youngsters
-
ప్రాణాలు తీసిన సరదా!
సాక్షి,హైదరాబాద్/గజ్వేల్/ముషిరాబాద్/బన్సీలాల్‌పేట్/ఖైరతాబాద్: పండుగ సెలవుల్లో సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ యువకులకు.. అదే చివరి ప్రయాణమైంది. ఆట విడుపే ఆఖరి క్షణమైంది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లో మునిగి శనివారం ఐదుగురు యువకులు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్ ఇందిరానగర్‌కు చెందిన ధనుష్ (20), లోహిత్ అలియాస్ లక్కీ (17) సోదరులు. బన్సీలాల్‌పేటలోని కవాడిగూడకు చెందిన చీకట్ల దినేశ్వర్ (18), ఖైరతాబాద్‌కు చెందిన జతిన్ (17), రాంనగర్‌కు చెందిన మృగాంక్ (17), ఎండీ ఇబ్రహీం (20), అత్తాపూర్‌కు చెందిన సాహిల్ వీరికి స్నేహితులు. శనివారం సెలవు కావడంతో సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి ఆలయం, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వెళ్లారు. నేరుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు చేరుకొన్న వీరంతా సరదాగా గడిపేందుకు కట్టపై నుంచి కిందికి దిగారు. సెల్ఫీలు దిగుతున్న సమయంలో లోహిత్ కాలుజారి నీళ్లలో పడ్డాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ధనుష్, సాహిల్, దినేశ్వర్, జతిన్ సైతం నీళ్లలో పడి మునిగిపోయారు. భయకంపితులైన మృగాంక్, ఇబ్రహీంలు గట్టిగా కేకలు వేస్తూ కట్టపైకి పరుగులు తీశారు. 100 నంబర్‌కు డయల్ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో ములుగు, మర్కూక్ పోలీసులు వెంటనే స్పందించారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సిద్దిపేట సీపీ అనురాధ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో మరింత అప్రమత్తమై గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. రెస్క్యూ టీమ్‌ను, గజ ఈతగాళ్లను రప్పించి డ్రోన్ల సాయంతో మృతదేహాలను గుర్తించి వెలికితీసే ప్రక్రియను చేపట్టారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు శ్రమించి నీటిలో 30 అడుగుల లోతులో మునిగిన ఐదు మృతదేహాలను వెలికితీశారు. లోహిత్, దినేశ్వర్, జతిన్లు మీర్‌పేటలోని టీకేఆర్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నారు. సాహిల్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, ధనుష్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనా స్థలానికి డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్‌రెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. తండ్రి జన్మదినం రోజే కొడుకు మృతి కొండపోచమ్మ సాగర్‌లో మునిగి చనిపోయిన చీకట్ల దినేశ్వర్ (17) తండ్రి కిషన్‌దాస్ జన్మదినం శనివారమే. తన పుట్టినరోజు నాడే కుమారుడు చనిపోవటంతో ఆ తండ్రి బాధ వర్ణాతీతంగా ఉంది. మరోవైపు చేతికంది వచ్చిన ఇద్దరు కొడుకులూ ఒకేసారి చనిపోవటంతో ధనుష్, లోహిత్‌ల తల్లిదండ్రుల రోదనలు ఆపటం ఎవరితరం కాలేదు. ‘తండ్రి లేని బిడ్డ.. చదివిస్తే బాగుపడతాడని అనుకుంటే ప్రాణాలు పోగొట్టుకుండు..అంటూ సాహిల్ తల్లి అనిత గుండెలవిసేలా రోదించింది. అత్తాపూర్ ముష్క్ మహల్ ప్రాంతానికి చెందిన సాహిల్ దీపక్ సుతార్ (18) చిన్నతనంలోనే అతడి తండ్రి మృతి చెందాడు. తల్లి అనిత స్థానికంగా చిన్నచిన్న పనులు చేస్తూ జీవిస్తోంది. అనిత ఇద్దరు కొడుకుల్లో పెద్ద కుమారుడు డిగ్రీ చదువుతుండగా, సాహిల్ ఇంటరీ్మడియట్ చదువుతున్నాడు. కుమారుడి మృతితో ఆమె తల్లడిల్లిపోయింది. సీఎం రేవంత్ విచారం కొండపోచమ్మ సాగర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. యువకులు గల్లంతైన విషయం తెలియగానే గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలకు ఆయన ఆదేశించారు. అనంతరం యువకుల మరణవార్త తెలుసుకొని దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. యువకుల మృతి కలిచి వేసింది:హరీష్‌రావు కొండపోచమ్మ సాగర్‌లో యువకుల మృతి తనను కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలిచి వేసిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అరరే... ఇట్లయితే ఎట్లా!
‘మడిసన్నాక కాస్త కళాపోషణే కాదు కాస్తో కూస్తో జనరల్ నాలెడ్జ్ కూడా ఉండాలి’ అనిపిస్తుంది ఈ వైరల్ వీడియోను చూస్తే. ‘మన జాతిపిత ఎవరు?’ అనే ప్రశ్నకు ఎంతోమంది యంగ్‌స్టర్స్ చెప్పిన జవాబులు ‘అయ్ బాబోయ్’ అనిపిస్తాయి. ‘మా జాతిపిత సర్దార్ వల్లభ్‌భాయి పటేల్’ అని సమాధానం చెప్పింది ఒక అమ్మాయి. మరో అమ్మాయి... ‘నరేంద్ర మోదీ’ అని చెప్పి నాలుక కర్చుకొని ‘కాదు...కాదు...నిజంగా చె΄్పాలంటే ఐ హ్యావ్ నో ఐడియా’ అన్నది. ‘నాకు తెలుసు గానీ మీరు సడన్‌గా అడిగే సరికి గుర్తు రావడం లేదు’ అని నైస్‌గా తప్పించుకున్నారు ఒకరు. -
ఉపాధికి వెళ్తూ.. మృత్యులోకాలకు!
ఉండ్రాజవరం: జీవనోపాధి కోసం బయలుదేరిన వారు.. అట్నుంచి అటే మృత్యులోకాలకు చేరుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామానికి చెందిన యల్లమిల్లి రవికుమార్ (38), పోలుమాటి శ్రీను (37), చోరపల్లి వీరబాబులు నాటుకోళ్లకు గాబులు (మెష్ గాబులు) కడుతూంటారు. ఫోన్లో ఆర్డర్లు బుక్ చేసుకుని ట్రక్ ఆటోలో మెష్‌లు వేసుకుని, ఆర్డర్లు ఇచ్చిన ప్రాంతానికి వెళ్లి నాటు కోళ్లకు గాబులు కడతారు. తద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇదేవిధంగా సోమవారం ఈ ముగ్గురూ ట్రక్ ఆటోలో మెష్‌లు పట్టుకుని బాపట్ల జిల్లా రేపల్లె మండలంలోని చుట్టుపక్కల గ్రామాలకు బయలుదేరారు. అర్ధరాత్రి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామం వద్ద 216 జాతీయ రహదారిపై వారి ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్, శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వీరబాబు విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. రెక్కడితేనే కానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. మృతులు రవికుమార్, శ్రీను వివాహితులు, ఇద్దరికీ చెరో ఇద్దరు చొప్పున పిల్లలున్నారు. రవికుమార్, శ్రీను మృతితో కుటుంబ సభ్యులతో పాటు భార్య, పిల్లలు రోదిస్తున్నారు. అందరితోనూ ఆప్యాయంగా ఉండే వారు.. ఈ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామస్తులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
యువతనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి - ఇలా చేయాల్సిందే అంటూ..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి 3వన్4 (3one4) క్యాపిటల్ పాడ్‌కాస్ట్ 'ది రికార్డ్' ఫస్ట్ ఎపిసోడ్లో యువతను ఉద్దేశించి.. భారత ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడాలంటే, ఇతర దేశాలతో పోటీ పడాలంటే ఏం చేయాలనే విషయాలను వెల్లడించారు. గత రెండు మూడు దశాబ్దాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీ పడాలంటే యువత తప్పకుండా వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఇండియాలో పని ఉత్పాదకత ప్రపంచంలోనే చాలా తక్కువగా ఉందని, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ చేసినట్లు భారతీయ యువకులు ఎక్కువ గంటలు పనిచేయాలని వెల్లడించారు. ఇదీ చదవండి: టెస్లాకు క్లారిటీ ఇచ్చిన కేంద్రం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే? ప్రభుత్వంలో అవినీతి కూడా తగ్గించాలని, పని గంటలు పెంచాలని ఆలా జరగకపోతే పురోగతి సాధించిన దేశాలతో పోటీ భారత్ పోటీ పడటం సాధ్యం కాదని అన్నారు. తప్పకుండా దీని గురించి యువత ఆలోచించాలి, ప్రతి జర్మన్ దేశ అభివృద్ధి కోసం తప్పనిసరిగా అదనపు పని చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదే భారతీయులు కూడా పాటించాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మన టీ, సమోసాకు ఆ దేశంలో యమా క్రేజ్..! విజయసాయి రెడ్డి ట్వీట్
లండన్: సాయంత్రమయ్యేసరికి వేడి వేడి సమోసా తిని, పొగలు గక్కే టీ ఒక కప్పు లాగిస్తే ఎలాగుంటుంది. ఆ కాంబినేషన్ ఇచ్చే కిక్కు వేరుగా ఉంటుంది కదా. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన ఈ చాయ్, సమోసా కాంబినేషన్‌కి ఇప్పడు బ్రిటన్ యువతరంలో యమా క్రేజ్ పెరుగుతోంది. సాధారణంగా తెల్లవారు టీతో పాటు బిస్కెట్లు తింటారు. ఇప్పుడు వారి జిహ్వలు కొత్త రుచులు కోరుకుంటున్నాయని యునైటెడ్ కింగ్డమ్ టీ అండ్ ఇన్ఫ్యూజన్స్ అసోసియేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. వెయ్యి మందితో ఈ సర్వేని నిర్వహిస్తే సాయంత్రం స్నాక్‌గా గ్రానోలా బార్స్ (ఓట్స్‌తో చేసేది) చాలా బాగుంటుందని మొదటి స్థానం ఇచ్చారు. ఇక రెండోస్థానాన్ని మన సమోసా కొట్టేసింది. సర్వేలో పాల్గొన్న యువతరంలో 8 శాతం మంది సమోసాకి మొగ్గు చూపించారు. విజయసాయి రెడ్డి ట్వీట్ యూకే పేవరేట్ మెనూలో మన చాయ్, సమోసా చేరడంపై ట్విట్టర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బ్రిటన్ యువత తమ స్నాక్స్ లో స్వీట్లకు బదులు వీటికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. 16-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో సగానికిపైగా.. టీతో కలిపి స్వీట్ బిస్కెట్ రుచిని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. It is happy to note that tea and samosa have become favourite menu in UK. The young there prefer them instead of sweets as snacks. 16 to 24-year-olds are half as likely to enjoy a sweet biscuit with their tea as those over 55. #indianculture #foodie #uk #india pic.twitter.com/bRTlbIZq1W — Vijayasai Reddy V (@VSReddy_MP) January 23, 2023 -
మృత్యు ఒడిలోకి వెళ్లే ముందు...
-
Youth Pulse: మా టైమ్ బాగున్నది... బహు బాగున్నది! ఎందుకంటే!
ఇప్పుడు మనం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన నైమిష గురించి చెప్పుకుందాం. మూడు నెలల క్రితం తన పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య కేశవ్ స్మార్ట్‌వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. మొదట్లో అది తన ఫ్యాషన్ యాక్సెసరీలలో ఒకటి మాత్రమే. అయితే, తరువాత తరువాత అందులోని ఫీచర్లను ఉపయోగించడం ద్వారా తన జీవనశైలిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది నైమిష. ‘మొదట్లో టైమ్ చూసుకోవడానికి తప్ప స్మార్ట్‌వాచ్ వైపు చూసింది లేదు. ఒకరోజు తీరిక దొరికినప్పుడు స్మార్ట్‌వాచ్ వరల్డ్‌లోకి వెళ్లడం ద్వారా ఎన్నో వండర్ఫుల్ ఫీచర్స్ గురించి తెలుసుకొని ఉపయోగిస్తున్నాను. అయితే అవేమీ కాలక్షేపానికి సంబంధించినవి కావు. నా లైఫ్‌స్టైల్‌ను మెరుగుపరుచు కోవడానికి పనికొచ్చేవి’ అంటుంది నైమిష. పెద్దగా ఆసక్తి చూపించలేదు! కానీ ఇప్పుడు.. 2013లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం... స్మార్ట్‌వాచ్‌లు స్వీకరించడానికి యూత్ పెద్దగా ఆసక్తి చూపించలేదు! ‘స్మార్ట్ఫోన్లు ఉండగా, స్మార్ట్‌వాచ్‌లు దండగా’ అన్న వాళ్లే ఎక్కువ. ‘యూత్ ఆసక్తి, అనాసక్తులలో మార్పు రావడానికి ఎక్కువ కాలం పట్టదు’ అని అప్పుడే తేల్చారు ‘సెంటర్ ఫర్ ది డిజిటల్ ఫ్యూచర్’ డైరెక్టర్ జెఫ్రీ కోల్. అతడి అంచనాలు నిజం కావడానికి అట్టే కాలం పట్టలేదు. ఆ మధ్య ఇండోనేసియాలో నిర్వహించిన సర్వేలో యువతలో అత్యధికులు స్మార్ట్‌వాచ్‌లను మెచ్చుకున్నారు. అవి తమకు ఎలా ఉపయోగపడుతున్నదీ చెప్పుకొచ్చారు. నిజానికి ఇది ఇండోనేసియా పరిస్థితి మాత్రమే కాదు ఇండియా పరిస్థితి కూడా. ఎప్పటికప్పుడూ యూత్ అభిప్రాయాలను సేకరించడం ద్వారా కంపెనీలు తమ మార్కెటింగ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీని అభివృద్ధి చేసుకుంటూ కొత్త ఫీచర్స్‌ను తీసుకువచ్చాయి. తీసుకువస్తున్నాయి. జీవనశైలిలో భాగంగా.. స్టైలిష్ లుక్ ఇవ్వడంతోపాటు ఫిట్నెస్ ట్రాకింగ్(కేలరీలు, ఎక్సర్సైజ్ మినిట్స్, స్టాండింగ్), వర్కవుట్ ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, అబ్నార్మల్ హార్ట్రేట్స్ను హెచ్చరించడం, డిస్ ప్లే టికెట్స్, బోర్డింగ్ పాసెస్, టర్న్–బై–టర్న్, అలారమ్స్, టైమర్స్, రిమైండర్స్, ‘డోన్ట్ డిస్టర్బ్’ అని తెలియజేసే ఫోకస్మోడ్, షేర్ ఫోటో ఆప్షన్... ఇలా ఎన్నో విషయాల్లో స్మార్ట్‌వాచ్‌లు యువతరానికి ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి రంగు, డిజైన్ల విషయంలో ఆసక్తి చూపే యువతరం ఇప్పుడు బరువు విషయంలోనూ అంతే ఆసక్తి ప్రదర్శిస్తోంది. కొత్త వాచ్ మార్కెట్లోకి రాగానే ‘కీ స్పెసిఫికేషన్’ జాబితాలో వాచ్ బరువు ఎన్ని గ్రాములో చూడడం అనేది ఇప్పుడు యువతరం తొలి ప్రాధాన్యతగా మారింది. పోటీలో భాగంగా యూత్‌ని ఆకట్టుకోవడానికి కంపెనీలు వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. తాజా విషయానికి వస్తే న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 సిరీస్‌కు సంబంధించి బయోయాక్టివ్ సెన్సర్లతో కూడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి ప్రకటించింది కంపెనీ. గెలాక్సీ ఎన్నో సంవత్సరాలుగా స్లీప్ టెక్నాలజీపై పని చేస్తోంది. ఎందుకంటే, నిద్రకు సంబంధించిన నిబంధనలు గాలికి వదిలేస్తుంటారు యువతరంలో ఎక్కువమంది. అలాంటి వారికి నిద్రకు సంబంధించిన ఆరోగ్యకరమైన పద్ధతులు అలవాటు చేయడానికి ఇలాంటి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ప్రయోగాలు, ఆవిష్కరణలు కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగమే అయినప్పటికీ వాటి వల్ల యువతరానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇది మంచి విషయమే కదా! చదవండి: గ్యాస్ వల్ల కావచ్చని తేలిగ్గా తీసుకున్నాను కానీ! కీమో థెరపీ తీసుకుంటూనే రన్నర్‌గానూ! -
International Youth Day 2022: చైతన్యతరంగాలు.. ఈ ప్రపంచమే నా ఊరు!
‘నా ఊరే నా ప్రపంచం’ అనే పరిమిత భావనకు భిన్నంగా– ‘ఈ ప్రపంచమే నా ఊరు’ అంటూ వివిధ రకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేస్తుంది యువతరం... నిధి మయూరిక బెంగళూరుకు చెందిన నిధి మయూరికకు చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి. పదకొండు సంవత్సరాల వయసులోనే ‘ఆస్ట్రోబయోలజీ’ చదవడం మొదలుపెట్టింది. 2016లో నాసా ఏమ్స్ స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్‌లో పాల్గొంది. ‘సైకతం’ పేరుతో డిజైన్ చేసిన త్రీ లెవెల్ స్పేస్ కాలనీ, ఆ తరువాత రూపొందించిన ‘స్వస్తికం’.. ‘సొహం’ డిజైన్లు మొదటి బహుమతి గెలుచుకున్నాయి. ఈ బహుమతులతో సైన్స్‌పై తన ఆసక్తి రెట్టింపు అయింది. గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టింది. స్పేస్సైన్స్ను ప్రమోట్ చేయడానికి రకరకాలుగా కృషి చేస్తున్న సొసైటీ ఫర్ స్పేస్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌లో టీమ్‌లీడర్‌గా పనిచేస్తుంది నిధి. యూఎన్ ఉమెన్ ఇండియా సొసైటీ ఫర్ స్పేస్‌లాంటి ఆర్గనైజేషన్లలోని యంగ్ లీడర్స్‌తో కలిసి పనిచేస్తోంది. జెండర్–సెన్సిటివిటీ ప్రకటనలు, సినిమాలు, సాహిత్యంలో ఉదాత్తమైన మహిళల పాత్రలు, స్త్రీల హక్కులు...ఇలా ఎన్నో విషయాల గురించి అనర్గళంగా మాట్లాడగలదు నిధి. ‘నేను పయనిస్తున్న దారిపై నమ్మకం ఉంది. నేను ఆశావాదిని. మార్పు త్వరలోనే సాధ్యపడుతుందని నమ్ముతున్నాను’ అంటున్న నిధి మయూరిక ‘ఐయామ్ జనరేషన్ ఈక్వాలిటీ’ అని నినదిస్తోంది. పాత, కొత్తతరం అనే తేడా లేకుండా అందరం ఎడ్యుకేట్ కావాలి అంటుంది నిధి మయూరిక. దేవిష్ ఝా 19 సంవత్సరాల దేవిష్ ఝా హైస్కూల్లో చదివేరోజుల నుంచే ఇంటర్నేషనల్ క్లైమెట్ ఆర్గనైజేషన్ ‘జీరో అవర్’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. పర్యావరణ విధ్వంసం గురించి బాధపడుతూ కూర్చోవడం కంటే ఈతరం, భవిష్యత్తరాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించాలి అంటుంది దేవిష్. ‘ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయకార్యక్రమాల్లో పాల్గొనాలి. జీరో అవర్లాంటి అంతర్జాతీయ సంస్థల గురించి ప్రచారం చేయాలి. వాతావరణంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటికి సంబంధించిన సమాచారాన్ని ఫ్రెండ్స్, కుటుంబసభ్యులతో పంచుకోవాలి... ఇవి క్లైమెట్ యాక్టివిస్ట్ ప్రధానబాధ్యతలు’ అంటుంది దేవిష్. ‘యువతరంలో ప్రతి ఒక్కరికీ సంకల్పబలం ఉంది. బలమైన గొంతుక ఉంది. అది సామాజిక మార్పుకు ఉపయోగపడాలి’ అంటుంది దేవిష్. ఈతరం ప్రతినిధులందరూ సుందర భవిష్యత్ నిర్మాణానికి తమవంతుగా కృషి చేయాలని అంటుంది 23 సంవత్సరాల అవని అవస్తి. అంటార్కిటికా యాత్రకు అవకాశం వచ్చినప్పుడు తన వయసు 18 సంవత్సరాలు. తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. ‘అక్కడి వాతావరణం తట్టుకోవడం కష్టం. నువ్వు ఏమైనా అబ్బాయివా! ఈ డబ్బును నీ పెళ్లి కోసం బ్యాంకులో పొదుపు చేస్తే మంచిది’ అన్నారు. ఇలాంటి సంఘటనలు తన ఉత్సాహాన్ని నీరుగార్చలేకపోయాయి. అంటార్కిటికాలో దేశదేశాల నుంచి వచ్చిన యువతరంతో మాట్లాడే అవకాశం అవనికి లభించింది. ఎన్నో విషయాలు తెలుసుకునేలా చేసింది. విస్తృతప్రపంచాన్ని దర్శించినట్లు అనిపించింది. ‘రీసైకిల్ ఆర్మీ’ ద్వారా రీసైకిలింగ్, జలసంరక్షణ....మొదలైన విషయాలపై విస్తృత ప్రచారం చేసిన అవని– ‘వయసుతో నిమిత్తం లేకుండా అన్ని తరాల వాళ్లు పర్యావరణ పరిరక్షణకు తమవంతు ఆలోచన చేయాలి. ఆచరించాలి’ అంటుంది. త్రిష శెట్టి.. ‘షీ సే’ ముంబైకి చెందిన త్రిష శెట్టి ‘షీ సే’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా స్త్రీ చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్త్రీల భద్రతపై ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘ఆన్లైన్లో బార్ల గురించి సమాచారం వెదికితే క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. బాధితులకు సంబంధించిన సమాచారం మాత్రం కనిపించదు’ అంటున్న త్రిష బాధితులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఐక్యరాజ్య సమితి ‘యంగ్ లీడర్స్’ జాబితాలో చోటు సంపాదించిన త్రిష శెట్టి ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ సదస్సులలో పాల్గొనడం ద్వారా తన ఉద్యమ కార్యచరణకు పదును పెడుతుంది. ..... రకరకాల సామాజిక అంశాలపై అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కలిసి పనిచేస్తున్న యువతరంలో వీరు కొందరు మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారికి ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం. చదవండి: సమ గౌరవమే సరైన రక్ష -
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25వ తేది పల్లవోలు సమీపంలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం అపూర్వ కల్యాణ మండపంలో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 4లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 42వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జిల్లాకు అనేక పరిశ్రమలు వస్తున్నాయని, బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ కంపెనీ రూ.1000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోందన్నారు. కొప్పర్తి పారిశ్రామిక వాడలో రూ.800 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, 15 కంపెనీలు ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయన్నారు. ఈనెల 25వ తేదీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో సీబీఐటీలో నిర్వహించే జాబ్‌మేళాలో 250 కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. పదవ తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివిన నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఒకరు ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు రామమోహన్‌రెడ్డి, రాణాప్రతాప్, నాగేంద్ర, దత్తసాయి, రహీమ్, యల్లారెడ్డి, షఫీ పాల్గొన్నారు. -
'ముందు అమలు చేసి, తర్వాత ఆలోచించండి': బీజేపీ నేత
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి చెందిన వరుణ్ గాంధీ కేంద్రం వైఖరిపై విరుచుకుపడ్డారు. ఈ పథకాన్ని పరిగణలోనికి తీసుకునే ముందే వివిధ కోణాలను పరిగణలోనికి తీసుకులేదంటూ ఆరోపణలు చేశారు ఎటువంటి ముందుచూపు లేకుండా కొత్త పథకాన్ని తీసుకు వచ్చేసి...వ్వతిరేకత మొదలయ్యాక మళ్లీ పునరాలోచించడం వంటివి కొన్ని సున్నితమైన అంశాల్లో పనికి రాదంటూ ప్రభుత్వం పై మండిపడ్డారు. సాయుధ బలగాలు, భద్రతకు సంబంధించి యువత విషయానికి వస్తే...సాయుధ దళాల్లోని యువకులకు సైనికులుగా స్వల్పకాలిక ఉపాధి కల్పించడమే ఈ పథకంలో తీసుకొచ్చిన సరికొత్త మార్పు అని చెప్పారు. ఐతే ఈ పథకం ద్వారా ముఖ్యంగా 75 శాతం మందినే రిక్రూట్ చేసుకుంటారని చెప్పారు.. పైగా నాలుగేళ్లు మాత్రమే పనిచేస్తారని, ఆ తర్వత సాధారణ సైనికుల మాదిరి ఎటువంటి ప్రయోజనాలను పొందలేరని తెలిపారు. దీంతో యువత ఆందోళనలు చేపట్టిందన్నారు. ఐతే యువత చేస్తున్న ఆందోళనలను అణిచివేసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగానే నిరసనలు హింసాత్మకంగా మారాయన్నారు. 'अग्निपथ योजना' को लाने के बाद महज कुछ घंटे के भीतर इसमें किए गए संशोधन यह दर्शाते हैं कि संभवतः योजना बनाते समय सभी बिंदुओं को ध्यान में नहीं रखा गया। जब देश की सेना, सुरक्षा और युवाओं के भविष्य का सवाल हो तो ‘पहले प्रहार फिर विचार’ करना एक संवेदनशील सरकार के लिए उचित नहीं। — Varun Gandhi (@varungandhi80) June 18, 2022 (చదవండి: అగ్నిపథ్ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్) -
చిన్న వయసుసులోనే గుండెపోటు మరణాలు.. ఎందుకు?
మొన్న కన్నడ సినీహీరో పునీత్ రాజ్ కుమార్.. నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి.. తాజాగా గాయకుడు కేకే.. గుండెపోటు కారణంగా చిన్న వయసులోనే మరణించిన వారు వీరందరూ! ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... పైన ఉదహరించిన వారంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపేవారే. నిత్యం వ్యాయామాలు చేస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకునే వారే. అయినా సరే చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. కారణాలేమైనా... ఈ ఘటనల సారాంశం ఒక్కటే! అది ఆరోగ్యంపై పురుషులు మరింత శ్రద్ధ వహించాలని. అంతర్జాతీయ పురుషుల ఆరోగ్య వారోత్సవాల (జూన్ 13 – 19)నేపథ్యంలో ఆహారం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని పొందడం ఎలాగో చూద్దాం... ప్రొటీన్ మోతాదు పెంచండి... మనం తినే ఆహారం.. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు. ప్రతీదీ తగు మోతాదులో అవసరం. ఆహార అలవాట్ల ప్రకారం మనం కార్బోహైడ్రేట్లను ఎక్కువగా తీసుకుంటాం. ఇలా కాకుండా... భోజనంలో ఎంతో కొంత ప్రొటీన్లను కూడా తీసుకోగలిగితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఉడికించిన కోడిగుడ్లు మొదలుకొని పన్నీర్, పరాఠా, చేపలు, రాజ్మా, సాంబార్, బీన్స్, సోయా పులావ్ వంటి వెజ్/నాన్‌వెజ్ ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన ప్రొటీన్ లభిస్తుంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రమాణాల ప్రకారం ప్రతి భారతీయుడు రోజుకు కనీసం 48 గ్రాముల ప్రొటీన్‌ను తీసుకోవడం అవసరం. ఇంకోలా చెప్పాలంటే ప్రతి కిలోగ్రాము బరువుకు ఒక గ్రాము ప్రొటీన్ అవసరమవుతుంది. అయితే నూటికి 80 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువ ప్రొటీన్ తీసుకుంటున్నారు. కండరాలు బలోపేతమయ్యేందుకు మాత్రమే కాకుండా... రోగ నిరోధక శక్తిని పెంచేందుకూ, ఒత్తిడికి విరుగుడుగా పనిచేసే సెరటోనిన్ ఉత్పత్తికీ ప్రొటీన్ అత్యవసరమన్న విషయం పురుషులు గుర్తించాలి. ఐదారు సార్లు పండ్లూ, కాయగూరలు! మెరుగైన ఆరోగ్యం కోసం కాయగూరలు, పండ్లు అవసరం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అందేందుకు ఇదే మేలైన దారి. జాతీయ పోషకాహార సంస్థ అంచనాల ప్రకారం రోజు కనీసం 400గ్రాముల కాయగూరలు, పండ్లు తినాల్సి ఉండగా.. చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవడం లేదు. వీటిలోని పీచు పదార్థం జీర్ణకోశం మెరుగ్గా పనిచేసేందుకు, యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తాయి.ఏ కాయగూరనైనా ఏదో ఒక రూపంలో శరీరానికి అందివ్వడం మేలు. మితమే.. హితం! ఎంత తింటే అంత బలం కాదు.. మితమే హితమకోవాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పక పాటించాలి. చక్కెర, ఉప్పు, కొవ్వులు ఉన్న ఆహారం విష యంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. నోరు కుట్టేసుకుని ఉండటం ఎలా అనిపిస్తే... అన్ని రకాల ఆహారాన్ని కొంచెం కొంచెం తీసుకుంటే సరి. పాల ఉత్పత్తులు... పాల ఉత్పత్తుల వాడకంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రోజూ వాడాలని కొందరు, అవసరమే లేదని కొందరు చెబుతారు. పెరుగు, మజ్జిగల రూపంలో తీసుకునే విషయంలో మాత్రం ఎవరికీ అభ్యంతరాలు లేవు. అయితే ఎంత మోతాదులో అన్నది ఒక ప్రశ్న. నిపుణులు చెప్పిన దాని ప్రకారం రోజుకు ఏదో ఒక రూపంలో కనీసం 300 మిల్లీలీటర్ల పాలు/పాల ఉత్పత్తులు శరీరానికి అందించడం మేలు. చిరుతిళ్లతోనూ చిక్కులు.. సాయంత్రం చిరుతిళ్లు తినాలనిపించడం సహజం. అలాంటి సందర్భాల్లో నూనె పదార్థాలు కాకుండా.. మొలకెత్తిన గింజలు, ఉడికించిన శనగలు, వేరుశనగ పప్పుల్లాంటివి తినడం మేలు. వీటివల్ల శరీరానికి శక్తి, ప్రొటీన్లు రెండూ లభిస్తాయి. ఉప్పుతో ముప్పు... ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని చదువుతూనే ఉన్నాం. రోజుకు ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దు. కానీ.. చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు. శుద్ధీకరించిన ఆహారంలో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి... వాటిని వీలైనంత తక్కువగా తీసుకోవడం మేలు. ఈ ఆహారపు అలవాట్లకు తోడుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. నలభై ఏళ్లు దాటిన తరువాతైనా తరచూ వైద్య పరీక్షలు చేసుకోవడం ద్వారా పురుషులు ఆకస్మిక మరణాలను కొంతవరకైనా నివారించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ప్రతి రోజు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు..అయినా!
సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా మనిషి స్వతహాగా తయారు చేయలేని పదార్థాల్లో రక్తం అతిప్రధానమైనది. దేశ వ్యాప్తంగా ఉన్న 135 కోట్ల మందిలో అత్యవసర పరిస్థితుల్లో ఏటా ఐదు కోట్ల యూనిట్ల రక్తం అవసరపడుతుందని నిపుణుల అంచనా. అయితే రక్తదాతల నుంచి లభిస్తుంది మాత్రం సుమారు 50 లక్షల యూనిట్లు మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ప్రతి రోజు దాదాపు 12 వేల మంది రక్తకొరతతో చనిపోతున్నారు. గత దశాబ్దకాలంగా రక్తదానం పైన అవగాహనా కార్యక్రమాలు పెరిగినప్పటికీ రక్తదాతల నుంచి స్పందన మాత్రం రక్త అవసరాలను తీర్చడానికి అనుగుణంగా లేవన్నది వాస్తవ సత్యం. నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. -సాక్షి, హైదరాబాద్ రక్త నిల్వలు నిండుకున్నాయి... ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు, దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడుతున్న వారికి రక్తం అవసరపడుతుంది. తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి జీవితాంతం రక్తం ఎక్కించాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా తలసేమియా బాధితులు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నారు. రక్తదానం పై అపోహల వల్ల అవసరమైన స్థాయిలో రక్తదాతలు ముందుకు రావట్లేదని సర్వేలు పేర్కొంటున్నాయి. 18 సంవత్సరాలు నిండి 12.5 హిమోగ్లోబిన్ స్థాయితో 45 నుంచి 50 కిలోల బరువున్న ప్రతి ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తదానానికి అర్హుడు. ఇలా ఒక్కో వ్యక్తి 65 సంవత్సరాల వయస్సు నిండే వరకు రక్తదానం చేయవచ్చని అరోగ్య నిపుణులు నిర్ధారించారు. చదవండి: హైదరాబాద్: అక్కడ ట్రాఫిక్ జామ్.. ఇలా వెళ్లండి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయవచ్చు. 15 రోజలకు ఒక సారి ప్లాస్మా దానానికి ఆస్కారం ఉంది. ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చు. మొత్తంగా 85 శాతం పాజిటివ్ గ్రూప్, 15 శాతం నెగెటివ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ప్రధానంగా నెగెటివ్ గ్రూప్ వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతి 20 వేల మందిలో ఒకరు బాంబే బ్లడ్ గ్రూప్‌తో పుడుతున్నారు. ప్రభుత్వాలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు రక్తదాతల కోసం అవగాహనా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నప్పటికీ అవసరమైన స్థాయిలో రక్త నిధులను సమకూర్చలేకపోతున్నామని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. షుగర్, హెచ్ఐవీ, హెపటైటీస్, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు స్వచ్చంథంగా రక్తదానానికి ముందుకు రావాలని డాక్టర్లు సూచిస్తున్నారు. తరచు రక్తదానం చేసేవారికి గుండెపోటు, క్యాన్సర్ వంటి జబ్బులు దరిచేరవని మెడికల్ సర్వేలు నిర్థారిస్తున్నాయి. 258 సార్లు రక్తదానం చేశా... గత 22 సంవత్సరాల్లో 258 సార్లు రక్తదానం చేసి ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పాను. అంతేకాకుండా వ్యక్తిగతంగా, సోషల్‌మీడియా వేదిక ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 20 వేల మందికి సకాలంలో రక్తాన్ని అందించగలిగాను. సరైన సమయానికి రక్తం అందక ఒక వ్యక్తి చనిపోయారన్న వార్త తెలుసుకుని రక్తదానం చేయడం ప్రారంభించాను. రక్తదానంపై యువకుల ఆలోచనా విధానం మారాలి. యువకులు అధికంగా ఉన్న మన దేశంలో రక్తం అందక బాధితులు చనిపోవడం శోచనీయం. –డా.సంపత్ కుమార్, సామాజిక వేత్త, బంజారాహిల్స్. 12 వేల మందికి రక్తాన్ని అందించా. ఇప్పటి వరకు 116 సార్లు రక్తదానం చేశాను. పది సంవత్సరాల క్రితం నేను ప్రారంభించిన రెడ్ డ్రాప్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో 12 వేల మందికి రక్తాన్ని అందించగలిగాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 58 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశాను. రక్తదానం కోసం కృషి చేస్తున్న వారికి ఏటా సంస్థ ఆధ్వర్యంలో అవార్డులను ఇస్తున్నాము. –రెహమాన్, హైదరాబాద్. -
ఆరు నెలల పాటు సినిమాలు, వాట్సాప్ చూడకండి: కేటీఆర్
సాక్షి, మేడిపల్లి(హైదరాబాద్): తల్లిదండ్రులను సంతోషపెట్టేలా యువత తమ భవిష్యత్‌కు ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పీర్జాదిగూడ బుద్ధానగర్ సాయిబాబా టెంపుల్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90 వేల పైలుకు పోస్టులను ప్రభుత్వం ప్రకటించందన్నారు. అభ్యర్థులు ఆరు నెలల పాటు సినిమాలు, ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, క్రికెట్ చూడడం తగ్గించుకోవాలని సూచించారు. సెంటర్లో ప్రొజెక్టర్‌ను ప్రారంభిస్తున్న కేటీఆర్ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మంత్రి చామకూర మల్లారెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డిని అభినందించారు. 20 సంవత్సరాలు అనుభవిజ్ఞులైన అధ్యాపకులచే కోచింగ్ సెంటర్లో 3 నుంచి 4 నెలలు పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఉచిత మెటీరియల్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందజేస్తున్నట్లు తెలిపారు. పోటీ తత్వంతో గట్టిగా చదివితే ఉద్యోగం వస్తుందని భరోసానిచ్చారు. చదవండి: హైదరాబాద్: ఫలించిన యాభై ఏళ్ల కల! Live: Speaking after inaugurating a Govt Coaching Center in Peerzadiguda Municipal Corporation https://t.co/dXWgZpeKZT — KTR (@KTRTRS) March 14, 2022 టీఎస్ ఐపాస్ ద్వారా 19 వేల పరిశ్రమలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. 13 వేల పరిశ్రమల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా మరో 6వేల పరిశ్రమలు ప్రారంభం కానున్నాయన్నారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ హరీష్, జిల్లాపరిషత్ చైర్మన్ మలిపెద్ధి శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ధి సుధీర్‌రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
మోదీ సర్కారుకు మరోసారి ప్రశ్నాస్త్రాలు
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మరోసారి మోదీ సర్కారుపై ప్రశ్నాస్త్రాలు ఎక్కుపెట్టారు. యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు లేవని, వారు ఎంతకాలం ఎదురు చూడాలని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాలే లేవు. ఒకవేళ అవకాశం వస్తే పేపర్ లీక్ అవడం, ఎగ్జామ్ పెట్టినా ఫలితాలు ప్రకటించకపోవడం, లేదంటే ఏదో స్కామ్ కారణంగా క్యాన్సిల్ కావడం జరుగుతోంది. 1.25 కోట్ల మంది యువకులు రైల్వే గ్రూప్ డి ఉద్యోగ ఫలితాల కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ విషయంలోనూ అదే పరిస్థితి. భారతదేశంలోని యువత ఎప్పటి వరకు ఓపిక పట్టాలి?’ అని వరుణ్ గాంధీ ట్విటర్ వేదికగా కేంద్రాన్ని నిలదీశారు. ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (UPTET)ని రద్దు చేస్తూ గత నెలలో యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వరుణ్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్ష పేపర్ లీక్ అయినట్టు వార్తలు రావడంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. (చదవండి: మేము లేకుండా బీజేపీని ఓడించలేరు) ‘యూపీ టెట్ పరీక్ష పేపర్ లీక్ అనేది లక్షలాది మంది యువత భవిష్యత్తుతో ఆడుకోవడం లాంటిది. కిందిస్థాయి అధికారులపై చర్య తీసుకోవడం ద్వారా దీనిని అడ్డుకోలేము. విద్యా మాఫియా, వారిని పోషిస్తున్న రాజకీయ నాయకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. చాలా విద్యాసంస్థలు రాజకీయ పలుకుబడి కలిగిన వారి ఆజమాయిషిలో ఉన్నాయి. వాటిపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారు?’ అని వరుణ్ గాంధీ ప్రశ్నించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కూడా ఆయన గళం వినిపించిన సంగతి తెలిసిందే. (చదవండి: గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనించటం లేదు) -
యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..
ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు. (చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!) అయితే శ్రవణ్ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు. (చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!) -
యువతలో ఇడియట్స్.. గూగుల్‌నే నమ్ముతున్న వైనం!
లబ్బీపేట (విజయవాడతూర్పు): యువత, విద్యావంతుల్లో ఇడియట్స్ పెరిగిపోతున్నారు. ఇడియట్ అంటే తిట్టు కాదు. ఇంటర్నెట్ డెరీవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న వారని అర్థం. వీరిని డాక్టర్ గూగుల్‌గా కూడా పిలుస్తారు. వారికి ఏదైనా జబ్బు చేస్తే, ఆ లక్షణాలను గూగుల్‌లో సెర్చ్ చేసి జబ్బు, దానికి చికిత్స ఏమిటో తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ వద్దకు వెళ్లి, తనకు ఫలానా జబ్బు అని, చికిత్స చేయాలని అడుగు తారు. జబ్బు లక్షణాలు ఏమిటో చెప్పాలని అడిగితే, తాను గూగుల్‌లో పరిశీలించి, తెలుసుకున్నానంటూ బదులిస్తారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు ఇలాంటి వారు ఎక్కువగా వస్తున్నారు. డాక్టర్ మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో శోధిస్తున్నారు. అక్కడ ఆ ముందుకు సంబంధించి ఏవైనా దుష్ఫలితాలు ఉంటా యని పేర్కొంటే, వాడకుండా మానేస్తున్నారు. డాక్టర్ల వద్దకు వస్తున్న 100 మంది చదువుకున్న వారిలో 60 శాతం మంది డాక్టర్ చీటీలోని మందుల సమాచారం కోసం గూగుల్‌లో శోధిస్తున్నారు. మరో 15 శాతం మంది ఇడియట్సేనని వైద్యులు పేర్కొంటున్నారు. చదవండి: కన్నతండ్రే కాలయముడు.. ఆస్తిలో వాటా.. కొత్త సమస్యలు కొని తెచ్చుకోవడమే.. ప్రతి విషయాన్నీ గూగుల్‌లో శోధించడం ద్వారా కొత్త సమ స్యలను కొని తెచ్చుకుంటున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మందులు, జబ్బు విషయంలో సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో చూడటం సరైన విధానం కాదని పేర్కొంటున్నారు. ఒక మందు వాడిన వారిలో లక్ష మందిలో ఒకరికి దుష్ఫ లి తాలు వచ్చినా, గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రతి మందు గురించీ గూగుల్‌లో శోధించడం సరికాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. డాక్టర్ గూగుల్‌గా మారిన వైనం ఇప్పుడు కొంత మంది ఏదైనా జబ్బు చేస్తే, గూగుల్‌లో శోధించి సొంతగా మందులు వాడేస్తున్నారు. మందులను కూడా ఆన్లైన్లోనే తీసుకుంటున్నారు. అది సరి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జబ్బుకు చికిత్స సరిగ్గా జరగక పోతే ప్రాణాల మీదకు వస్తుందని పేర్కొంటున్నారు. గూగుల్ డాక్టర్‌గా మారిన వారు కూడా ఇడియట్ అనే సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు గుర్తించాల్సి ఉందన్నారు. రోగి వ్యవహారశైలి, మానసిక పరిస్థితిని కుటుంబ సభ్యులు అంచనా వేయాల్సి ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని రకాల మానసిక జబ్బులు, సెక్స్ సామర్థ్యం పెరిగేందుకు వాడే వయగ్రా వంటి వాటి గురించి కూడా ఎక్కువగా గూగుల్‌లో శోధిస్తున్నారని వివరించారు. చదవండి: అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ -
కూకట్పల్లి: మందులోకి నీళ్లు ఇవ్వాలంటూ..
సాక్షి, కేపీహెచ్‌పీకాలనీ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు హల్చల్ చేసిన ఘటన కేపీహెచ్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్‌పీకాలనీలోని పెట్రోల్ బంక్ సమీపంలో ప్రధాన రహదారిపై సోడాలు అమ్ముకునే వ్యక్తి వద్దకు ఆదివారం రాత్రి ఇద్దరు యువకులు ఇన్నోవా వాహనంలో వచ్చారు. మద్యంలో కలుపుకొనేందుకు నీళ్లు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. దీంతో సోడాలు అమ్ముకునే వ్యక్తి నీరు ఇచ్చేందుకు నిరాకరించాడు. కోపోద్రిక్తులైన ఆ యువకులు సోడా బండిలోని సోడాలు, మంచినీటి డబ్బాను కింద పడేశారు. ఆ ఇద్దరు యువకుల్లో ఒకరు తాను పోలీస్ అధికారి కొడుకునంటూ ఇన్నోవా వాహనం సైరన్ మోగించి భయభ్రాంతులకు గురి చేయగా, సోడాలు అమ్మే వ్యక్తి 100కు డయల్ చేశారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని అరుణ్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఓ పోలీస్ అధికారి కుమారుడు కాగా, అరుణ్ డాక్టర్. వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లి చూపుల కోసం కారు తీసుకెళ్లి.. -
‘నాకెందుకు వ్యాక్సిన్.. ఇంకో పదేళ్లు బతుకుతా’
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ మార్చి 1 (సోమవారం) ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కంటే యువతకు అందిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరు వ్యాక్సిన్ తీసుకుంటారా అని ప్రశ్నించగా.. తాను మరో పది, పదిహేనేళ్లు బతుకుతానని.. ఇప్పుడు వ్యాక్సిన్ తనకెందుకని పేర్కొన్నారు. యువతకు జీవిత కాలం ఎక్కువ ఉందని, వారికి ముందుగా టీకా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. చివరికి తను కూడా వ్యాక్సిన్ తీసుకుంటానని బదులిచ్చారు. అదే విధంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను ఖర్గే అభినందించారు. అయితే అలాంటి విజయాన్ని రాజకీయ లబ్ది కోసం ఉపయోగించరాదన్నారు. దేశంలో బీజేపీ విభజించు-పాలించు సూత్రాన్ని పాటిస్తోందని, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొట్టాలనే ఉద్ధేశ్యంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని దుయ్యబట్టారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్ తీసుకున్న నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన మాటలు పరోక్షంగా మోదీపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం కోవిడ్ తొలి టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌పై వదంతులు ప్రచారం చేస్తున్న వేళ.. ప్రధాని మోదీ కొవాగ్జిన్ డోసు తీసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ప్రధాని మోదీ ఒక రూపాయి జీతం.. సీఎంకు ప్రధాన సలహాదారుగా పీకే విద్యార్థులతో రాహుల్ గాంధీ స్టెప్పులు : వైరల్ -
పాతబస్తీ యువకుల షాన్ పహిల్వాన్..!
సాక్షి, చాంద్రాయణగుట్ట: దేశంలో ఎక్కడ కుస్తీ పోటీలు జరిగినా పాతబస్తి పహిల్వాన్లు సత్తాచాటుతున్నారు. తరాలు మారినా కుస్తీ పోటీల సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బార్కాస్, ఎర్రకుంట పరిసరాల్లో ఎటు చూసినా పహిల్వాన్లే దర్శనమిస్తుంటారు. పహిల్వాన్‌గా తయారు కావడానికి ఇక్కడి యువకులు ఎంతో ఉత్సాహం చూపుతుంటారు. ఉన్నత విద్యావంతులు సైతం ‘సై’ అంటుంటారు. ఇందుకు గాను ప్రతిరోజు గంటల తరబడి దంగల్లలో కఠోర శ్రమ చేస్తారు. బాల కేసరి, హైదరాబాద్ కేసరీ, రుస్తానా ఏ డక్కన్, రాజీవ్‌గాంధీ కేసరీ, సాలార్ కేసరీ, ఆంధ్ర కేసరి తదితర పురస్కారాలు దక్కించుకుంటున్న బార్కాస్ పహిల్వాన్లు కుస్తీ పోటీలకు ఇంకా ప్రాధాన్యం తగ్గలేదని నిరూపిస్తున్నారు. బార్కాస్ ప్రాంతానికి చెందిన కాలేద్ బామస్, అబ్దుల్లా బిన్ గౌస్, మహ్మద్ బిన్ గౌస్ ఆంధ్ర కేసరీ టైటిళ్లను సాధించారు. ఖాలేద్ బిన్ అబ్ధుల్లా మహరూస్, హబీబ్ అబ్ధుల్లా అల్ జిలానీ, అబ్దుల్లా బిన్ గౌస్, మహ్మద్ బిన్ ఉమర్ యాఫై అలియాస్ మహ్మద్ పహిల్వాన్, మహమూద్ ఖాన్ తదితర ప్రముఖ పహిల్వాన్లు బార్కాస్ ప్రాంతానికి చెందిన వారే కావడం గమనార్హం. నేటికీ అదే ఆదరణ ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మల్లయోధులకు ప్రజాదరణ ఎక్కువే. రాజుల కాలంలో కుస్తీ పోటీలను ప్రత్యేకంగా నిర్వహించే వారు. ప్రస్తుతం రాజ్యాలు..రాజులు లేకున్నా...కుస్తీ పోటీలకు ఆదరణ తగ్గలేదు. బార్కాస్‌లో మల్లయోధులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిని ‘ పహిల్వాన్లు’గా పిలుస్తారు. పహిల్వాన్లకు శిక్షణ ఇచ్చేవారిని ‘వస్తాద్’ లు అంటారు. బార్కాస్‌లో మల్లయోధులకు శిక్షణ ఇచ్చే అకాడాలు(తాలీం) ఉన్నాయి. ఐదేళ్ల వయస్సు నుంచి వీటిలో శిక్షణ పొందవచ్చు. ఇక్కడి అకాడాలలో శిక్షణ పొందిన వారు నగరంలోనే కాక డిల్లీ, మహారాష్ట్ర, సంగ్లీ, జంషెడ్పూర్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో నిర్వహించి కుస్తీ పోటీల్లో సత్తా చాటారు. ఆంధ్ర కేసరి నుంచి స్థానికంగా నిర్వహించే కేసరీలలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఉదయం 4.30 గంటల నుంచే.. ఉదయం 4.30 గంటల నుంచే పహిల్వాన్లు వ్యాయామాన్ని ప్రారంభిస్తారు. ఇందులో డన్ బైటక్, సఫట్, తాడు ఎక్కడం, మట్టి తవ్వడం ముఖ్యమైనవి. డన్బైటక్ వ్యాయామం ద్వారా కాళ్లు, చేతులు బలంగా తయారవుతాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో తమ స్థాయికి తగ్గట్లు ఐదు వందల నుంచి వెయ్యి వరకు దన్ బైటక్‌లను కొడుతారు. తాడు ఎక్కడం ద్వారా చేతికి పటుత్వం లభిస్తుంది. దంగల్‌లో మట్టిని తోడడం ద్వారా పక్కటెముకలు, వెన్నపూస, భుజాలు ధృడమౌతాయి. పహిల్వాన్ మెనూ ఇదీ.. ⇔ పహిల్వాన్లు ప్రతి రోజు పాలల్లో బాదం, అక్రోడ్, పిస్తా, కర్బూజా, ఇలాచీ, కాలీమిర్చి తదితర డ్రైప్రూట్స్ నానబెట్టి పాలను చిలుకుతారు. ⇔ అనంతరం పాలను వడబోసి తాగుతారు. ఒక్కో çపహిల్వాన్ రోజూ లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలను స్వీకరిస్తారు. ⇔ వీటితో పాటు ఉదయం తాజా పండ్లు, కూరగాయలు మితంగా ఆహారాన్ని తీసుకుంటారు. ⇔ మధ్యాహ్నం వేళల్లో అరటి, పీచు కలిగిన పండ్లను, రాత్రి వేళల్లో మస్కా, నెయ్యితో చేసిన కూరగాయలు, అన్నం తింటారు. ⇔ ఆహారం తీసుకోవడంలో సమయపాలన పాటిస్తారు. నూనె పదార్థాలను తీసుకోరు. కేవలం నెయ్యితో చేసిన కూర లు మాత్రమే భుజిస్తారు. ⇔ ప్రతి ఫహిల్వాన్కు రోజు రూ.300–400ల వరకు ఆహారం కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా దంగల్.. మల్లయోధుల వ్యాయామం కోసం ప్రత్యేకంగా దంగల్ను ఏర్పాటు చేస్తారు. ఈ దంగల్‌లో ఎర్రమట్టిని వేసి ఆ మట్టిలో నెయ్యి, హారతి కర్పూరం, నిమ్మరసం, మంచినూనె, గంధం చెక్కల పౌడర్ తదితర వాటిని కలుపుతారు. శిక్షణ పొందే సమయంలో గాయపడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా వీటిని తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో శరీరం నుంచి వెలువడే చెమట కారణంగా వాసన రాకుండా కర్పూరం తదితరాలను వాడతారు. 12 ఏళ్లు కష్టపడ్డా.. 12 ఏళ్ల పాటు కఠోర శిక్షణ తీసుకుని ఆంధ్ర కేసరీ టైటిల్ సాధించాను. 2004లో ఎల్బీ స్టేడియంలో జరిగిన కుస్తీ పోటీల్లో గెలిచి ఆంధ్రకేసరీ అందుకున్నా. ప్రస్తుతం బార్కాస్‌లోనే బామస్ అకాడా ఏర్పాటు చేసి యువకులకు శిక్షణ ఇస్తున్నా. అకాడ ఆధ్వర్యంలో ఏటా కుస్తీ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. పహిల్వాన్‌గా రూపొందాలంటే కఠోర శ్రమ తప్పనిసరి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరు గంటలు అకాడాలో గడపాల్సిందే. –ఖాలీద్ బామాస్, ఆంధ్రకేసరీ టైటిల్ విజేత పహిల్వాన్ కావాలని ఉంది.. చిన్నతనం నుంచి కుస్తీ పోటీలు చూస్తున్నా..పహిల్వాన్ కావాలన్న ఆశయంతో రహీంపురాలోని వ్యాయామశాలలో మూడేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాను. బార్కాస్‌లో నిర్వహిస్తున్న పోటీల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నా. –రోహిత్ వాక్వాడే, పహిల్వాన్ -
రుణాల పేరిట ఘరానా మోసం
భీమారం(చెన్నూర్): తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేస్తున్న మంచిర్యాల జిల్లా భీమారం మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 8 మంది యువకులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై డి. కిరణ్‌కుమార్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మాట్లాడుతూ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దాసరి సంపత్, దాసరి రవి, దాసరి నరేందర్, తోటపల్లి ప్రశాంత్, దాసరి సన్నీ, కుంటల ప్రదీప్, దాసరి ప్రణీత్‌లు కలిసి వివిధ వ్యక్తుల పేర్లతో సిమ్ కార్డులు సేకరించి వాటితో మోసాలకు పాల్పడుతున్నారు. మే 22న ఒక దినపత్రికలో తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఆసిఫాబాద్‌కు చెందిన మహేష్ అనే వ్యక్తి ప్రకటనలో ఉన్న నంబర్‌కు కాల్ చేశాడు. నిందితులు అతనితో ఫోన్లో మాట్లాడి రుణం కావాలంటే ప్రాసెసింగ్ ఫీజ్ కింద రూ .25 వేలు వారి బ్యాంక్‌ఖాతాలో జమచేయాలన్నారు. మహేష్ వెంటనే బ్యాంక్‌ఖాతాలో డబ్బు జమచేశాడు. నెలలు గడుస్తున్నా రుణం గురించి మాట్లాడకపోవడంతో మహేష్ మరోసారి వారికి కాల్ చేశాడు. కాని నిందితులు సెల్‌ఫోన్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు వాడిన సెల్ నంబర్ ఆధారంగా సిగ్నల్స్ ప్రకారం నిందితులు రెడ్డిపల్లి గ్రామానికి చెందని వారుగా పోలీసులు నిర్ధారించారు. గాలించి మోసానికి పాల్పడిన 8 మంది యువకులను పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. సిబ్బంది మాచర్ల, దివాకర్, సంపత్, రవి, దశరత్, శివప్రసాద్ ఉన్నారు. -
మత్తులో యువత
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: నగరంలో మత్తు మాఫియా విజృంభిస్తోంది. యువతను లక్ష్యంగా చేసుకుని మాదక ద్రవ్యాలు, గంజాయి అమ్మకాలు జరుపుతోంది. స్కూలు నుంచి కాలేజీ స్థాయి వరకూ పలువురు విద్యార్థులు ఈ మాఫియా వలలో పడినట్టు సమాచారం. నగరంలో మత్తు ఇంజెక్షన్లు, గంజాయి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. వీటికి అలవాటుపడిన యువకులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఆర్ధోపెడిక్ ఆస్పత్రుల్లో నొప్పుల నివారణకు ఉపయోగించే ఇంజెక్షన్లను మత్తు కోసం కొందరు వాడుతున్నారు. ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బంది ద్వారా, కొన్ని మెడికల్ దుకాణాల్లో వీటిని సంపాదిస్తున్నారు. తక్కువ ధరకు ఇవి లభించడంతో చాలామం ది వీటికి అలవాటు పడుతున్నారు. ఈ ఇంజెక్షన్లను విక్రయిస్తున్న నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి కంపోడర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నేరాల బాట.. మత్తు ఇంజెక్షన్లు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వాడకానికి అలవాటు పడిన యువకులు వాటిని కొనడానికి నేరాల బాట పడుతున్నారు. చోరీలకు పాల్పడడం, ఒంటరిగా వెళ్లే మహిళల మెడలో నగలను చోరీచేయడం తదితర వాటిని పాల్పడుతున్నారు. అలాగే నగరంలోని కొన్ని మెడికల్ దుకాణాల్లో మత్తు ఇంజెక్షన్లను విరివిగా అమ్ముతున్నారు. వాటిని ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లపై మన రాష్ట్రంలో నిషేధం ఉంది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిపై ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదు. అలాగే ఫోన్లో సంప్రదించిన వారికి కూడా నిర్దేశిత ప్రాంతానికి మత్తు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. గంజాయి అమ్మకం నగరంలో మెయిన్ రోడ్డు, కోటగుమ్మం, గోదావరి బండ్ తదితర ప్రాంతాల్లో గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చిన్నచిన్న పొట్లాలు కట్టి గంజాయిని విక్రయిస్తున్నారు. కొందరు యువకులు గంజాయికి అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. నగరంలోని రాజేంద్ర నగర్, క్వారీ మార్కెట్ సెంటర్, రామకృష్ణ థియేటర్ వద్ద ఉన్న వాంబే గృహాలు, నామవరం వాంబే గృహాల్లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టు సమాచారం. వీరు నిరంతరం మత్తులోనే ఉంటూ చిన్న విషయాలకు కూడా పెద్ద ఎత్తున గొడవలు చేస్తున్నారు. ఇటీవల బస్సు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ఆ మృతదేహం వద్ద వచ్చిన కొందరు యువకులు మాదక ద్రవ్యాలు సేవించి రాద్దాంతం చేసి ఆర్టీసీ బస్సు అద్దాలను బద్దలు గొట్టారు. ఈ సంఘటనపై త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యువకులు, ఆర్టీసీ డ్రవర్ ఇరువర్వాలపై కేసు నమోదు
-
ఉత్సాహంగా ఓటేస్తాం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ దేశమంతా సందడి నెలకొంది. తొలిదశ పోలింగ్‌కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా స్వస్థలాలకు వెళ్లేందుకు పలువురు సిద్ధమవుతుండగా, తొలిసారి ఓటుహక్కును వినియోగించుకునేందుకు యువతీయువకులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏదేమైనా ఓటేయాల్సిందే.. తలకు మించిన భారమే అయినా ఈసారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వస్థలమైన పశ్చిమబెంగాల్‌కు వెళతానని దక్షిణ ఢిల్లీలో ఉంటున్న టీ వ్యాపారి నిఖిల్ పట్వారియా(47) తెలిపారు. ‘ఇటీవల నా తండ్రి అంత్యక్రియలు జరిగాయి. నదియా జిల్లాలోని స్వగ్రామం కృష్ణనగర్‌కు వెళ్లాలంటే రూ.15,000 ఖర్చవుతుంది. అయినా సరే ఊరికి వెళ్లి ఓటు వేస్తాను’ అని వెల్లడించారు. తాను గత 21 సంవత్సరాలుగా ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో టీ–అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. యువతలో అసంతృప్తి హైదరాబాద్‌లో రాజకీయ ప్రచార వ్యూహకర్తగా పనిచేస్తున్న అనుస్తుప్‌రాయ్ బర్మన్(25) ఎన్నికల నేపథ్యంలో స్వస్థలమైన బెంగాల్‌లోని బరసత్‌కు వెళుతున్నట్లు చెప్పారు. మే 19న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకుంటానని తెలిపారు. కాగా, సుస్థిరాభివృద్ధితో పాటు మైనారిటీలపై దాడులు, మూకహత్యలు, పెద్దనోట్ల రద్దుపై యువత ప్రధానంగా అసంతృప్తితో ఉన్నట్లు వెల్లడించారు. రఫేల్ ప్రభావం ఉంటుంది.. మతోన్మాదుల నియంత్రణలో గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని బిహార్‌కు చెందిన ప్రజాసంబంధాల అధికారి ప్రీతి సింగ్(27) అభిప్రాయపడ్డారు. ‘రఫేల్ ఒప్పందంపై చెలరేగిన వివాదం, అవినీతిమయమైన విద్యావ్యవస్థ ప్రధాన సమస్యగా మారాయి. మనకు మంచి నాయకుడు కావాలంటే ప్రతీఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. బిహార్‌లోని పట్నాసాహిబ్ లోక్‌సభ స్థానానికి మే 19న జరిగే ఎన్నికల్లో నా ఓటు హక్కును వినియోగించుకుంటాను’ అని ప్రీతి తెలిపారు. ఢిల్లీకి కేజ్రీవాల్ బెస్ట్.. ప్రధానిగా మోదీ.. ఢిల్లీకి చెందిన ఆటో డ్రైవర్లు రాజు, సకీల్ ఖాన్లు లోక్‌సభ ఎన్నికలపై మాట్లాడారు. ఆటో చార్జీలు పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజు, ఖాన్ స్పందిస్తూ..‘ఆటో చార్జీలు పెరిగితే ఎక్కే ప్రయాణికులు తగ్గిపోయే అవకాశముంది. ఈ నిర్ణయం ఆటో డ్రైవర్లకు నిజంగా> లబ్ధి చేకూరుస్తుందని నేను భావించడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, పనితీరుపై మేమంతా సంతృప్తిగా ఉన్నాం. కానీ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ప్రధాని మోదీకే ఓటు వేస్తాం. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో మంచి పనులు చేపట్టింది. కానీ మోదీ కాకుండా మరో వ్యక్తిని ప్రధానిగా ఊహించుకోలేం. మోదీ గొప్ప ప్రధాని అయితే, కేజ్రీవాల్ గొప్ప సీఎం’ అని తెలిపారు. -
ఆ బైక్ రేసర్లు ఎవరో తేలింది
సాక్షి, విజయవాడ: విజయవాడలో అర్థరాత్రి బైక్ రేసులు నిర్వహించిన యువకులను నగర పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా అర్థరాత్రి కనక దుర్గమ్మ వారధి, కృష్ణలంక నేషనల్ హైవేలపై ఈ బైక్ రేసింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. రేసింగ్‌ల వల్ల తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నామని స్థానికులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం రేసింగ్‌లపై దృష్టి సారించింది. ఇందుకు సంబందించిన సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు సదరు యువకుల వివరాలను కనుగొనేందుకు దర్యాప్తు చేపట్టారు. రేసింగ్‌లో పాల్గొన్న యువకులంతా హైదరాబాద్‌కు చెందిన ‘రోడ్ ర్యాప్జ్’ గ్రూప్‌కు చెందిన వారిగా గుర్తించారు. ప్రతి మూడు నెలలకొకసారి బెజవాడ సమీపంలోని అడ్వెంచర్ క్లబ్లో స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ గ్రూప్ యువకులతో రేసింగ్‌లు జరుపుతున్నట్టు సమాచారం. అ క్రమంలోనే ఇటీవల బైక్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న యువకులు తిరిగి హైదరాబాద్ వెళ్తూ మితిమీరిన వేగంతో బైక్స్ నడపటం, ప్రమాదకర విన్యాసాలు చేసినట్టు పోలీసులు తెలిపారు. క్లబ్లో ఓ రైస్ ట్రాక్‌ను పోలీసులు గుర్తించారు. అయితే అడ్వెంచర్ క్లబ్లో రేసింగ్‌లకు అనుమతులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. యువకుల మీద కేసులు పెట్టె యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
మితిమీరిన వేగంతో బైకు రేసులు