బైక్ రేసింగ్లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు | Bike Racers Arrested at Necklace Road in Hyderabad ... | Sakshi
Sakshi News home page

బైక్ రేసింగ్లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు

Jul 26 2015 8:30 AM | Updated on Aug 20 2018 4:44 PM

బైక్ రేసింగ్లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు - Sakshi

బైక్ రేసింగ్లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు

నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 75 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే బైక్లను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్కి పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సెలవు దినాలలో గండిపేట పరిసర ప్రాంతంలో గతంలో యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతుండేవారు.

దాంతో స్థానికులు ఫిర్యాదుతో గండిపేట తదితర ప్రాంతాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకులు బైక్ రేసింగ్ కోసం నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు. అయితే ఈ రేసింగ్ల వల్ల ఉదయపు నడక కోసం నెక్లెస్ రోడ్డులో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించి... వందమందికి పైగా యువకులను అరెస్ట్ చేసి... బైక్లు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement