అమ్మా,నాన్మా క్షమించండి | student commit suicide in hostel | Sakshi
Sakshi News home page

అమ్మా,నాన్మా క్షమించండి

Published Wed, Aug 17 2016 11:37 PM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

అమ్మా,నాన్మా క్షమించండి - Sakshi

అమ్మా,నాన్మా క్షమించండి

రాంగోపాల్‌పేట్‌: అమ్మా నాన్నా నన్ను క్షమించండి...నాన్నలా బతకాలనుకున్నా....కానీ బతలేకపోతున్నా... వార్డన్‌ సార్‌..  మీరు నన్ను కన్నకొడుకులా చూసుకున్నారు... నేను ఇలా చేస్తానని మీరు ఊహించి ఉండరు.. క్షమించండి... అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు రాంగోపాల్‌పేట ఎస్సై కృష్ణ మోహన్‌ కథనం ప్రకారం... మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలం, తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన గాలి వెంకటేశం, రుకుంబాయ్‌లకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. కుమారుడు గాలి విష్ణు (21) నల్లగొండ జిల్లా దేశ్‌ముఖ్‌ గ్రామంలోని సెయింట్‌ మేరీస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

  5వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఆనంద్‌ థియేటర్‌ ఎదురుగా ఉండే వెస్లీ హాస్టల్‌ ఉంటూ చదువుకున్న విష్ణు.. ఇప్పుడు ఇంజినీరింగ్‌ చదువుతూ కాడా  వార్డెన్‌ సహకారంతో ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు. ఇదిలా ఉండగా...బుధవారం రాత్రి 10.30కి భోజనం ముగించుకుని వేరే గదిలోకి వెళ్లి పడుకున్న విఘ్ణ గురువారం ఉదయం 6.15కి ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు.  వార్డెన్‌ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటన స్థలంలో మృతుడు తల్లిదండ్రులను, వార్డెన్‌ను ఉద్దేశించి రాసిన సూసైడ్‌ నోట్‌ దొరికింది.  పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.  కాగా,  5వ తరగతి నుంచి ఇక్కడే హాస్టల్‌ ఉంటూ చదువుకుంటున్న విష్ణు ఆత్మహత్య చేసుకోవడంతో తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement