
పోలీసుల అదుపులో 181 మంది మైనర్లు
హైదరాబాద్ : పాతబస్తీలో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 181 మంది మైనర్ బాలురను సౌత్జోన్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 202 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించారు. సదరు మైనర్ బాలుర తల్లిదండ్రులను పోలీస్ సమాచారం అందించారు.
తల్లిదండ్రుల సమక్షంలో బాలురకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే కఠినచర్యలు తప్పవని తల్లిదండ్రులు ఎదుట బాలురను పోలీసులు హెచ్చరించారు.