యెమెన్లో 279 మంది చిన్నారుల మృతి
యూనైటెడ్ నేషన్స్ : యెమెన్లో జరుగుతున్న అంతర్యుద్ధం, ఘర్షణల్లో 279 మంది చిన్నారులు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి సంస్థ (యూనిసెఫ్) బుధవారం వెల్లడించింది. మరో 402 మంది చిన్నారులు గాయపడ్డారని తెలిపింది. గడిచిన 10 వారాల కాలవ్యవధిలో వీరంతా మృతి చెందారని పేర్కొంది.
అయితే గతేడాది దేశంలో జరిగిన ఘర్షణల్లో 74 మంది చిన్నారులు మరణించగా... మరో 244 మంది గాయపడ్డారని వివరించింది. యెమెన్లో 2011 నాటి నుంచి అస్థిరత్వం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత దేశాధ్యక్షుడు అబెడ్రాబోహాదీ, హూతీ షియా మిలిషియాలకు విధేయులుగా ఉన్న వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నేపథ్యంలో ఘర్షణలు జరుగుతున్న విషయం విదితమే.