ఆంధ్రకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా: విఠల్
ఆంధ్రకు కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా: విఠల్
Published Thu, May 29 2014 4:50 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
హైదరాబాద్: తన సర్వీసును ఏపీకి కేటాయిస్తే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని తెలంగాణ ఉద్యోగాల సంఘ నేత విఠల్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజనలో విఠల్ ను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని కలిసి విఠల్ తన వాదనను వినిపించారు. అందుకు ఉద్యోగుల విభజన తాత్కాలిక ప్రాతిపదికన జరుగుందని.. కాబట్టి కాస్తా ఓపిక పట్టాలని విఠల్ తో సీఎస్ అన్నారు.
తనను ఏపీకి కేటాయించొద్దని సీఎస్ కు విఠల్ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల విభజన అంతా తప్పల తడకగా ఉందనే విషయాన్ని సీఎస్ దృష్టికి విఠల్ తీసుకువచ్చారు.
Advertisement
Advertisement