'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి' | 900 children killed in Yemen conflict in 2015: UN | Sakshi
Sakshi News home page

'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'

Published Wed, Mar 30 2016 10:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:53 PM

'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'

'10 నెలల్లో 900 మంది చిన్నారులు మృతి'

ఐక్యరాజ్యసమితి : యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో మొత్తం 900 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో 1300 మందికిపైగా చిన్నారులు మరణించారు. ఈ మేరకు యూనిసెఫ్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ మొత్తం 2015 మార్చి నాటి నుంచి ఇప్పటి వరకు మరణించిన చిన్నారుల సంఖ్య అని స్పష్టం చేసింది. యెమెన్లో నిబంధనలకు విరుద్ధంగా చిన్నారులపై 1,560 ఘటనలు చోటు చేసుకున్నాయని తమ సంస్థ పరిశీలనలో వెల్లడి అయిందని తెలిపింది.

2015, మార్చి నాటి నుంచి ప్రతి రోజు కనీసం ఆరుగురు చిన్నారులు మృతి చెందారని నివేదికలో పేర్కొంది. దేశంలోని తైజ్ సనా, సాద, అడెన్, హజ్హ్ గవర్నరేట్ల పరిధిలో అధిక మరణాలు చోటు చేసుకున్నట్లు వివరించింది.

యెమెన్లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు వర్గానికి, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గానికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఆ దేశంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే.

అయితే 2015 మార్చి నాటి నుంచి యెమెన్లో భద్రత క్షీణించిందని తెలిపింది. ఈ ఘర్షణల వల్ల 21.2 మిలియన్ల మంది ప్రజలు బాధితులుగా మారారని యూనిసెఫ్ చెప్పింది. సాధ్యమైనంత త్వరగా  దేశంలో మానవతా సహాయం అవసరమని యూనిసెఫ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement