
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నాంపల్లి బజార్‌ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఏఈటీ), ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ టెక్నీషియన్(ఈఈటీ), ఎలక్ట్రికల్ టెక్నీషియన్(ఈటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ), డైరీయింగ్, టూరిజం అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, అకౌంటెన్సీ అండ్ టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్(ఓఏ), రిటైల్ మేనేజ్‌మెంట్(ఆర్‌ఎం), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్‌టీ) తదితర కోర్సుల్లో సీట్లు ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు.
ఈ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణులు, ఇంటర్ పాస్, ఫెయిలైన వారు అర్హులని వెల్లడించారు. మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉంటాయన్నారు. కోర్సులు పూర్తి చేసిన వారికి జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయని చెప్పారు. వివరాలకు 9395554558 నంబర్‌లో సంప్రదించవచ్చు.