Suriyas Jai Bhim: Film Inspires Chennai Youngsters To Study Law - Sakshi
Sakshi News home page

యువత ఆలోచనల్లో మార్పు తెస్తున్న ‘జై భీమ్’..

Published Sat, Nov 20 2021 2:49 PM | Last Updated on Sat, Nov 20 2021 4:40 PM

Suriyas Jai Bhim Film Inspires Chennai Youngsters To Study Law - Sakshi

ఈ సినిమా చూసిన చాలామంది యువత న్యాయవృత్తిని చేపడతామని బాధితులకి న్యాయం చేకూరేలా తమ వంతు కృషి చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. చెన్నైకి చెందిన శ్రవణ్ అనే కామర్స్ విద్యార్థి ఈ సినిమా చూసిన తర్వాత తాను న్యాయశాస్త్రం చదవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అంతేకాదు తనకు న్యాయ రంగం నచ్చిందని, పైగా ఈ చిత్రంలో సూర్య తీసుకున్న తుది నిర్ణయం తనకు బాధితులకు న్యాయం చేయడానికి ఉపకరించేలా ఉందని అన్నాడు.

(చదవండి: హే! ఇది నా హెయిర్‌ స్టైయిల్‌... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!)

అయితే శ్రవణ్‌ లైంగిక వేధింపుల బాధితులు తమ తప్పు లేకుండానే వారు శిక్షించబడుతున్నారని వారికి న్యాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఎంబీఏ చేస్తున్న శ్రవణ్‌ సత్యనారాయణ అనే మరో విద్యార్థి ఈ సినిమా అట్టడుగు వర్గాలకు సహాయం చేయడానికి, సాధికారత కోసం ఏదైనా చేయాలనే సందేశాన్ని ఇస్తోందని అందువల్ల తాను వారికి ఉద్యోగాలు పొందేలా సాయం చేయాలనుకున్నట్లు చెప్పాడు. అయితే టీ జే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ లీగల్ సినిమా 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారన్న సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో జస్టిస్ కే. చంద్రు పోరాడిన కేసు తాలుకా ఇరులర్ తెగకు చెందిన ఒక జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది.

తమిళనాడు నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమాజంలోని అసమానతలు అణగారిన వర్గాల అణచివేతకు సంబంధించిన ఇతి వృత్తాలను స్పృశిస్తూనే, న్యాయవాది శక్తితో మానవ హక్కులను కాపాడేలా వారి బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఈ మేరకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె. చంద్రు ఈ చిత్రాన్ని "అర్ధవంతమైన సినిమా"గా అభివర్ణించారు. అంతేకాదు దిద్దుబాటు యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని గుర్తు చేస్తోందన్నారు. ఒక న్యాయవాది సునిశితమైన న్యాయవ్యవస్థ సాయంతో  బాధితులకు కచ్చితంగా న్యాయం జరిగేలా చేయడంలో సహాయపడగలరంటూ కె. చంద్రు విశ్వాసం వ్యక్తం చేశారు.

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుక్క.. వందల కోట్ల వారసత్వ ఆస్తి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement