Neera Cafe
-
నీరు తాగుతున్నమంత్రి శీనన్న
-
హుస్సేన్ సాగర్ : కమ్మని నీరా.. కేఫ్ లోపల ఎలా ఉందో చూసేయండి (ఫొటోలు)
-
నీరా కేఫ్, క్యాంటీన్ ప్రారంభం
పంజగుట్ట: తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరాతోపాటు వాటి ఉప ఉత్పత్తులను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్, క్యాంటీన్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్, క్యాంటీన్లను రాష్ట్ర ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి బుధవారం ప్రారంభించారు. నీరాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, నీరా దేవతల పానీయం అని చెప్పేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మఠాధిపతులు, స్వామీజీలతో కలసి మంత్రులు ఈ సందర్భంగా నీరా తాగారు. నీరాలో ఎలాంటి ఆల్కహాల్ ఉండదని... ఇది తాగడంవల్ల మత్తు రాదని శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇందులో పుష్కలంగా విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయని చెప్పారు. సహజంగా లభించే పానియాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... వారికి గీత కార్మికుల ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొచ్చిన నీరా కేఫ్ చెంపపెట్టులాంటిదన్నారు. నీరా వంటకాలు సైతం.. క్యాంటీన్లో నీరా విత్ బోటీ, నీరా విత్ తెలంగాణ వంటకాలు, నీరా విత్ బిర్యానీ, నీరా విత్ వెజ్ స్నాక్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నీరాతోపాటు తాటి బెల్లం, తాటి చక్కెర, తేనె, నీరాతో చేసిన ‘బూస్ట్’ పొడి కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలోనే నీరా ఐస్‌క్రీం, తాటి ముంజ ఐస్క్రీంలను అందుబాటులోకి తెస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని... అందులో భాగంగానే రైతు బీమా తరహాలో గీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా తీసుకొచ్చారని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారని, ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని నెలకొల్పారని గుర్తుచేశారు. నీరా కేఫ్ ప్రారంభించినందుకు, గీత కార్మికులకు బీమా ప్రకటించినందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్ చిత్రపటాలకు అఖిల భారత గౌడ సంఘం నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్ గౌడ్, రాష్ట్ర పర్యాటక, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆంజనేయ గౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
-
నెక్లెస్‌రోడ్‌లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
-
నెక్లెస్‌రోడ్‌లో నేడు నీరా కేఫ్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఎన్నో పోషక విలువలకు నెలవై.. పల్లె ప్రాంతాలకే అలవాలమై ‘నీరా’ జనాలు అందుకున్న అత్యుత్తమ పానీయం. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరాను.. నగరవాసులకు చేరువ చేసేందుకు రంగం సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన నీరా కేఫ్ ఇవాళ(బుధవారం) ప్రారంభం కానుంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం నీరాకేఫ్‌ను ప్రారంభించనున్నారు. ఈ పానీయాన్ని ఆస్వాదించేందుకు తరలివచ్చే జనాల కోసం ప్రభుత్వం ఇక్కడ అన్ని వసతులు కల్పించింది. అదే సమయంలో.. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు చిత్రాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. 👉 నెక్లెస్ రోడ్డులో 2020 జులై 23న నీరాకేఫ్‌ను శంకుస్థాపన చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. నీరా కేఫ్‌లో మొత్తం 7 స్టాళ్లు ఉంటాయి. 500 మంది కూర్చునేందుకు వీలుంటుంది. రేట్లు ఎలా ఉంటాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 👉 నగర శివారు నందన వనంలోని పదెకరాల్లో ఉన్న తాటి చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. నీరా నాలుగు డిగ్రీల వద్ద సురక్షితంగా నిల్వ ఉంటుంది. తాటి, ఈత నీరా సేకరించాక దాన్ని సీసాల్లో పోసి.. ఐస్ బాక్సుల్లో నగరానికి తీసుకొస్తారు. నీరా కేఫ్‌లో శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి.. విక్రయిస్తారు. 👉 నీరా కేఫ్‌ను.. పోష్ రెస్టారెంట్ తరహాలో తీర్చిదిద్దారు. తియ్యటి నీరాతో పాటు నోరూరించే అనేక ఆహార పదార్థాలు కూడా లభిస్తాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఫుడ్ కోర్టు ఉంటుంది. మొదటి అంతస్తులో నీరాను అమ్ముతారు. నీరాను అక్కడే కూర్చుని తాగవచ్చు. లేదంటే టేక్ అవే సౌకర్యం కూడా ఉంది. 👉 పల్లెల్లో తాళ్లు, ఈదుల మధ్య కూర్చున్న అనుభూతి కలిగేలా... కేఫ్ చుట్టూ తాటి చెట్ల ఆకృతులు, పైకప్పును తాటాకు ఆకృతిలో రూపొందించారు. 👉 నీరా కేఫ్ నుంచి ట్యాంక్‌బండ్‌లోని బుద్ధ విగ్రహం వరకు బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. కల్లుకు, నీరాకు ఎంతో తేడా ఉంది. కల్లులో ఆల్కాహాల్ శాతం ఉంటుంది. కానీ నీరాలో ఆల్కాహాల్ ఉండదు. నీరా రుచి తియ్యగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు)
Neera Cafe : హుస్సేన్ సాగర్ తీరాన స్టార్ హోటల్‌ను తలపించేలా నీరా కేఫ్ (ఫొటోలు) -
అలలపై పడవ ప్రయాణం.. సహజ నీరా పానీయం
సాక్షి, హైదరాబాద్: సాగర తీరం మరో ఆతిథ్యానికి సన్నద్ధమైంది. సహజమైన నీరాతో పాటు తెలంగాణ రుచులను అందజేసే నీరా కేఫ్ ప్రారంబో త్సవానికి సర్వం సన్నద్ధమైంది. పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న నీరా కేఫ్‌ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించనున్నారు. హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఏర్పాటు చేసిన నీరాకేఫ్ నగరవాసులకు సరికొత్త అనుభూతినివ్వనుంది. ఇక్కడి నుంచి సాగర్‌లో విహరించేందుకు పర్యాటకశాఖ బోటు షికారును కూడా అందుబాటులోకి తెచ్చింది. పీపుల్స్‌ప్లాజా వైపు వచ్చే సందర్శకులు నీరా సేవనంతో పాటు పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతి సిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందించేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది. ఆకర్షణీయంగా భవనం.. నీరాభవనం తాటాకుతో చేసిన రేక ఆకృతిలో ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. పల్లెల్లో తాటి, ఈత కల్లును తాటాకులతో చేసిన రేకలు, మోదుగాకు డొప్ప(దొన్నె)లలో సేవించడానికి ఇష్టపడతారు. ఇలా ఆకుల్లో తాగడం వల్ల పానీయం సహజత్వం ఏ మాత్రం కోల్పోకుండా ఉంటుంది. అలాంటి తాటాకు రేక కప్పినట్టుగా నీరా భవనాన్ని నిర్మించడం విశేషం. తెలంగాణ పల్లెలను తలపిస్తూ అందమైన మ్యూరల్స్, చేతివృత్తులను ప్రతిబింబించే శిల్పాలతో భవనం ప్రాంగణాన్ని రూపొందించారు. ఈ కేఫ్‌లో మొత్తం ఏడు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను పూర్తిగా నీరా కోసం కేటాయించగా మిగతా ఆరింటిలో వివిధ రకాల ఆహార పదార్ధాలు, ఐస్‌క్రీమ్‌లు, బిర్యానీలు లభిస్తాయి. హుస్సేన్ సాగర్ జలాలను, పోటెత్తే అలలను వీక్షిస్తూ నచ్చిన రుచులను ఆస్వాదించవచ్చు. ఇందుకనుగుణంగా సీటింగ్ సదుపాయం ఉంటుందని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు తెలిపారు. భవనం మొదటి అంతస్థులో ఉన్న విశాలమైన హాల్లో పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకలు నిర్వహించుకోవచ్చు. విందులు ఏర్పాటు చేసుకొనే సదుపాయం కూడా ఉంటుంది. ఆరోగ్య ప్రదాయిని.... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారుజామునే సేకరించే నీరాలోని సహజమైన పోషకవిలువలు ఏ మాత్రం పోకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం నీరా భవనంలో ప్రత్యేక శీతలీకరణ యంత్రాలను ఏర్పాటు చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముది్వన్లో ఏర్పాటు చేసిన తాటివనాల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరా సేకరిస్తారు. దాంతోనే అనుబంధ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ‘పానీయంలోని స్వచ్ఛతకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు.. తాటి చెట్ల నుంచి నీరాను సేకరించడం మొదలు.. దానిని వినియోగదారులకు చేర్చడంవరకు పూర్తిగా శాస్త్రీయమైన పద్ధతిని పాటిస్తున్నాం’అని నిర్వాహకులు తెలిపారు. నీరాలో శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. నీరాతో పాటు తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా ద్వారా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు. ఆడ, మగ(పోద్దాడు, పరుపుదాడు) తాటి చెట్ల నుంచి సేకరించే రెండు రకాల తాటి బెల్లం కూడా ఇక్కడ లభించనుంది. ఆహార ఉత్పత్తులు ధర (సుమారుగా) 300 ఎంఎల్ తాటి నీరా రూ. 90 200 ఎంఎల్ తాటి నీరా రూ. 60 తాటిబెల్లం (కిలో) రూ.1000 తాటి చక్కెర (కిలో) రూ. 1050 తాటి బూస్ట్ రూ. 1100 తాటి తేనె (లీటర్) రూ.1200 ఈత బెల్లం (కిలో) రూ.900 ఈత తెనె (లీటర్) రూ.1000 -
త్వరలో హైదరాబాద్‌లో నీరా కేఫ్: మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల సంప్రదాయక జీవనోపాధిని పెంపొందించడంతో పాటు ఆరోగ్య పానీయాన్ని హైదరాబాద్ వాసులకు అందించేందుకు నీరా పాలసీని తీసుకొస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆల్కహాల్ లేని నీరాను దాని ఉప ఉత్పత్తులను శుద్ధి చేసి హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శాసనసభలో సభ్యులు ప్రకాశ్‌గౌడ్, ఆత్రం సక్కు, మెతుకు ఆనంద్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ...రూ.12.20 కోట్లతో నీరాకేఫ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రోమ్నగరానికి చెందిన రచయిత కొన్ని శతాబ్దాల క్రితమే ఈ సంప్రదాయ చెట్లకు సంబంధించి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. త్వరలోనే నూతన క్రీడా విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,076 క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. -
ఇదిగో సాగరతీరంలో నీరా కేఫ్
సాక్షి, హైదరాబాద్: సాగరతీరం మరింతగా పర్యాటక హంగులను సంతరించుకుంటోంది. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా–ఈ పోటీల నేపథ్యంలో నెక్లెస్‌రోడ్డు, ట్యాంక్‌బండ్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకొనేవిధంగా అనేక ఏర్పాట్లు చేపట్టారు. సాగర్ జలాలపై మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్షోలతో పాటు ఈ నెలలోనే నీరా కేఫ్‌ను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాటి, ఈత చెట్ల నుంచి లభించే ప్రకృతిసిద్ధమైన నీరా పానీయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సుమారు రూ.10 కోట్లతో నెక్లెస్ రోడ్డు, పీపుల్స్‌ప్లాజా సమీపంలో ఈ కేఫ్‌ను నిర్మించింది. నీరాతో పాటు రెస్టారెంట్ సేవలు... తాటి, ఈత చెట్ల నుంచి తెల్లవారు జామునే సేకరించే నీరా పానీయంలోని సహజమైన పోషక విలువలు ఏ మాత్రం చెడకుండా శీతలీకరణ పద్ధతిలో నిల్వ చేసి విక్రయిస్తారు. ఇందుకోసం రెండంతస్థుల నీరా భవనంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని రకాల శీతలీకరణ యంత్రాలను సిద్ధం చేశారు. భువనగిరి సమీపంలోని నందనం, కడ్తాల్ సమీపంలోని ముద్విన్‌లో ఏర్పాటు చేసిన తాటివనం ప్రాజెక్టుల్లో నీరా కోసమే ప్రత్యేకంగా పెంచిన తాటి, ఈత చెట్ల నుంచి నీరాతో పాటు అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని వివరించారు. నీరాతో పాటే రెస్టారెంట్ సేవలు కూడా ఇక్కడ లభిస్తాయని చెప్పారు. ►ఈ కేఫ్‌లో తెలంగాణ వంటకా లన్నీ లభిస్తాయి. ►ఒకేసారి సుమారు 3 వేల మంది సందర్శించవచ్చు. ►పర్యాటక ప్రియులు, నగరవాసులు సాగరతీరంలో సేదతీరుతూ నీరాను ఆస్వాదించవచ్చు. ►తాటి, ఈత చెట్ల నుంచి సేకరించే నీరా నుంచి తయారయ్యే బెల్లం, సిరప్లు కూడా కేఫ్‌లో విక్రయిస్తారు. -
మనోభావాలు ముఖ్యం.. ఆచితూచి వ్యవహరించాలి
గీత వృత్తికి చెందిన గౌడ కులస్థుల కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో... వారి సంక్షేమార్థం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భువనగిరి జిల్లా ‘నందనం’ అనే గ్రామంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో నీరా శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వతా హర్షం వ్యక్తమైంది. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై నెక్లెస్ రోడ్డులో ఒక నీరా హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో దానికి ‘వేదామృతం’ అని పేరు పెట్టారు. అదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కొంతమంది బ్రాహ్మణ వర్గం నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహా దారైన డాక్టర్ రమణాచారిని కలిసి నీరాపానీయానికి ‘వేదామృతం’ అనే నామకరణం ఎంత వరకు సమంజసమైనది అని ప్రశ్నిస్తూ వినతి పత్రం సమర్పించారు. దీంతో వాద ప్రతివాదాలు ఊపందుకున్నాయి. హిందువుల పవిత్ర గ్రంథాలలో ‘వేదాలు’ అనేవి చాలా ప్రాధాన్యం సంతరించుకొన్నవనీ, అవి ప్రపంచానికి మార్గదర్శకాలనీ, నీరాకు వేదామృతం అనే పేరు పెట్టడం హైందవ జాతిని అవమానించేదిగా ఉందనే విషయాన్ని తెరమీదకు తీసుకువచ్చారు ఈ పేరును వ్యతిరేకించేవారు. అయితే కల్లుగీత వృత్తిపై ఆధారపడిన గౌడ కుల సంఘాలు, నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వేదామృతం పేరును సమర్థించడంతో సమస్య జటిలమైందని చెప్పాలి. ఆయుర్వేద వైద్యపరంగా నీరా అనేది సర్వరోగ నివారిణి అనీ, ముఖ్యంగా క్యాన్సర్‌ను కూడా నివారించే ఔషధ గుణాలున్నాయనేది వారి వాదం. వేదాల్లో సురాపానం గురించి ఉందనీ, ‘సుర’ అంటే అమృతం అనీ, దేవతలూ, రాక్షసులూ దానిని సేవించారని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. వేదాలకు భారతీయ సంస్కృతిలో ఉన్న ప్రాముఖ్యం, పవిత్రతను దృష్టిలో పెట్టుకుని గౌడ సోదరులు వేదామృతం అనే పేరును సమర్థించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సమాజంలోని అన్ని వర్గాల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: నిజంగా కులగణన అవసరమేనా?) – డాక్టర్ మాచర్ల మొగిలి గౌడ్ రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, చేవెళ్ల