గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.
గుంటూరు క్రైం: గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరం శివారులోని టయోటా షోరూం వెనుక ఉన్న పంట పొలాల్లో ముగ్గురు యువకుల మృతదేహాలు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
హత్యకు గురైన వారిలో ఇద్దరు యువకులు నగరంలోని ఆగ్రహారానికి చెందిన కామేపల్లి రాము(20), రాజేశ్(22)గా గుర్తించారు. మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. వీరిని ఇక్కడే హత్య చేశారా.. లేక వేరే ప్రాంతంలో హత్య చేసి తెచ్చి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు.