సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కుచ్చుటోపీ..! | Bengaluru man pays 60 grand for three Apple gadgets, gets a brick instead | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కుచ్చుటోపీ..!

Published Fri, Feb 12 2016 9:55 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

మోసగాళ్లు అంటగట్టిన ఇంటుకను చూపెడుతున్న వెంకటనారాయణ - Sakshi

మోసగాళ్లు అంటగట్టిన ఇంటుకను చూపెడుతున్న వెంకటనారాయణ

ఖరీదైన వస్తువులు అతి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశే మరి! సరిగ్గా అలాంటి ఆశే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిండా ముంచేసింది. రూ.60 వేలకు రెండు యాపిల్ ఐఫోన్లతోపాటు మ్యాక్ బుక్ కూడ ఇస్తామంటే 'మంచి బేరమేకదా' అనుకున్నాడు. తీరా డబ్బులు చెల్లించాకగానీ తాను మోసపోయానని తెలుసుకోలేకపోయాడు.

బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెంకటనారాయణను అడ్రస్ అడిగే నెపంతో ఇద్దరు వ్యక్తులు కలిశారు. మాటల మధ్యలో బ్యాగ్ లోని యాపిల్ ప్రొడక్ట్స్ చూపించి కొనమని అడిగారు. పైగా వాటిని అరవై శాతం డిస్కౌంట్ కు ఇస్తామన్నారు. వెంకటనాయరాయణను నమ్మించేందుకు ఆ వస్తువుల బిల్లులను కూడ చూపించారు. అంతఖరీదైన వస్తువులు తక్కువ ధరకు వస్తుండటంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అప్పటికప్పుడే ఏటీఎంనుంచి డబ్బు డ్రాచేసి మరీ ఇచ్చి వాటిని సొంతం చేసుకున్నాడు.

మోసగాళ్ల నుంచి బ్యాగ్ తీసుకున్న కాసేపటితర్వాత తెరచిచూస్తే అందులో ఉన్నది ఒట్టి ఇటుక మాత్రమేనని గ్రహించిన ఇంజనీర్.. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తాను మోసపోయినందుకు ఎంతో సిగ్పడుతున్నానని, అయితే, తనలా మరెవరూ మోసపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే  పోలీసులకు ఫిర్యాదు చేశానని నారాయణ చెప్తున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ను బట్టి దుండగుల ఆచూకీ తెలిసే అవకాశం ఉండొచ్చని పోలీసులు భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement