ghazibad
-
కర్కశత్వం: పార్కింగ్ వివాదం...ఇటుకతో కొట్టి చంపేశాడు
న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్లు ఓపెన్ చేయడం కుదరదు. దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్‌తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు) -
21 ఏళ్ల యువతికి ఆరో తరగతి బాలుడి వేధింపులు
లక్నో: పిదప కాలం.. పిదప బుద్ధులు అంటే ఇవే. ఆరో తరగతి చదివే పిల్లాడు.. 21 ఏళ్ల యువతిని లైంగికంగా వేధిస్తున్నాడంటే.. ఏమనుకోవాలి. యువతి మార్ఫ్డ్ చిత్రాలను ఉపయోగించి డబ్బులు ఇవ్వు.. లేదంటే సెక్స్ చాట్ చేయాలంటూ వేధింపులుకు గురి చేస్తున్నాడో పిల్లాడు. ఆ వివరాలు.. ఘజియాబాధ్‌కు చెందిన బాధిత యువతి, సదరు పిల్లాడు విద్యార్థులు క్రియేట్ చేసిన ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో మెంబర్లు. ఈ గ్రూప్‌లో అన్ని వయసులు విద్యార్థులు ఉంటారు. జూనియర్లకు, సీనియర్ విద్యార్థులు అనుమానాలు నివృత్తి చేస్తూ.. బాగా చదువుకునేందుకు సాయం చేస్తూంటారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ పూర్తి చేసి.. ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యింది. 6వ తరగతి చదువుతున్న పిల్లాడు కూడా ఈ గ్రూప్‌లో మెంబర్.(ఆ వీడియోల కోసం యాహూ మాజీ ఉద్యోగి నిర్వాకం) అలా ఇద్దరికి పరిచయం. తొలుత పిల్లాడు, బాధిత యువతితో చదువుకు సంబంధించిన విషయాలు చర్చించేవాడు. అలా కొద్ది రోజుల పాటు చదువు గురించి మాట్లాడి మంచి వాడిగా నమ్మకం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న ఉదయం 3.30గంటలకు సదరు పిల్లాడు, యువతి మొబైల్‌కు ఆమె మార్ఫ్డ్ చిత్రాలు పంపించాడు. ఇవి చూసి సదరు యువతి ఒక్కసారిగా బిక్క చచ్చిపోయింది. అంత చిన్న పిల్లాడు ఇలాంటి పాడు పనులు చేస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. ఈ మెసేజ్ గురించి ఆలోచిస్తుండగానే ఆ పిల్లాడు ఫోన్ చేసి.. ఆమె సోషల్ మీడియా అకౌంట్నుంచి ఫోటోలను తీసుకున్నాని.. తాను అడిగినంత డబ్బైనా ఇవ్వాలి.. లేదా తనతో సెక్స్ చాట్ చేయాలన్నాడు. లేదంటే యువతి మార్ఫ్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. అంతేకాక ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశానని చెప్పాడు. దాంతో భయపడిన యువతి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుంది. అనంతరం ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లిదండ్రులు సదరు పిల్లాడిని పిలిపించి మాట్లాడారు. కానీ వాడిలో మార్పు రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.(ఆ హీరోయిన్‌కు సైబర్ షాక్) పిల్లాడిని, అతడి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించగా.. మెసేజ్‌ల గురించి తనకు ఏం తెలియదని.. తన ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేశారని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు సోషల్ మీడియా కంపెనీతో మాట్లాడి యువతి, పిల్లాడి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని పంపాల్సిందిగా కోరారు. సైబర్ టీం ఐపీ అడ్రెస్‌ను ట్రేస్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో పోలీసులు చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవద్దని.. ఇచ్చినా వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు. -
కాలేజీకి వెళ్లి గొంతుకోశాడు
ఘజియాబాద్: ఉత్తర ప్రదేశ్లోదారుణం చోటుచేసుకుంది. పీజీ చదువుతున్న విద్యార్థి ఓ విద్యార్థిని గొంతుకోశాడు. అనంతరం తాను విషం తీసుకున్నాడు. యూపీలోని ఘజియాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఘజియాబాద్‌లోని శంబు దయాల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు చెప్పిన ప్రకారం దాడికి పాల్పడిన వ్యక్తికి బాధితురాలికి మధ్య కొద్ది రోజులుగా అన్యోన్య సంబంధం ఉంది. అయితే, మంగళవారం కాలేజీకి వచ్చిన ప్రశాంత్ అనే పీజీ విద్యార్థి ఆ కాలేజీలో బీఏ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని గొంతుకోసి తాను విషం తాగాడు. దీంతో బాధితురాలు కేకలు పెట్టగా మిగితా విద్యార్థులు అక్కడి చేరుకొని ప్రశాంత్ ను చితక్కొట్టారు. ఇద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలికి శస్త్ర చికిత్స చేయడంతో ప్రమాదం తప్పింది. దాడికి పాల్పడిన ప్రశాంత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.