
సాక్షి, హైదరాబాద్: అతిథి అధ్యాపకులు (గెస్ట్ లెక్చరర్) కోసం నాంపల్లి బజార్‌ఘాట్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జనరల్ ఫౌండేషన్ కోర్సు(జీఎఫ్‌సీ), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్‌టీ), డైరీయింగ్‌లలో ఖాళీలు ఉన్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ అయాజ్ అలీఖాన్ తెలిపారు.
జీఎఫ్‌సీకి ఎంఏ ఎకనామిక్స్, ఎంఎల్‌టీకి ఎంఎస్సీ మైక్రోబయాలజీ, డైరీయింగ్‌కు వెటర్నిటీ సైన్స్ చేసిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9395554558 నంబర్‌లో సంప్రదించవచ్చు.