నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..! | Lovers Attack A Man At Necklace Road In Hyderabad | Sakshi
Sakshi News home page

నెక్లెస్‌ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!

Published Thu, Jun 13 2019 7:24 PM | Last Updated on Thu, Jun 13 2019 7:38 PM

Lovers Attack A Man At Necklace Road In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నెక్లెస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న మంగల్‌హాట్‌కు చెందిన సాయిసాగర్ (21) అనే యువకుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన రోజు వేడుక చేసుకుంటున్న ఓ జంట పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా మాట్లాడారని.. ప్రతిగా ఆ జంట యువకులను చితకబాదినట్టు సమాచారం. ప్రేమికుల దాడిలో గాయపడిన సాయిసాగర్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

పోలీసులు చితకబాదడంతోనే తమ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సాయిసాగర్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పరామర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుకు మాత్రమేనని నిందితులపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ సాయిసాగర్‌పై దాడిచేశారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement