![22 వరకు నుమాయిష్](/styles/webp/s3/article_images/2017/09/2/61423852523_625x300.jpg.webp?itok=4r-dALdJ)
22 వరకు నుమాయిష్
వారం రోజులు గడువు పొడిగింపు
అబిడ్స్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో కొనసాగుతున్న 75వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయుష్)కు వెళ్లలేకపోయామని నిరాశ చెందుతున్న వారికి శుభవార్త. ఎగ్జిబిషన్ గడువును మరో వారం రోజులు పొడిగిస్తూ సంబంధిత సొసైటీ నిర్ణయం తీసుకుంది. జనవరి 1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఈ నెల 15 (ఆదివారం)తో ముగించాల్సి ఉంది. ఇటీవల స్వైన్‌ఫ్లూ వ్యాధి కారణంగా సందర్శకుల సంఖ్య తగ్గడంతో స్టాల్స్ నిర్వాహకులు ఎగ్జిబిషన్‌ను పొడిగించాలని సొసైటీకి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు.
దీంతో శుక్రవారం రాత్రి సమావేశమైన ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ వారం రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ గౌరవ కార్యద ర్శి పి.నరోత్తం రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్, కోశాధికారి అనిల్‌స్వరూప్ మిశ్రా వెల్లడించారు. ఈనెల 22వ తేదీన ఎగ్జిబిషన్ ముగియనుందని వారు ప్రకటించారు.