C.vittal
-
త్వరలోనే ఉద్యోగాల జాతర
కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా లక్షా ఏడు వేల ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) సభ్యుడు సి.విఠల్ తెలిపారు. బుధవారం జిల్లాలో జరుగుతున్న డిపార్ట్మెంటల్ పరీక్షలను పర్యవేక్షించేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. ఖాళీల జాబితా అందాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన చేయడంలో జాప్యం కారణంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని పేర్కొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కిందిస్థారుు ఉద్యోగుల నియూమకంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. నియామక ప్రక్రియ పారదర్శకతగా ఉంటుందని, అవినీతి, అక్రమాలకు తావు ఉండదని అన్నారు. మొదటిసారిగా నిరుద్యోగుల సౌకర్యార్థం ఆన్లైన్ నమోదు ప్రారంభించామన్నారు. ఒక్కసారి నమోదు చేసుకున్న వారికి టీపీఎస్సీ సమాచారం ఎప్పటికప్పుడు అందుతుందన్నారు. టీపీఎస్సీ వెబ్సైట్ ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 12 లక్షల మంది విజిట్ చేశారని ఆయన తెలిపారు. -
ఆంధ్రకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా: విఠల్
హైదరాబాద్: తన సర్వీసును ఏపీకి కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉద్యోగాల సంఘ నేత విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో విఠల్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కలిసి విఠల్ తన వాదనను వినిపించారు. అందుకు ఉద్యోగుల విభజన తాత్కాలిక ప్రాతిపదికన జరుగుందని.. కాబట్టి కాస్తా ఓపిక పట్టాలని విఠల్ తో సీఎస్ అన్నారు. తనను ఏపీకి కేటాయించొద్దని సీఎస్ కు విఠల్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన అంతా తప్పల తడకగా ఉందనే విషయాన్ని సీఎస్ దృష్టికి విఠల్ తీసుకువచ్చారు. -
స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన: విఠల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.విఠల్ డిమాండ్ చేశారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి తెలంగాణ ఉద్యోగి రోజూ 2 గంటలు అదనంగా పనిచేస్తూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయనిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని చెప్పారు. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు కాలేరు సురేష్, మామిడి నారయ్య, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ తిప్పర్తి యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర ఉద్యోగి తెలంగాణలో పనిచేసే వీల్లేదు
తెలంగాణ ఉద్యోగాలు ఇక్కడి వారికే ఇవ్వాలి విఠల్ డిమాండ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: అక్రమంగా నియామకం పొందిన ఏ ఒక్క సీమాంధ్ర ఉద్యోగీ తెలంగాణలో పనిచేయడానికి వీల్లేదని టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్ హెచ్చరించారు. ప్రగతి మహా విద్యాలయ తెలంగాణ టెక్నిక్, నాన్ టెక్నిక్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటులో సోనియా, సుష్మాస్వరాజ్ ప్రధానపాత్ర పోషించారని కొనియాడారు. నారాయణ, శ్రీచైతన్యల లాంటి విద్యా సంస్థల రద్దుపై నవ తెలంగాణలో తొలిసంతకం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ లెక్చరర్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ, సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లని పక్షంలో వారిని తరిమికొడతామని హెచ్చరించారు. టీ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, రాజ్‌మహేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ టివి.రావ్‌ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.