హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి తెలంగాణ ఉద్యోగి రోజూ 2 గంటలు అదనంగా పనిచేస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయనిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు కాలేరు సురేష్, మామిడి నారయ్య, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: విఠల్
Published Mon, Mar 3 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement