
‘చేప ప్రసాదం’ ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
అబిడ్స్, న్యూస్‌లైన్: ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈనెల 8,9 తేదీల్లో బత్తిని సోదరులు నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా, ఇతర అధికారులు పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం డీఆర్‌వో అశోక్‌కుమార్, ఆర్డీవో నవ్య, డీసీపీ కమలాసన్‌రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు అశ్వినీమార్గం, సుఖేష్‌రెడ్డిలతో తొలుత సమావేశమయ్యారు. అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నలుమూలల సందర్శించారు.
గత నెలలో ఎగ్జిబిషన్‌లోని కళాశాలలో ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున సర్కస్ మే 16వ తేదీన ప్రారంభమైందని జూన్ 16న ముగింపు ఉండడంతో సర్కస్‌కు అవకాశం ఇవ్వాలని సొసైటీ ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 4న చీఫ్ సెక్రటరీతో చేప ప్రసాదంపై సమావేశమైన తర్వాత తుది వివరాలు ప్రకటిస్తామన్నారు. ఆయన వెంట ఏసీపీ జైపాల్, ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ తదితరులున్నారు.