ramgopalpeta
-
Hyderabad: రాంగోపాల్‌పేటలోని అపార్ట్మెంట్లో పేలుడు
-
సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్‌పేటలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అపార్ట్మెంట్లోని మొదటి అంతస్థులో సంభవించిన పేలుడు ధాటికి ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పేలుడు సంభవించినప్పుడు భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరికి గాయాలవ్వగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరిని నేపాల్ వాసులు సందీప్, అనుగా గుర్తించారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన ఈ జంట ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. సికింద్రాబాద్ పేలుడు ఘటనను పోలీసులు నిర్ధారించారు. గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పేలుడు జరిగినట్లు తెలిపారు. సిలిండర్ లీక్ కావడంతో రూమ్ అంతా గ్యాస్ నిండినట్లు, వంట చేయడం కోసం గ్యాస్ వెలిగించడంతో సిలిండర్ పేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం తనిఖీలు చేపట్టింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. కేసీఆర్ సర్కార్‌పై నిర్మల ఫైర్ -
బీజేపీ సీనియర్ నేత భవర్లాల్ వర్మ మృతి
సాక్షి,హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సహ కోశాధికారి, మాజీ కార్పొరేటర్ భవర్‌లాల్‌వర్మ (63) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో శనివారం ఉదయం మృతి చెందారు. కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. కరోనా తగ్గిపోయినా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో ఎక్మో వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందజేస్తూ వచ్చారు. అయితే శనివారం కార్డియాక్ అరెస్టు కావడంతో కన్ను మూశారు. ఆయనకు భార్య రామ్కన్యావర్మ, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భౌతిక కాయాన్ని రంగ్రేజీబజార్లోని ఆయన నివాసానికి తరలించగా పలువురు ప్రముఖులతో పాటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ తదితరులు నివాళులర్పించారు. సాయంత్రం కవాడీగూడలోని మార్వాడీ శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి తీరని లోటు: కిషన్‌రెడ్డి బీజేపీ సీనియర్ లీడర్‌గా ఎల్లవేళల్లా పార్టీ కోసం, కార్యకర్తల కోసం కొట్లాడే వ్యక్తి భవర్‌లాల్‌వర్మ. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి సమయంలోనైనా వెళ్లి ఆదుకునే వారు. కరోనాతో ఆయన అందరినీ వదలి వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతి బీజేపీ పార్టీకి, కార్యకర్తలకు తీరనిలోటు. ( చదవండి: బీజేపీకి అండగా టీఆర్ఎస్: ఉత్తమ్‌కు కేటీఆర్ ఫోన్ ) -
ఒకేసారి 108 పోతరాజుల విన్యాసాలు
హైదరాబాద్: రాంగోపాల్‌పేట్ డివిజన్ నల్లగుట్టలో ఆదివారం జరిగిన తొట్టెల ఊరేగింపులో ఒకేసారి 108 మంది పోతరాజులు చేసిన విన్యాసాలు చూపరులను అలరించాయి. స్థానికనేత కేశబోయిన మనోహర్ యాదవ్ తన తాత బలరాం యాదవ్ జ్ఞాపకార్థం పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు ఫలహార బండి, తొట్టెల ఊరేగింపును నిర్వహించారు. పీజీరోడ్ జవహార్‌నగర్‌లోని పోచమ్మ దేవాలయం నుంచి నల్లగుట్టలోని కనకదుర్గమ్మ ఆలయం వరకు కొనసాగిన ఈ ఊరేగింపునకు భక్తులు భారీగా హాజరయ్యారు. ఈ ఊరేగింపులో పోతరాజులు తమ వీరంగాలు, డప్పులు దరువులు, నృత్యాలతో అలరించారు. వీరితో పాటుగా 20 బృందాలకు చెందిన 625 మంది కళాకారులు పాల్గొన్నారు. మల్లన్న డప్పులు, కోలాటాలు, విచిత్ర వేషాలు, రాధా కృష్ణుల వేషధారణ, పులివేషాలతో వీరంతా చూపరులను అలరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ 108 మంది పోతరాజులతో ఎక్కడ ఫలహార బండి ఊరేగింపు జరగలేదని దేశంలో తొలిసారిగా తాము నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ విషయాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్శల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లామని చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి సమర్పిస్తామని అటు తర్వాత రికార్డుల్లోకి ఎక్కుతాయని చెప్పారు. -
నెక్లెస్ రోడ్డు ఘటన.. యువకుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్‌రోడ్డులో రెండ్రోజుల కిత్రం జరిగిన గొడవలో ప్రియుడి(మోబిన్) చేతిలో గాయపడ్డ సాయి సాగర్ (21) శనివారం మృతిచెందాడు. పోలీస్‌స్టేషన్‌లోనే సాయి సాగర్‌పై మోబిన్ పిడి గుద్దులతో ఎటాక్ చేశాడని, సీసీ పుటేజ్ ఇవ్వకుండా పోలీసులు అతనికి సపోర్ట్ చేస్తున్నారని మృతుడి స్నేహితులు అంటున్నారు. ఇప్పటికే మోబిన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై 16 కేసులు నమోదు అయినట్లు, మిర్యాలగూడలో కేసులతో పాటుగా పీడీ యాక్ట్‌లో మోబిన్ అరెస్టయ్యాడు. బర్త్‌డే పార్టీ చేసుకోవడానికి నెక్లెస్‌రోడ్డుకు వెళ్లిన సాయి సాగర్ స్నేహితుల బృందం.. అక్కడి ఓ ప్రేమజంటతో వాగ్వాదానికి దిగారు. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న సాయిసాగర్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతున్న సాయి సాగర్ మృతి చెందాడు. సాయి సాగర్‌కు ఇరవై రోజుల కిత్రమే వివాహమైనట్లు స్నేహితులు పేర్కొన్నారు. చదవండి : నెక్లెస్ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..! -
నెక్లెస్ రోడ్డులో ఘర్షణ.. చితకబాదిన ప్రేమ జంట..!
సాక్షి, హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు వర్గాలకు చెందిన నలుగురు యువకులను రాంగోపాల్ పేట పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అయితే, అప్పటివరకు బాగానే ఉన్న మంగల్‌హాట్‌కు చెందిన సాయిసాగర్ (21) అనే యువకుడు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతడిని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పుట్టిన రోజు వేడుక చేసుకుంటున్న ఓ జంట పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా మాట్లాడారని.. ప్రతిగా ఆ జంట యువకులను చితకబాదినట్టు సమాచారం. ప్రేమికుల దాడిలో గాయపడిన సాయిసాగర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు. పోలీసులు చితకబాదడంతోనే తమ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సాయిసాగర్‌ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుకు మాత్రమేనని నిందితులపట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ సాయిసాగర్‌పై దాడిచేశారని ఆరోపించారు. -
అమ్మా,నాన్మా క్షమించండి
రాంగోపాల్‌పేట్: అమ్మా నాన్నా నన్ను క్షమించండి...నాన్నలా బతకాలనుకున్నా....కానీ బతలేకపోతున్నా... వార్డన్ సార్.. మీరు నన్ను కన్నకొడుకులా చూసుకున్నారు... నేను ఇలా చేస్తానని మీరు ఊహించి ఉండరు.. క్షమించండి... అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు రాంగోపాల్‌పేట ఎస్సై కృష్ణ మోహన్ కథనం ప్రకారం... మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం, తుజాల్పూర్ గ్రామానికి చెందిన గాలి వెంకటేశం, రుకుంబాయ్‌లకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు గాలి విష్ణు (21) నల్లగొండ జిల్లా దేశ్‌ముఖ్ గ్రామంలోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆనంద్ థియేటర్ ఎదురుగా ఉండే వెస్లీ హాస్టల్ ఉంటూ చదువుకున్న విష్ణు.. ఇప్పుడు ఇంజినీరింగ్ చదువుతూ కాడా వార్డెన్ సహకారంతో ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు. ఇదిలా ఉండగా...బుధవారం రాత్రి 10.30కి భోజనం ముగించుకుని వేరే గదిలోకి వెళ్లి పడుకున్న విఘ్ణ గురువారం ఉదయం 6.15కి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. వార్డెన్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో మృతుడు తల్లిదండ్రులను, వార్డెన్‌ను ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ దొరికింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా, 5వ తరగతి నుంచి ఇక్కడే హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న విష్ణు ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు.