంటనే అక్కడున్నవారు అప్రమత్తమై పిల్లల్ను ఆసుపత్రికి తరలించగా ప్రమాదమేమీ లేదని చిన్న చిన్న గాయాలు మాత్రం తగిలాయని తెలిపారు వైద్యులు.
మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్.
జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా సేకరించారు పోలీసులు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇది కూడా చదవండి: బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
Comments
Please login to add a commentAdd a comment