హెచ్‌ఎండీఏ నిర్వాకంతో నష్టపోతున్నాం
హిమాయత్‌నగర్: నెక్లెస్‌రోడ్‌లో ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నా హెచ్‌ఎండీఏ అధికారులు పట్టించుకోవటం లేదని నిర్వాహకులు పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ నిర్వాకం వల్ల తాము రూ.కోట్లు నష్టపోయే పరిస్థితి ఉందని సీపీఐ నగర కార్యదర్శి డాక్టర్ కె.సుధాకర్‌కు శనివారం వివరించారు.
ఈ నెల 15నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉందని, అయితే తేదీ దగ్గర పడినా ఆ స్థలాన్ని ఖాళీ చేయించకుండా హెచ్‌ఎండీఏ కాలయాపన చేసిందని నిర్వాహకులు పృథ్వితేజ్, గుణశేఖర్, జయదీప్, శ్రీదివ్య, ప్రసన్న, అభినయ, శివాని, సనా, ప్రణబ్, భార్గవ్, భవ్యలు తెలిపారు. దీనికి సంబంధించిన నగదును కూడా తాము ముందే చెల్లించామన్నారు. హెచ్‌ఎండీఏ ఏఓకు ఫోన్ చేస్తే స్పందన లేదన్నారు. కనీసం ఇప్పటికైనా స్థలాన్ని కేటాయిస్తే తరువాత ఫెస్టివల్ ఏర్పాటు చేస్తామని, సమస్య పరిష్కారానికి కృషిచేయాలని సుధాకర్‌ను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే లోకాయుక్తాను ఆశ్రయించి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేలా సహకరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.