Instead
-
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
మద్యం బదులు శానిటైజర్ల తయారీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి ప్రైవేటు సంస్థలు ముం దుకొచ్చాయి. ఇన్నాళ్లు ప్రజలకు కిక్కిచ్చే మద్యాన్ని తయారు చేసిన డిస్టిలరీలు ఇప్పుడు కరోనా ముప్పు దరి చేరకుండా ‘సామాజిక బాధ్యత’ను పాటిస్తున్నాయి. మద్యం బదులు శానిటైజర్లను తయా రు చేసి ప్రభుత్వానికి చేయూత అందిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వీటి లభ్యత అంతంతగానే ఉంది. ఈ కొరతను అధిగమిం చేందుకు ప్రభుత్వం డిస్టిలరీలను శానిటైజర్ల ఉత్పత్తుల తయారీకి మళ్లించింది. హ్యాండ్ వాష్ శానిటైజర్ల తయారీకి డిస్టిలరీల సేవల ను వాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌తో ప్ర స్తుతం మద్యం ఉత్పత్తులను నిలిపివేసినందున.. దీని స్థానంలో శానిటైజర్లను తయారు చేసేలా చూడాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర ప్రభుత్వం.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) కింద శానిటైజర్లను తయారు చేయాలని డిస్టిలరీల యాజమాన్యాలను కోరింది. సానుకూలంగా స్పందించిన మద్యం తయారీ సంస్థలు ఇప్పటివరకు 40 వేల లీటర్ల మేర రాష్ట్ర వైద్య సదుపాయాల కల్పనాభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఐడీసీ)కు సరఫరా చేసింది. వీటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేస్తోంది. కరోనా నివారణ దళానికే ప్రాధాన్యం.. సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోని 18 డిస్టిలరీలు శానిటైజర్లను త యారు చేసి టీఎస్ఎంఐడీసీకి అందజేశాయి. అక్కడి నుంచి ప్రభు త్వ ఆస్పత్రులు, కార్యాలయాలు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు పంపిణీ చేసినట్లు సంగారెడ్డిలోని ఓ డిస్టిలరీ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. మొదటి దశలో ఇచ్చిన ఇండెంట్ మేరకు సరఫరా చేశామని, ప్రభుత్వం ఆదేశిస్తే అధిక సామర్థ్యంలోనూ శానిటైజర్లను తయారీ చేసి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శానిటైజర్ తయారీ ఇలా.. పది లీటర్ల శానిటైజర్ తయారీలో.. 8,333 మిల్లీ లీటర్ల ఇథనాల్, 417 మి.లీటర్ల హైడ్రోజెన్ పెరాక్సైడ్, 145 మి.లీటర్ల గ్లిజరాల్, 1,105 మి.లీటర్ల డిస్టిల్ వాటర్‌ను వాడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శానిటైజర్లో మిశ్రమాలను కలుపుతున్నారు. -
డ్రైవర్‌కు బదులు క్లీనర్..
అతివేగంతో వాహనం నడిపిన క్లీనర్ మతిస్థిమితం లేని వ్యక్తి మృతి మరో లారీ దగ్ధం తప్పిన పెను ప్రమాదం పెనుబల్లి: డ్రైవర్‌కు బదులుగా క్లీనర్ ట్యాంకర్ వాహనం అతివేగంగా నడపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో లారీ దగ్ధమైన సంఘటన శుక్రవారం అర్థరాత్రి పెనుబల్లి మండల పరిధిలోని టేకులపల్లి వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... వైజాగ్ నుంచి పెట్రోల్, డీజిల్‌తో కూడిన ట్యాంకర్ వాహనం నిజామాబాద్ వెళుతూ మార్గమధ్యలో పెను ప్రమాదానికి కారణమైంది. ట్యాంకర్ డ్రైవర్ వంగా హరిచందర్రావు నిద్రపోతుండగా క్లీనర్ బత్తిని కృష్ణ వాహనాన్ని నడపడం ప్రారంభించాడు. మండల పరిధిలోని టేకులపల్లి రిత్విక్ పవర్‌ప్లాంట్ నుంచి మోడల్ స్కూల్ మధ్యలో రోడ్డుపై మతిస్థిమితం లేని వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ మతిస్థిమితం లేని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యక్తి మృతి చెందిన కంగారులో ట్యాంకర్‌ను ఎవరికి దొరకకుండా ఉండేందుకు క్లీనర్ మరింత వేగం పెంచాడు. కొద్ది దూరం వెళ్లేలోపలే రాజస్థాన్ హోటల్ సమీపంలో ఎదురుగా రేకుల లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగి లారీ దగ్ధమైంది. అయితే ప్రమాదానికి కారణమైన పెట్రోల్ ట్యాంకర్ పది మీటర్లలోపే ఉంది. ఒక వేళ మంటలు ట్యాంకర్‌కు ఎగబాకితే పెనుప్రమాదం జరిగేదని స్థానికులు వాపోతున్నారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి రూరల్ సీఐ మడతా రమేష్, ఎస్సై గజ్జల నరేష్, కల్లూరు ఎస్సై బి. పవన్‌కుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్‌కు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఖమ్మం-సత్తుపల్లి ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ వర్దపోగు గోవిందరావు లారీ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో పోలీసులు రక్షించి పెనుబల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని వ్యక్తి మృతదేహాన్ని పెనుబల్లి మార్చురీకి తరలించారు. ఈ మేరకు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ క్లీనర్ బత్తిని కృష్ణ, డ్రైవర్ వంగా హరిచందర్రావులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గజ్జల నరేష్ తెలిపారు. శనివారం ఉదయం రోడ్డుపై ఉన్న లారీ, ట్యాంకర్లను జేసీబీ సహాయంతో పక్కకు తొలగించారు. ఫొటో నెంబర్-24ఎస్పిఎల్86: -
ఎంపీడీవోలకు బదులు ఓఎస్డీలు
• కొత్త మండలాల్లో నియమించనున్న సర్కారు • జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడే మండలాల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవోల)కు బదులుగా.. ప్రత్యేక అభివృద్ధి అధికారుల (ఓఎస్డీ)ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త మండలాల్లో ప్రస్తుతం మండల పరిషత్‌లు లేనందున వారిని ఓఎస్డీ (డెవలప్మెంట్)లుగా నియమించి, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనుంది. ఇందుకు అవసరమైన అధికారులను గుర్తించి ప్రతిపాదనలు రూపొందిం చాలని పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించింది. ఇక కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను అన్ని శాఖల అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి ఆర్థిక శాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై శుక్రవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్నద్ధంగా ఉండండి కొత్తగా ఏర్పడే మండలాలు, డివిజన్లన్నింటిలో అక్టోబర్ 11న దసరా నుంచే కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లను రాజీవ్‌శర్మ ఆదేశించారు. ముఖ్యం గా తొలి రోజున అన్ని మండలాల్లో రెవెన్యూ, వ్యవసాయం, విద్య, పోలీస్, పంచాయతీరాజ్ శాఖలు కొలువు దీరుతాయి. దీంతో ఈ ఐదు శాఖలు వెంటనే తమ సిబ్బంది ప్రతిపాదనలు రూపొందించాలని, ముందుగానే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త జిల్లాల్లో ప్రాధాన్యతలకునుగుణంగా అక్కడి ప్రజలకు మెరుగైన సేవలందించే ఏ ర్పాట్లు చేయాల స్పష్టం చేశారు. కొత్త జిల్లాల్లో ఉన్న ప్రత్యేకతలు, భౌగోళిక, సామాజిక పరిస్థితులను బట్టి ఆయా శాఖలకు సరిపడే సిబ్బంది నియామకం జరగాలన్నారు. అన్ని వివరాలతో.. ప్రతి శాఖ పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సిబ్బంది వివరాలు, సిబ్బంది నమూనా, కార్యాలయాల గుర్తింపు, వాహనాల వివరాలు, ఉద్యోగుల సర్దుబాటు తదితర వివరాలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. కొత్తగా అవసరమయ్యే పోస్టుల వివరాలను పంపడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల జాబితాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతమున్న ఉద్యోగుల వివరాలు, సిబ్బంది ప్రతిపాదనలను స్పష్టంగా అప్లోడ్ చేయాలని.. ఉద్యోగుల ఆధార్ నంబర్లను సైతం అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఆధార్ కార్డు లేని ఉద్యోగులు కొత్తగా కార్డు తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రదీప్ చంద్ర, రంజీవ్ ఆర్ ఆచార్య, ఎస్కే జోషి, ముఖ్య కార్యదర్శులు బి.పి.ఆచార్య, రామకృష్ణారావు, సోమేష్‌కుమార్, అదర్ సిన్హా, సునీల్‌శర్మ, రాజీవ్ త్రివేదీ, సీఎంవో అధికారులు శాంతికుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కుచ్చుటోపీ..!
ఖరీదైన వస్తువులు అతి తక్కువ ధరకు వస్తున్నాయంటే ఎవరికైనా ఆశే మరి! సరిగ్గా అలాంటి ఆశే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నిండా ముంచేసింది. రూ.60 వేలకు రెండు యాపిల్ ఐఫోన్లతోపాటు మ్యాక్ బుక్ కూడ ఇస్తామంటే 'మంచి బేరమేకదా' అనుకున్నాడు. తీరా డబ్బులు చెల్లించాకగానీ తాను మోసపోయానని తెలుసుకోలేకపోయాడు. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వెంకటనారాయణను అడ్రస్ అడిగే నెపంతో ఇద్దరు వ్యక్తులు కలిశారు. మాటల మధ్యలో బ్యాగ్ లోని యాపిల్ ప్రొడక్ట్స్ చూపించి కొనమని అడిగారు. పైగా వాటిని అరవై శాతం డిస్కౌంట్ కు ఇస్తామన్నారు. వెంకటనాయరాయణను నమ్మించేందుకు ఆ వస్తువుల బిల్లులను కూడ చూపించారు. అంతఖరీదైన వస్తువులు తక్కువ ధరకు వస్తుండటంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అప్పటికప్పుడే ఏటీఎంనుంచి డబ్బు డ్రాచేసి మరీ ఇచ్చి వాటిని సొంతం చేసుకున్నాడు. మోసగాళ్ల నుంచి బ్యాగ్ తీసుకున్న కాసేపటితర్వాత తెరచిచూస్తే అందులో ఉన్నది ఒట్టి ఇటుక మాత్రమేనని గ్రహించిన ఇంజనీర్.. పోలీసులకు ఫిర్యాదుచేశాడు. తాను మోసపోయినందుకు ఎంతో సిగ్పడుతున్నానని, అయితే, తనలా మరెవరూ మోసపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని నారాయణ చెప్తున్నాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ను బట్టి దుండగుల ఆచూకీ తెలిసే అవకాశం ఉండొచ్చని పోలీసులు భరోసా ఇచ్చారు. -
హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంతో ఆర్డీఓ సభావట్ మోతీలాల్ స్థలాన్ని పరిశీలించారు. తాడ్వాయి తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం పడిగాపూర్ పరిసరాల్లోని కొంగలమడుగు వద్ద గతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించారు. గద్దెల సమీపంలోని పోలీస్ క్యాంపు వద్ద ప్రభుత్వ హెలికాప్టర్ దిగేందుకు వీలుగా హెలిప్యాడ్ ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రభుత్వం వినియోగిస్తోంది. 2010లో టర్బో ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ సౌకర్యాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిం ది. మళ్లీ ఈ జాతరలో టర్బో ఏవియేషన్ సం స్థ మరోసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వరంగల్‌లోని మామునూరు నుంచి మేడారానికి స ర్వీసులు నడిపారు. కానీ ఈసారి సంస్థ మా మునూరుతో పాటు ములుగు నుంచి కూ డా సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అంతేకాక హెలికాప్టర్‌ను అద్దెకు కూడా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. పడిగాపూర్ ప రిధిలోని 44వ సర్వే నంబర్లో ఉన్న రైతులతో ఆర్డీఓ, తహసీల్దార్ మాట్లాడారు. గతంలో హె లిప్యాడ్ తీసుకున్న వారు తమను ఇబ్బందుల కు గురిచేశారని రైతులు అధికారులకు వివరిం చారు. తిన్న అన్నానికి కూడా వారు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. దీంతో ఆర్డీఓ మో తీలాల్ మాట్లాడుతూ ముందుగానే అద్దె డ బ్బులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి మన జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యాన్ని అందించే వారికి సహకరించాల్సిన అవసరం ఉంద న్నారు.