
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం భార్య ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లల పర్యవేక్షణ భారమై ఓ తండ్రి చెన్నైలో శనివారం కిరాతకానికి పాల్పడ్డాడు. ముక్కు పచ్చలారని ఇద్దరు పిల్లల్ని హతమార్చి తాను కూడా బలన్మరణానికి పాల్పడ్డాడు. చెన్నై కొరుక్కుపేట జీవానగరం ఆరవ వీధికి చెందిన వినోద్(32) ఎలక్ట్రీషియన్. ఇతడికి భార్య కవిత(27), కుమారులు నవీన్(3), ప్రవీణ్(ఏడాదిన్నర) పిల్లలు. మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి కవిత పొన్నేరిలోని పుట్టింటికి వెళ్లింది. దంపతుల మధ్య గొడవ పెరగడంతో గత నెల అక్కడే ఆత్మహత్యకు పాల్పడింది.
దీంతో వినోద్‌కు ఇద్దరు పిల్లల పర్యవేక్షణ భారమైంది. ఈ పరిస్థితుల్లో శనివారం ఇంటి నుంచి వినోద్, పిల్లలు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు తలుపులు బద్దలు కొట్టిలోనికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఇద్దరు మంచంపై మృతి చెంది ఉండడం, ఫ్యాన్‌కు వినోద్ వేలాడుతుండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కేనగర్ పోలీసులు మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి, వినోద్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తేలింది.
Comments
Please login to add a commentAdd a comment