bike racers
-
బైక్ రేసర్ల హల్ చల్
-
Hyderabad Bike Racer: రికార్డులే రికార్డులు
సాక్షి, బంజారాహిల్స్: ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 600 మంది బైక్ రేసర్లలో అత్యుత్తమ ప్రతిభ చాటిన నగర యువకుడు నాలుగు విభాగాల్లో ముందుండి నాలుగు ట్రోఫీలను కైవసం చేసుకున్నాడు. పూణేలోని లోనావాలాలో జరిగిన డ్రాగ్ రన్లో పాల్గొన్న కూకట్‌పల్లికి చెందిన బైక్ రేసర్ సందీప్ నడింపల్లి ఎం–9 కేటగిరిలో మొదటి స్థానం, ఓ–2 కేటగిరిలో మూడో స్థానంతో పాటు ఫాస్టెస్ట్ బైక్ ఆఫ్ ద ఈవెంట్, ఫాస్టెస్ట్ టైమ్ ఆఫ్‌ద ఈవెంట్ పతకాలను గెలుచుకున్నాడు. తొమ్మిది సెకండ్లలో 400 మీటర్ల దూరాన్ని చేరుకొని ఈ రికార్డు సృష్టించాడు. అయిదేళ్లుగా రేసర్‌గా రాణిస్తున్న సందీప్ ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 50 పతకాలను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే నేషనల్ చాంపియన్‌గా నిలిచిన ఆయన పాత రికార్డులను బద్దలుకొట్టి నాలుగు సరికొత్త రికార్డులను నమోదు చేశారు. మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఇతను కాలేజీ స్థాయిలోనే జాతీయ స్థాయి టైటిల్స్ సాధించాడు. మూడేళ్లలో ఆరు నేషనల్ టైటిల్స్, 45 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో మరింత రాణించి భారత కీర్తి పతాకాలను ప్రపంచ స్థాయిలో చాటాలన్నదే తన లక్ష్యమని ఆ మేరకు శ్రమిస్తానని సందీప్ తెలిపారు. ఈ పతకాలు రావడంపట్ల తనకెంతో ఆనందంగా ఉందన్నాడు. -
విశాఖలో బైక్ రైడర్లను పట్టుకున్న పోలీసులు
-
ఆ బైక్ రేసర్లు ఎవరో తేలింది
సాక్షి, విజయవాడ: విజయవాడలో అర్థరాత్రి బైక్ రేసులు నిర్వహించిన యువకులను నగర పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అర్థరాత్రి కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. రేసింగ్‌ల వల్ల తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నామని స్థానికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం రేసింగ్‌లపై దృష్టి సారించింది. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సదరు యువకుల వివరాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న యువకులంతా హైదరాబాద్‌కు చెందిన ‘రోడ్ ర్యాప్జ్’ గ్రూప్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రతి మూడు నెలలకొకసారి బెజవాడ సమీపంలోని అడ్వెంచర్ క్లబ్లో స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ గ్రూప్ యువకులతో రేసింగ్‌లు జరుపుతున్నట్టు సమాచారం. అ క్రమంలోనే ఇటీవల బైక్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న యువకులు తిరిగి హైదరాబాద్ వెళ్తూ మితిమీరిన వేగంతో బైక్స్ నడపటం, ప్రమాదకర విన్యాసాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. క్లబ్లో ఓ రైస్ ట్రాక్‌ను పోలీసులు గుర్తించారు. అయితే అడ్వెంచర్ క్లబ్లో రేసింగ్‌లకు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యువకుల మీద కేసులు పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
మితిమీరిన వేగంతో బైకు రేసులు
-
బెజవాడలో రెచ్చిపోతున్న బైక్ రేసర్లు
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో యువకులు బైకు రేసులు నిర్వహిస్తున్నారు. నగరంలో నిత్యకృత్యంగా మారిన రేసింగ్‌లతో జనాలు భయంతో వణికిపోతున్నారు. కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. బడాబాబుల కొడుకులు కూడా రేసింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. గతంలో రేసింగ్‌ల వల్ల పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. -
39 మంది బైక్ రేసర్ల అరెస్ట్
విశాఖపట్నం: విశాఖ బీచ్ రోడ్లో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 39 మంది యువకులు హైసీసీ బైక్‌లపై శుక్రవారం రాత్రి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేశారని, పోలీసులు అడ్డగించినా వారు ఆగలేదని ట్రాఫిక్ ఏడీసీపీ మహేంద్రపాత్రుడు తెలిపారు. వారందరినీ గుర్తించి అదుపులోకి తీసుకుని, బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. యువకులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు బైక్‌లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్ రేసర్లు
-
బైక్ రేసర్ల అరెస్ట్
కీసర (రంగారెడ్డి): కీసర ఓఆర్ఆర్ జంక్షన్ రహదారిలో బైక్ రేసింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘట్కేసర్ మండలంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు, మూడు బైకులపై ఆదివారం ఉదయం కీసర ఓఆర్ఆర్ జంక్షన్‌కు చేరుకుని రేసింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చూసి నలుగురు విద్యార్థులు పరారు కాగా, ఇద్దరు పట్టుబడ్డారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి, ర్యాష్ డ్రైవింగ్ పేరిట జరిమానా వసూలు చేసి విడుదల చేశారు. -
పోలీసుల అదుపులో 181 మంది మైనర్లు
హైదరాబాద్ : పాతబస్తీలో బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 181 మంది మైనర్ బాలురను సౌత్‌జోన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 202 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. సదరు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీస్ సమాచారం అందించారు. తల్లిదండ్రుల సమక్షంలో బాలురకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే కఠినచర్యలు తప్పవని తల్లిదండ్రులు ఎదుట బాలురను పోలీసులు హెచ్చరించారు. -
రేసింగ్ రాయుళ్ల ఆటకట్టు
హైదరాబాద్ : పలుమార్లు జరిమానాలు, కౌన్సిలింగ్ లు నిర్వహించినా బైక్ రేసర్లలో ఫలితం కనిపించడంలేదు. గత వారం నెక్లెస్ రోడ్ లో రేసింగ్ లకు పాల్పడుతున్న 80 మంది పోలీసులు పట్టుబడ్డారు. అయినా తీరు మారని యువకులు బైక్ పోటీలు పెట్టుకుంటున్నారు. తాజాగా శుక్రవారం అర్థరాత్రి చక్కర్లు కొడుతున్న రేసింగ్ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ రోడ్లపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక రేసింగ్‌లకు పాల్పడుతున్న 30 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ లు సీజ్ చేశారు. కాగా.. వీరిలో మైనర్లు కూడా ఉన్నట్టు సమాచారం. రేసింగ్‌లకు పాల్పడుతున్న యువకుల తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో 75 మంది యువకులు
-
బైక్ రేసింగ్‌లు: పోలీసుల అదుపులో 75 మంది యువకులు
హైదరాబాద్ : నెక్లెస్ రోడ్డులో నగర పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న 75 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలాగే బైక్‌లను కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్‌కి పిలిపించారు. వారి సమక్షంలో యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. సెలవు దినాలలో గండిపేట పరిసర ప్రాంతంలో గతంలో యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతుండేవారు. దాంతో స్థానికులు ఫిర్యాదుతో గండిపేట తదితర ప్రాంతాలను పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకులు బైక్ రేసింగ్ కోసం నెక్లెస్ రోడ్డును ఎంచుకున్నారు. అయితే ఈ రేసింగ్‌ల వల్ల ఉదయపు నడక కోసం నెక్లెస్ రోడ్డులో వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. ఇటీవలే పోలీసులు నెక్లెస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించి... వందమందికి పైగా యువకులను అరెస్ట్ చేసి... బైక్‌లు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. -
వాట్సప్‌తో వర్తమానం
రాజేంద్రనగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని బైక్రేసర్లు గత రెండు నెలలుగా తమ కార్యకలాపాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించారు. ఎట్టకేలకు నార్సింగ్ పోలీసులకు చిక్కిన ఈ రేసర్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్స్ఆప్ల ద్వారా రేసింగ్‌లకు పాల్పడటంతో పాటు బెట్టింగ్స్ కూడా నిర్వహిస్తూ ఆశ్చర్యానికి గురి చేశారు. 12 ఏళ్ల బాలుడు సైతం ఈ రేసింగ్స్‌లో పాల్గొని తన సత్తా చాటడం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సైకిల్‌ను సైతం లేపలేని వయస్సులో బైక్‌ను సునాయాసంగా గాల్లోకి లేపుతూ విన్యాసాలు చేయడం ఔరా అనిపించింది. పోలీసులకు పట్టుబడ్డ 80 మందిలో 15 ఏళ్ల వయస్సులోపు వారే పదుల సంఖ్యలో ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రేసర్లను ‘సాక్షి’ ఆరా తీయగా పలు విషయాలు వెల్లడించారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్స్ఆప్లలో... బైక్రేసర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లలో చాటింగ్‌లు, యూట్యూబ్‌లలో తాము చేసిన విన్యాసాలను అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి ఆదివారం ఎక్కడ? ఎన్ని గంటలకు కలవాలి తదితర విషయాలను ఒక్క రోజు ముందు వాట్స్ఆప్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ విధంగా రేసింగ్ విషయం తమ వారికి తప్ప మరెవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. మొదట ఇద్దరు యువకులు.... ప్రతి ఆదివారం యువకులంతా బైక్రేసింగ్కు నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. ఇద్దరు యువకులు ముందుగా అక్కడికి వెళ్తారు. పరిస్థితులను చూసి వెంటనే వాట్స్ఆప్ ద్వారా తమ గ్రూపు సభ్యులకు వచ్చేయమని మెసేజ్ పంపుతారు. నిమిషాల వ్యవధిలో గ్రూప్ సభ్యులంతా చేరుకొని బైక్‌రేసింగ్‌లకు పాల్పడుతున్నారు.