
అర్థరాత్రి బైక్ రేసింగ్‌లో యువకులు
సాక్షి, విజయవాడ: విజయవాడలో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రివేళ మితిమీరిన వేగంతో యువకులు బైకు రేసులు నిర్వహిస్తున్నారు. నగరంలో నిత్యకృత్యంగా మారిన రేసింగ్‌లతో జనాలు భయంతో వణికిపోతున్నారు. కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.
బడాబాబుల కొడుకులు కూడా రేసింగ్‌లో పాల్గొంటున్నారని సమాచారం. గతంలో రేసింగ్‌ల వల్ల పలు ప్రమాదాలు కూడా జరిగాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment