Bengaluru Group Smashes Man's Head With Stones, CCTV Recorded Video Goes Viral - Sakshi
Sakshi News home page

Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు

Published Tue, Dec 6 2022 1:22 PM | Last Updated on Tue, Dec 6 2022 1:45 PM

Bengaluru Group Smashes Mans Head With Stones Record On CCTV - Sakshi

బెంగళూరులో అర్థరాత్రి జరిగిన దారుణ హత్య పెద్ద కలకలం సృష్టించింది. ఒక వ్యక్తిపై కొంతమంది వ్యక్తుల గుంపు పెద్ద ఇటుక రాయితో దాడిచేసి తలపగల కొట్టి చంపేశారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బెంగళూరులోని కెపీ అగ్రహార ప్రాంతంలోని ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళల గుంపు ఒక చోట కూర్చొని ఉన్న వ్యక్తి వద్దకు సముహంగా వచ్చారు. కాసేపు అతనితో వాగ్వాదానికి దిగి అతడిపై దాడి చేశారు.

ఇంతలో ఒక మహిళ ఒక రాయిని తీసుకువచ్చి అతడి తలపగలు కొట్టింది. మరోవైపు కొంతమంది భాదితుడిని కదలకుండ పట్టుకుని ఉండగా... ఒక వ్యక్తి రాయితో అదేపనిగా కొడుతూనే ఉన్నాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఐతే బాధితుడి కేకలు విని చుట్టుపక్కల వాళ్లు వచ్చి అతన్ని ఆస్పత్రికి తరలించి...పోలీసులకు సమాచారం అందించారు. కానీ సదరు వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బాదామి ప్రాంతానికి చెందినవాడని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసుల కేసు నమోదు చేసుకుని నిందితులు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: వ్యక్తిని హత్య చేసి..తెగిపడిన తలతో సెల్ఫీలు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement