
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కల్లు గీత కార్మికుల సంప్రదాయక జీవనోపాధిని పెంపొందించడంతో పాటు ఆరోగ్య పానీయాన్ని హైదరాబాద్ వాసులకు అందించేందుకు నీరా పాలసీని తీసుకొస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆల్కహాల్ లేని నీరాను దాని ఉప ఉత్పత్తులను శుద్ధి చేసి హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
శాసనసభలో సభ్యులు ప్రకాశ్‌గౌడ్, ఆత్రం సక్కు, మెతుకు ఆనంద్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ...రూ.12.20 కోట్లతో నీరాకేఫ్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. రోమ్‌నగరానికి చెందిన రచయిత కొన్ని శతాబ్దాల క్రితమే ఈ సంప్రదాయ చెట్లకు సంబంధించి రాసిన పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించారు. త్వరలోనే నూతన క్రీడా విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 12,076 క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. వికారాబాద్ అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment